వార ఫలాలు.. ఈ వారం ఈ రాశి వారికి మినహా మిగతా వారందరికీ అనుకూలంగా లేదు-weekly horoscope in telugu april 21st to april 27th check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. ఈ వారం ఈ రాశి వారికి మినహా మిగతా వారందరికీ అనుకూలంగా లేదు

వార ఫలాలు.. ఈ వారం ఈ రాశి వారికి మినహా మిగతా వారందరికీ అనుకూలంగా లేదు

HT Telugu Desk HT Telugu
Apr 21, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఏప్రిల్21వ తేదీ నుంచిఏప్రిల్27వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వార ఫలాలు.. ఏప్రిల్ 21 నుంచి 27వ తేదీ వరకు
వార ఫలాలు.. ఏప్రిల్ 21 నుంచి 27వ తేదీ వరకు

రాశిఫలాలు (వార ఫలాలు) 21.04 2024 నుండి 27.04 2024 వరకు

సంవత్సరం : శ్రీ క్రోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : చైత్రం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు వాయిదాపడతాయి. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొత్త వ్యక్తులను తొందరపడి నమ్మడంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. పాత బాకీలు వసూలవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి. సోదర వర్గ సహకారం ఉంటుంది. మేష రాశి మరింత శుభఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వార ఫలాల ప్రకారం వృషభ రాశి ఈ వారం అనుకూలంగా లేదు. అనుకున్న విషయాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఇంతకు ముందు రుణములు తీసుకున్న వారు చెల్లిస్తారు. ఆత్మీయ వ్యక్తులతో ఆనందముగా గడుపుతారు. భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. వాగ్వివాదములకు దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. భాగస్వామ్య సంబంధాలు అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. విందు వినోదాలతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటారు. గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆలోచనలు ఉద్వేగపూరితంగా ఉంటాయి. అకస్మిక బహుమానాలు అందుకుంటారు. సంతాన విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలుంటాయి. పూర్వ రుణాలు చెల్లిస్తారు. బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు అశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. స్నేహితులతో అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు విద్యాపరమైన అంశముల మీద శ్రద్దను పెంచుకోవాలి. విదేశీ ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా దూరప్రదేశాలలో తోబుట్టువులకు నూతన అవకాశముల కొరకు మీ సహకారం ఉంటుంది. కుటుంబములో స్త్రీల అరోగ్య, ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. వాహనము కొరకు, గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో అనుకూలంగా ఉంటారు. వ్యవసాయపరంగా అనుకూలం. కర్కాటక రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలముగా లేదు. వృత్తిపరంగా అధిక బాధ్యతలు ఉన్నప్పటికీ మీరు సమయానికి పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. దానివలన వృత్తిపరమైన అలసట, అనారోగ్య సమస్యలు ఏర్పడును. తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి. కుటుంబముతో ఆనందముగా, ఆహ్లాదముగా గడిపెదరు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. మిత్రుల సహకారం ఉంటుంది. గృహ, వాహన సంబంధ అంశములలో చిన్నపాటి మరమ్మత్తుకు అవకాశం. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. సింహ రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్య నారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. కొన్ని పనులలో ఆటంకాలు ఆలస్యాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలాకాలంగా చూస్తున్న రావలసిన ఆదాయమును అందుకుంటారు. మాట విలువ గౌరవం పెరుగుతుంది. నూతన వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాల కొరకు ప్రణాళికలు వేసుకుంటారు. వ్యక్తుల సహకారం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం విష్ణు సహస్రనామం పారాయణ, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. భాగస్వామితో కలిపి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక శ్రద్ద, అలంకరణ మీద ఆసక్తి పెరుగుతాయి. దూర ప్రయాణానికి సంకల్పం చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులుంటాయి. వ్యక్తిగతమైన సంతోషం కొరకు అధికమైనప్పటికీ ఆనందాన్నిస్తాయి. బహుమానాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు కొరకు తోబుట్టువులతో సంప్రదిస్తారు. ఇతరులకు రుణములు ఇస్తారు. సంతానపరమైన అంశములలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆలోచన చేస్తారు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వార ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. మాట పట్టింపులు లేకుండా వాగ్వివాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి. దూర ప్రయాణములలో కొత్త వ్యక్తుల పరిచయాలు. సంతానం అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు. వ్యవసాయ సంబంధ అంశములు మీద దృష్టి పెడతారు. ప్రతి విషయంలోనూ మానసికంగా అందోళన, వైరాగ్యంగా ఆలోచనలు అధిగమించే ప్రయత్నం చేయాలి. కుటుంబంలో భాగస్వామితో అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆధ్యాత్మిక అలోచనలతో స్వాగతం పలుకుతారు. గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా గౌరవం, ఆదాయపరమైన పెరుగుదల. ఆశించిన ప్రదేశములకు స్థానచలనమునకు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆనందాన్నిస్తాయి. సమయానికి నిద్ర, ఆహార స్వీకరణ అవసరం. నూతన విషయాలను తెలుసుకుంటారు. దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. శుభవార్తలు వింటారు. ధనూ రాశివారు ఈవారం మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇతరులకు సహకరిస్తారు. నూతన బాధ్యతలు అధికముగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడతారు. భూమి సంబంధించిన అంశములలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. తోబుట్టువులతో గొడవలకు దూరంగా ఉండాలి. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంతాన సంబంధ విద్యా ఆరోగ్య అభివృద్ధి అంశములలో కొన్ని ఉద్వేగాలకు లోనవుతారు. ఒక వార్త ఘర్షణతో కూడిన ఆనందాన్నిస్తుంది. సమయమునకు తగిన ఆహార స్వీకరణ అవసరం. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

వార ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. వృత్తిపరంగా సంబంధం లేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి. వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. నూతన గృహ, వాహన కొనుగోలు అంశములలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దలు, గురువుల ఆశీస్సులతో ముందుకు సాగుతారు. ఆత్మీయ వ్యక్తుల సహకరాం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. విద్యాపరంగా అభివృద్ధి ఉంటుంది. విదేశీపరమైన విద్యకు అవకాశంగా సూచనలున్నాయి. అధిక ఖర్చులు ఉన్నప్పటికి ఉపయోగాన్నిస్తాయి. వృత్తిపరంగా కొంత అధిక శ్రమ. నూతన బాధ్యతలకు అవకాశముంది. కుంభ రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకు అవకాశముంది. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలలో చికాకులు, నూతన వ్యక్తుల పరిచయాలు ఇబ్బంది కలిగించినప్పటికి ఆత్మబలంతో వాటిని జయిస్తారు. గురువులను, పెద్దలను కలసి ఆశీర్వచనం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనందాన్నిస్తుంది. భాగస్వామికి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటారు. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. ఆత్మీయ మిత్రుల సహకారాన్ని కోరుకుంటారు. ఖరీదైన వాహన కొనుగోలు కొరకు చేయు ప్రయత్నాలు ముందుకు వెళతాయి. మీనరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel