వారఫలాలు.. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు, ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది-weekly horoscope in telugu april 14th to april 20th horoscope check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు.. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు, ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది

వారఫలాలు.. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు, ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది

HT Telugu Desk HT Telugu
Apr 14, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఏప్రిల్14వ తేదీ నుంచిఏప్రిల్20వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వారఫలాలు.. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు
వారఫలాలు.. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు (freepik)

రాశిఫలాలు (వార ఫలాలు) 14.04.2024 నుండి 20.04 2024 వరకు

సంవత్సరం : శ్రీ క్రోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : చైత్రం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో కలసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీమీ రంగాల్లో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఇస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యాపార విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి. దూర ప్రాంతాలు ప్రయాణించవలసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమయానికి ఆహార నియమాలను పాటించాలి. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది. మేషరాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన వారం. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆగ్రహావేశాలను దరిచేరనీయకండి. దుబారా ఖర్చులుంటాయి. బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొంటారు. తోటివారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు జరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. చేసే ప్రతి పనీ కలసివస్తుంది. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

వారఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ముఖ్య విషయాల్లో నిదానంగా మాట్లాడండి. ఊహించిన ఫలితాలుంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసట చెందకుండా చూసుకోవాలి. విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు అధిక లాభాలుంటాయి. భూములను కొనుగోలు చేస్తారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని విషయాలలో ఆత్మస్థైర్యంగా ఉండాలి. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అవివాహితులకు వివాహాది శుభాకార్యములు. కొన్ని శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు లాభాలుంటాయి. మీ బంధువులు, మీ స్నేహితులు మీ విలువను గుర్తించి మీకు గౌరవం ఇస్తారు. మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. నూతన ఆలోచనలతో మంచి పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు నెరవేరతాయి. ఆధ్యాత్మికంగా శుభకాలం. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి మీ అభివృద్ధికి అడ్డురావు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్యనారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి చేస్తారు. మీ రంగాల్లో మీదై పై చేయి అవుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆస్తిని వృద్ధి చేసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. విష్ణు సహస్రనామం పారాయణం, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఆత్మవిశ్వాసంలో ముందుకు సాగి కార్యసిద్ధిని పొందుతారు. మీ పనితీరుకు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆదాయానికి తగిన ఖర్చులుంటాయి. తోటివారి సహకారంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక వార్త బాధ కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలకు పెద్దల అంగీకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలకు మీరు ఆశించిన ధన సాయం అందుతుంది. ఇబ్బంది పెట్టేవారున్నారు జాగ్రత్త. మానసికంగా దృఢంగా ఉంటారు. భక్తి శ్రద్ధలతో పనులు పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో శుభఫలితాలు ఉన్నాయి. గతంలో ఆగిన పనులను పూర్తి చేస్తారు. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందించే అంశాలున్నాయి. గొప్పవారికితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలసివస్తాయి. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా పరిష్కరిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

వార ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో కలసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. మీమీ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థికంగా లాభదాకమైన కాలం. ప్రశాంతముగా గడుపుతారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మ స్వస్థ ఫలితాలున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఎవరితోను వాదోపవాదాలు చేయకండి. కోపాన్ని దరిచేరనీయకండి. అనవసర ఖర్చులుంటాయి. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఒక వార్త బాధ కలిగిస్తుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మానసిక సౌఖ్యం. ఇతరులతో గొడవలకు దూరంగా ఉండాలి. తెలివిగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel