హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (వారఫలాలు) 25.05.2025 నుంచి 31.05.2025 వరకు
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం
మాసం: వైశాఖ మాసం, తిథి : కృష్ణ పక్షం.త్రయోదశి నుంచి శుక్ల పక్షం పంచమి వరకు
మేష రాశి వారికి ఈ వారం ప్రారంభంలో వృత్తి విషయంలో వృత్తిపరంగా ఊహించని వ్యక్తుల సహకారం కొరకు అస్థిర అవకాశాలు, సంతానం యొక్క ఆరోగ్యం, మీ సృజనాత్మకత అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో ఆగుతూ వస్తున్న అభివృద్ధిలో ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల ఆలోచనలు ఇబ్బందిని, ఘర్షణని కలిగిస్తాయి. నిర్ణయ సామర్థ్యంలో, కమ్యూనికేషన్ విషయంలో ఎదుగుదల సుదీర్ఘంగా ఉంటుంది.
ఆర్థిక లాభాలకు సంబందించిన అంశాల కోసం ఎదురుచూస్తున్న వారు వర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తులు, భూములు కొనుగోలు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కొత్త వ్యక్తులను, వారి ఆలోచనలను నమ్మే విషయంలో అదితూరి వ్యవహరించకుండా, స్వయనుడు ప్రభావాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభ రాశి వారు వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం కొంత తగ్గుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. మీ అంతఃకరణ, ఆరోగ్యం, రుణములు, పోటీలు వంటి అంశాలలో పెద్దల సలహా అవసరం. సహధర్మ అభిప్రాయాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా తల్లి తండ్రుల ఆరోగ్య సౌకర్యం, జనసరాల కోసం దృష్టి సారిస్తారు. ఉన్నత విద్య కొరకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు విద్యావిషయాల్లో, పోటీల్లో కొంత సామాన్య ఫలాలు. ప్రస్తుతం ఉన్న వృత్తిలో బాధ్యతలు, నూతన శ్రమ, కొత్త పనులు, వ్యక్తుల పరిచయాలు మోసానికి అవకాసాలు కలిగిస్తాయి.
జీవిత భాగస్వామికి వృత్తిలో అవకాశాలు, దూర ప్రదేశాలలో మిత్రులు, కొలీగ్స్ తో అభిప్రాయ భేదాలు రాకుండా వ్యవహరించాలి. గృహ సంబంధ విషయాల్లో ఖర్చులు, పాత ఋణాలు, వైరాగ్య ఆలోచనలు, చికాకులు నివారించే దిశగా ప్రయత్నించాలి. వారాంతంలో కుటుంబ స్త్రీల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.
మిధున రాశి వారు వారం ప్రారంభంలో ప్రయాణాలు చేసేటప్పుడు స్వార్థపూరితమైన వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి విద్య సంబంధిత విషయాల్లో అభివృద్ధి, ఆశించిన ఫలితాలు పొందుతారు. శక్తిమించిన ఖర్చులు, రాహువు కుంభ, కేతువు, సింహ ప్రవేశంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశాలలో అవకాశాలు, విదేశాలలో ఉండే ఆత్మీయుల సహకారంతో అభివృద్ధి ఉంటుంది.
వారం మధ్యలో దూర ప్రయాణాలు, కమ్యూనికేషన్ విషయంలోనూ నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తగిన వాగ్దాక్షిణ్యం అవసరం. మిత్రులతో, తోబుట్టువులతో వివాదాలకు దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు గౌరవంగా స్పందించాలి. నిరుద్యోగులు వృత్తిలో అభివృద్ధి కొరకు ప్రయత్నించాలి.
ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో రాహువు కుంభరాశిలోనూ, కేతువు సింహరాశిలోనూ మార్పులు, అలాగే రవి వృషభ రాశిలోనూ, గురువు మిధునరాశిలోనూ ప్రయాణాన్ని గమనిస్తే, జీవిత భాగస్వామి అభివృద్ధి, వ్యక్తిగత వృత్తి మొదలైన వాటికి ఖర్చులు, ఆలోచనలు, నూతన పరిచయాలు, మైత్రి బంధాలు బలపడతాయి.
దూర ప్రదేశాలలో వ్యాపార విస్తరణ అంశాల్లో ఆలోచనలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్యం, ప్రయాణ, సంబంధ విషయంలో తగిన శ్రద్ధ అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సంబంధ వ్యవహారాల్లోనూ, మాటల్లో ఉద్వేగం, కోపాన్ని నియంత్రించాలి. స్వార్థపూరితమైన ఆలోచనలు ఆత్మీయులను దూరం చేయవచ్చు.
సింహ రాశి వారు వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక ప్రయాణం, గురువుల సహకారం, ఆశీస్సులు మధ్యలో నూతన స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు బలపడతాయి. రాహు కుంభ రాశిలోనూ, కేతువు సింహరాశిలోనూ మార్పులు, అలాగే రవి వృషభ రాశిలోనూ, గురువు మిధున రాశిలోనూ ప్రయాణం వల్ల ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం.
శ్రమ ద్వారా వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. అవకాశాలు, గుర్తింపు, నూతన వాహనాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా లాభం కంటే గౌరవం పెరుగుతుంది. వృత్తి విషయాల్లో సంతాన అభివృద్ధి, ఆరోగ్య విషయాల్లో ఘర్షణ, ఆలోచనల్లో అధిక ఉద్వేగాలు నివారించాలి. గృహ అలంకార నిమిత్తం కొత్త పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు.
కన్యా రాశి వారు వారం ప్రారంభంలో రుణములు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇంతకుముందు మీ దగ్గర రుణములు తీసుకున్న వారు సమయానికి ఇవ్వడంలో జాప్యం. రాహువు కుంభ రాశిలోనూ, కేతువు సింహ రాశిలోనూ మార్పులు, అదే విధంగా రవి వృషభ రాశిలోనూ, గురు భగవానుడు మిథున రాశిలోనూ ప్రయాణాన్ని గమనిస్తే ఖర్చులు ఎక్కువవుతాయి.
స్థిరాస్తులపై పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం. వృత్తి వేసే ప్రదేశంలో అధిక బాధ్యతలు, శ్రమ, గౌరవం ఉన్నప్పటికీ అనవసర వ్యక్తుల ప్రవర్తన, జోక్యం విసుగు కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలోనూ, దూరవిద్యా, న్యాయ సంబంధ విషయంలోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు, ఇబ్బంది కలిగించే అలవాట్లకు వ్యధన పరులైన స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.
తులా రాశి వారు వారం ప్రారంభంలో తల్లిగారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. స్థిరాస్తులు, వ్యవసాయ సంబంధ పెట్టుబడుల కొరకు, స్వగ్రామ సందర్శన కొరకు తల్లితో సంప్రదిస్తారు. విద్య సంబంధమైన విషయాల కొరకు, నూతన విషయాలు గ్రహించుటలో శ్రమ చేస్తారు. ఆరోగ్యానికి శ్రద్ధ తీసుకోవాలి, సమయానికి ఆహారం, విశ్రాంతి అవసరం. నూతన పెట్టుబడులు, వ్యాపార విస్తరణలో నూతన పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.
విద్యార్థులు జ్ఞాపకశక్తి విషయంలో "శ్రీ హయగ్రీవాయ నమః" మంత్రం జపించుట మేలు. ఆలోచనలు ప్రతిపాదించుటలో అలస్యాలు కాకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఇతరులకు సహకరించడంలో పరిణామంతో ఆలోచించడం వలన ఆశించిన ఫలితాలు తగ్గుతాయి. సంతానం అభివృద్ధి, పెట్టుబడుల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి వారు వారం ప్రారంభంలో వ్యక్తుల సహకారంతో నూతన ఆలోచనలను అమలుపరచడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో సామర్థ్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు. దూరప్రదేశాలలో ఇంటర్వ్యూలు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాహు కుంభ ప్రవేశం, కేతు సింహ ప్రవేశం తో, విద్యార్థులకు పోటీల్లో అనుకున్న ఫలితాలు.
స్థిరాస్తుల అభివృద్ధి కొరకు ప్రయత్నాలు, సాధారణ ఫలితాలు ఎక్కువ. అనవసర ఆలోచనలతో హృదయ ఆందోళన. సంతానంలో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. క్రీడారంగంలో ఉన్నవారు పోటీలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలపై దృష్టి. మీ ఆలోచనలకి, వారి ఆలోచనలకి సమన్వయం లేకపోవడం వల్ల చికాకులు.
ధనుస్సు రాశి వారు వారం ప్రారంభంలో కుటుంబంతో కలిసి చర్చలు, ఆర్థిక సంబంధాలలో ఆలోచనలు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, దైవ దర్శనం, దూర ప్రయాణాలు, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు. ఎక్కువ శాతం సోషల్ మీడియా, స్క్రీన్ టైమ్ తో సమయాన్ని వృథా చేసుకోకుండా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వారం మధ్యలో ముఖ్యాంశాలలో స్థిరాస్తుల విషయంలో తోబుట్టువులతో వారసత్వ విషయాల్లో దూరంగా ఉండాలి.
రాహువు కుంభ రాశిలో ప్రవేశం, కేతువు సింహ రాశి ప్రవేశం, గురువు మిథున, రవి వృషభ స్థానాల వలన సామర్థ్యం పెరుగుతుంది. మిత్రబృందం సహకరిస్తారు. రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. రోగనిరోధక శక్తి, బంధుమిత్రులతో జాగ్రత్తలు అవసరం. వృత్తి విషయంలో శ్రద్ధ వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలు, అభివృద్ధి విషయంలో తగిన కృషి చేయాలి.
మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు, ఆరోగ్య విషయాల్లో అనుమాలు. కుటుంబ, ఆహార, ఆర్థిక విషయాలలో కొత్త వ్యక్తులతో వాగ్వాదానికి, వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సంతాన ఆరోగ్య అభివృద్ధి విషయంలోనూ, గృహంలో స్థిరాస్తుల కొరకు లోన్ తీసుకునే విషయంలోనూ దృష్టి సారిస్తారు.
ఆత్మీయుల ఆరోగ్య, అభివృద్ధి కొరకు ఉద్వేగంతో కూడిన ఆలోచనలు. దగ్గర ప్రయాణాలకు, మిత్రులతో సంప్రదింపులకు అవకాశం. వృత్తిలో కమ్యూనికేషన్ సమస్యను అధిగమించాలి. జీవిత భాగస్వామితో నిదానంగా వ్యవహరిస్తూ భవిష్య ప్రణాళికలను చర్చిస్తూ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. వారం చివరిలో వాహనాలు నడిపే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కుంభ రాశి వారు వారం ప్రారంభంలో వ్యాపార విస్తరణ, ప్రయాణాలు, భాగస్వామ్య వ్యవహారాల విషయంలో జీవిత భాగస్వామి, ఆరోగ్య, సంతానం కొరకు ఖర్చులు, షాపింగ్ అధికంగా ఉంటాయి. వ్యాపార శ్రమ, విశ్రాంతి లోపం కొంత శారీరక నిరుత్సాహత కలిగిస్తుంది. వారంమధ్యలో ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా స్థిరాస్తుల అభివృద్ధి కొరకు, విద్యార్థుల విద్యా సంబంధ అంశాలు, ఆకస్మిక లాభాలు.
ఇప్పటివరకు తగిన ఆర్థిక విషయాలు ముందుకు సాగుతాయి. వారం చివరిలో వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ఇతరుల సహకారం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులతో మంతనాలు, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. శారీరక శ్రద్ధ, నూతన భాషలు నేర్చుకోవడానికి ఉత్సాహం.
మీన రాశి వారికి వారం ప్రారంభంలో నిరుద్యోగులకు నూతన అవకాశాలు, నూతన గృహ, వాహన విషయాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో నిర్లక్ష్యం తగదు. అనవసర వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. న్యాయ సంబంధ అంశాల మీద చర్చలు ముందుకు సాగుతాయి.
దూరప్రదేశాలలో నూతన అవకాశాలు కలిగించినప్పటికీ నిర్ణయ సామర్థ్య లోపంతో పూర్తిగా సద్వినియోగం చేసుకోలేరు. రుణము లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విజయాన్ని సాధించడానికి చేసే కార్యక్రమాలలో శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయంలో అనుకూలంగా ఉంటుంది.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్