రాశి ఫలాలు (వారఫలాలు) 11.05.2025 నుంచి 17.05.2025 వరకు
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం
మాసం: వైశాఖ మాసం, తిథి : శు. చతుర్దశి నుంచి కృ. పంచమి వరకు
మేష రాశి వారికి వారం ప్రారంభంలో విద్య సంబంధమైన విషయాలు కొరకు, నూతన విషయాలు గ్రహించుటలో శ్రమ. విద్యార్థులు జ్ఞాపకశక్తి విషయంలో శ్రీ హయగ్రీవాయ నమః మంత్రం జపించుట మేలు. తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్తిరాస్తులు, వ్యవసాయ సంబంధ పెట్టుబడుల కొరకు, స్వగ్రామ సందర్శన కొరకు తల్లితో సంప్రదిస్తారు.
ఆలోచనలు ప్రతిపాదించుటలో ఆలస్యం కాకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఇతరులకు సహకరించడంలో స్వార్థంతో ఆలోచించడం వలన ఆశించిన లాభాలు తగ్గుతాయి. సంతానం అభివృద్ది విషయంలోని ఇంతకు ముందు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మీయ వ్యక్తులతో విందు వినోదాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు కొరకు అనుకోని ఖర్పులు చేస్తారు.
వృషభ రాశి వారు వారం ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలలో సామర్థ్యాలు పెరుగుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు. దూర ప్రదేశాలలో ఇంటర్యూలు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యక్తుల సహకారంతో నూతన ఆలోచనలని అమలు పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో పోటీలలో అనుకున్న ఫలితాలు.
అనవసర ఆలోచనలతో హృదయాందోళన, సంతానముతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మగ పిల్లలు అభివృద్ధి విషయంలోనూ, స్నేహముల విషయంలోనూ శ్రద్ద తీసుకుంటూ వ్యననములకు లోను కాకుండా జాగ్రత్త వహించాలి. పాత రుణములు చెల్లిస్తారు. క్రీడారంగంలో ఉండే వాళ్ళు పోటీలపై ప్రత్యేక శ్రద్ద పెడతారు.
మిధున రాశి వారు వారం ప్రారంభంలో ఎక్కువ శాతం సోషల్ మీడియా, స్క్రీన్ టైమ్ తో సమయాన్ని వృథా చేసుకోకుండా కంటి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. కుటుంబతో కలిసి చర్చలు, ఆర్థిక సంబంధాలలో ఆలోచనలు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్భన, దైవ దర్శనం, దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు. వారం మధ్యలోస్థిరాస్తులు విషయంలో తోబుట్టువులతో వాదనలకు దూరంగా ఉండాలి.
సామర్థ్యం, పరాక్రమం పెరుగుతాయి. మిత్ర బృందం సహకరిస్తారు. రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వారి మీద, విజయాన్ని సాధిస్తారు. తండ్రి పెద్దలతో వాదోపవాదాలకు లోను కాకుండా తగిన విధంగా భూవిషయాలలో సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్లాలి. విద్యార్థులు పోటీ పరీక్షలు, అభివృద్ధి విషయంలో తగిన విధంగా కృషి చేయాలి.
వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల, ముఖ్యంగా సంతానము ఆరోగ్య, అభివృద్ధి విషయంలోనూ, గృహంలో స్థిరాస్తుల కొరకు లోన్ తీసుకునే విషయంలోనూ దృష్టి సారిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్య విషయం అనుకూలత. కుటుంబ, ఆహార, ఆర్థిక విషయాలలో, కొత్తవ్యక్తులతో వివాదాలకు దూరంగా ఉండాలి.
ఆరోగ్య, అభివృద్ధి కొరకు ఉద్వేగంతో కూడిన ఆలోచనలు చేస్తారు. దగ్గర ప్రయాణాలకి, మిత్రులతో సంప్రదింపులకు అవకాశం. వృత్తిలో కమ్యూనికేషన్ సమస్యను అధిగమించాలి. జీవిత భాగస్వామితో నిదానంగా వ్యవహరిస్తూ భవిష్య ప్రణాళికలను చర్చిస్తూ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి ముందుకు వెళ్లాలి.
సింహ రాశి వారు వారం ప్రారంభంలో ప్రయాణాలు చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాల విషయంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంతానము కొరకు ఖర్చులు, షాపింగులు అధికంగా ఉంటాయి. వారం మధ్యలో ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా స్థిరాస్తులు అభివృద్ధి కొరకు విద్యార్థుల విద్యాసంబంధ అంశాలు, ఆకస్మిక లాభాలు. ఇంతవరకు ఆగిన ఆర్థిక విషయాలు కొంత ముందుకు సాగుతాయి.
వారం చివరిలో వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. ఇతరుల సహకారం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులతో మంతనాలు, కుటుంబంలోని సభ్యులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. మధ్యవర్తిత్వం వహించే వ్యక్తుల స్వార్థపూరిత ఆలోచనల వల్ల కూడా సంఘంలో స్నేహ సంబంధాలు, ఇబ్బందులు కలుగచేస్తాయి.
వారం ప్రారంభంలో నిరుద్యోగులకు సూతన అవకాశాలు, నూతన గృహ వాహన విషయాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. రుణము లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విజయము సాధించడానికి చేసే కార్యక్రమాలలో శ్రద్ద పెట్టాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.
వారం మధ్యలో దీర్ఘకాలిక రోగ్యాల విషయంలో నిర్లక్ష్యం తగదు. అనవసర వృథా ఖర్చుల విషయంలో చూసి వ్యవహరించాలి. న్యాయ సంబంధమైన అంశాల మీద చర్చలు ముందుకు సాగుతాయి. కమ్యూనికేషన్ విషయంలోనూ, తోటి ఉద్యోగస్తులతో, పెద్దలతో వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తులా రాశి వారు వారం ప్రారంభంలో నిర్ణయ సామర్థ్యంలో, కమ్యూనికేషన్ విషయంలో, ఎదుగుదల సుదీర్ఘ ఆలోచనలు కలిగిస్తాయి. షృత్తి విషయంలో అలోచనలు, వృత్తిపరంగా ఊహించని వ్యక్తుల సహకారం కొరకు, ఆకస్మిక అవకాశాలు, సంతానం ఆరోగ్యం, మీ సృజనాత్మకత అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో అగుతూ వస్తున్న అభివృద్ధిలో ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల స్వార్త ఆలోచనలు ఇబ్బం దీని, ఘర్షణని కలిగిస్తాయి.
ఆర్థిక, లాభపరమైన అంశాలలో ఎదురుచూస్తున్న వర్తమానాలు, స్థిరాస్తులు భూములు కాను గోలు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కొత్త వ్యక్తులను, వారి ఆలోచనలను నమ్మే విషుకంలో ఆచితూచి వ్యవహరిస్తూ అనవసర వ్యయములు, ప్రలోబాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన పనులు వాయిదా, ఆరోగ్య శ్రద్ధ, ఔషధ సేవ అవకాశాలు, సోదడు వర్గంతో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్లాలి.
వారం ప్రారంభంలో ఆత్మ విశ్వాసం కొంత తగ్గుతుంది. దూర ప్రయాణములకి అవకాశము, మీ ఆర్థిక, ఆరోగ్య, రణములు పోటీలు అంశాలలో పెద్దల యొక్క సలహా, సహకారం ఉంటుంది. తల్లి తండ్రుల ఆరోగ్య, సౌకర్య, అవసరాల కోసం దృష్టి సారిస్తారు. ఉన్నత విద్య కొరకు ఎదురు చూసే విద్యార్థులకి విద్యా విషయాల్లో, పోటిల్లో కొంత సామాన్య ఫలాలు ప్రస్తుతం ఉన్న వృత్తిలో బాధ్యతలు, నూతన శ్రమ.
కొత్త పనులు, వ్యక్తులు పరిచయాలు, మోసానికి అవకాశములు. జీవిత భాగ స్వామికి వృత్తిలో అవకాశాలు ఉంటాయి. వారము మధ్యలో లాభములు అందినప్పుటికీ వాటిని ఆశతో వృద్ధి చేసే నేపథ్యములో స్వార్దపూరీత వ్యక్తుల వలన కొంత మోసపోయే అవకాశములు.
ధనస్సు రాశి వారికి వారం ప్రారంభంలో శక్తి మించిన ఖర్చులు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాలలో అవకాశాలు విదేశాలలో ఉండే ఆత్మీయుల సహకారంతో అభివృద్ధి ప్రయాణాలు చేసేటప్పుడు స్వార్ధ పూర్తితమైన వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానమునకు విద్య సంబంధమైన విషయాల్లో అభివృద్ధి, ఆశించిన ఫలితాలు పొందుతారు.
ఆత్మ శక్తి పెరుగుతుంది. వారం మధ్యలో దూర ప్రయాణాలు, కమ్యూనికేషన్ విషయంలోనూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులతో, తోబుట్టువులతో వివాదాలకి దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటారు. వచ్చిన లాభాలను సద్వినియోగ పరచుకోవడంలో మోసాలకు గురి కాకుండా తగిన జాగ్రత్త
మకర రాశి వారు వారం ప్రారంభంలో దూర ప్రదేశాలలో వ్యాపార విస్తరణ అంశాలలో ఆలోచనలు, జీవిత భాగస్వామి అభివృద్ధి, వ్యక్తిగత వృత్తి మొదలైన వారి కొరకు అనుకోని ఖర్చులు, ఆలోచనలు, సూతన పరిచయాలు, మైత్రి బంధాలు బలవడతాయి. ఆర్థిక సంబంధమైన అంశాలలో ఆలోచనలు అనుకూలం. వారం మధ్యలో ఆరోగ్య, ప్రయాణ, సంబంధ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
కుటుంబ సంబంధ వ్యవహారాల్లోనూ, మాటలలో ఉద్వేగం, కోపాన్ని నియంత్రించుకోవాలి. స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఆత్మీయులు దూరంపెట్టే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకుంటారు. ఉన్నత విద్య విషయంలో, పోటీ పరీక్షలలో మిశ్రమ ఫలితాలు.
కుంభ రాశి వారు వారం ప్రారంభంలో ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. శ్రమ వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, గురువులు సహకారం. వారం మధ్యలో నూతన స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు బలపడతాయి.
గుర్తింపు, నూతన వాహనాల కొరకు ప్రయ త్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన లాభం కన్నా, గౌరవం పెరుగుతుంది. వృత్తి విషయాలలో, సంతానం అభివృద్ధి ఆరోగ్య విషయాలలో ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనవసరమైన ఖర్చు నియంత్రణ అవసరం.
మీన రాశి వారు వారం ప్రారంభంలో స్థిరాస్తుల పై పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం. రుణములు తీసుకునే ప్రయత్నాలు. ఇంతకుముందు మీ దగ్గర రుణములు తీసుకున్న వారు సమయానికి ఇవ్వడంలో జాప్యం. సంతానం అవసరాల నిమిత్తం ఖర్చు. వారి ఆరోగ్య అభివృద్ధి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వృత్తి ప్రదేశంలో అధిక బాధ్యతలు, శ్రమ, గౌరవం ఉన్నప్పటికీ అనవసర వ్యక్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలోనూ, దూరవిద్యా, న్యాయ సంబంధ విషయం లోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు, ఇబ్బంది కలిగించే అలవాట్లకు వ్యసన పరులైన స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వారం చివరిలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి, సమయానికి ఆహారము విశ్రాంతి అవసరం.
టాపిక్