Weekly Horoscope: ఈ వారం ఈ రాశులకు అనుకోని అవకాశాలు, రుణబాధలు తొలగుతాయి!-weekly horoscope from mesha rasi to meena rasi march 16th to march 22nd check yours now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope: ఈ వారం ఈ రాశులకు అనుకోని అవకాశాలు, రుణబాధలు తొలగుతాయి!

Weekly Horoscope: ఈ వారం ఈ రాశులకు అనుకోని అవకాశాలు, రుణబాధలు తొలగుతాయి!

HT Telugu Desk HT Telugu

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 16.03.2025 నుంచి 22.03.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

ఈ వారం రాశి ఫలాలు

రాశిఫలాలు (వారఫలాలు) 16.03.2025 నుంచి 22.03.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మాసం: ఫాల్గుణ మాసం, తిథి : కృ. విదియ నుంచి కృ. అష్టమి వరకు

మేష రాశి

మేష రాశి వారు ముందడుగు వేసి అనుకున్నది. సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. అన్నింటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో అనుకూలత. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. కొంత సొమ్ము అందుకుంటారు.

కుటుంబసభ్యులు అందరితోనూ ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలకు ప్రణాళిక రచిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలలలో ఆశించిన లాభాలు అందుతాయి. పెట్టుబడులకు ఢోకా లేదు. ఉద్యోగాలలో మీ సత్తా, పని తీరును చాటుకుంటారు. పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు అహ్వనాలు అందుతాయి. మహిళలకు శుభ వర్తమానాలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఎంతటి పనినైనా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్నేహితులు, ఆప్తుల సలహాలు పాటిస్తూ విజయాలు సాధిస్తారు. నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. రుణబాధలు తొలగుతాయి, బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.

అందరితోనూ మీ అభిప్రాయాలు పంచుకుంటారు. ఆరోగ్యపరంగా ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. లాభాలు తథ్యం, ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు కార్యదక్షతను నిరూపించుకుంటారు, మంచి గుర్తింపు రాగలదు. మహిళలకు నూతనోత్సాహం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథున రాశి

ఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. ఇంటా బయటా మీకు ఎదురుండదు. మీ నిర్ణయాలకు అందరూ సహకరిస్తారు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. పెండింగ్ బాకీలు వసూలవుతాయి. అకస్మిక ధనలబ్ది, సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలకు స్వస్తి చెబుతారు. వ్యాపారాలలో క్రమేపీ అనుకూలత పెరిగి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు సోదరుల నుంచి ఆహ్వానాలు. దేవీ ఖడ్గమాల పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి మించిన అదృష్టవంతులు ఉండరనేది నిర్ధారణ కాగలదు. ఆలోచనలు కార్యరూపంలో పెడతాడు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ముఖ్యులతో చర్చలు సఫలం. తీర్థయాత్రలు చేస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వాహనయోగం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబ సమస్యలు తీరి ఊరట బభిస్తుంది. మీకు ఎదురుండదు.

శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు, భాగస్వాములతో ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న బదిలీలు ఉంటాయి. ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారుముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు మరింత అనుకూలం. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. తీర్ధయాత్రలు చేస్తారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబపరంగా సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్ధాలు తొలగుతాయి. కొద్దిపాటి రుగ్మతలు బాధించినా క్రమేపీ ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో సత్తా చాటుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. రాజకీయవేత్తలకు పదవులు దక్కవచ్చు. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. కనకధారా స్తోత్రాలు వరించండి.

కన్య రాశి

కన్య రాశి వారికి మొదట్లో ఉన్న చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఆత్మీయులు, మిత్రులతో చర్చలు. జరుపుతారు. నిరుద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు, మీ ఆశయాలు, లక్ష్యాలు సాధించేందుకు మార్గం ఏర్పడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడి అవసరాలు తీరతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సోదరులతో సబ్యత. కొద్దిపాటి రుగ్మతలు బాధ పెట్టవచ్చు. వ్యాపార విస్తరణ యత్నాలలో కదలికలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శివస్తోత్రాలు పరించండి.

తుల రాశి

తుల రాశి వారి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవసరాలకు తగినంతగా సొమ్ము అందుతుంది. కుటుంబసభ్యులు మీరు చేదోడుగా నిలుస్తారు.

కొన్నిసమస్యలు తీరతాయి. కొన్ని రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు దక్కుతాయి. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలకు పదవీయోగ సూచనలు. మహిళలకు భూ లాభాలు ఉండవచ్చు. దుర్గామాత స్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఎంతటి వారినైనా మీ నైపుణ్యం, వాక్చాతుర్యంలో ఆకట్టుకుంటారు. ప్రతిభకు తగిన గౌరవం అందుకుంటారు. విద్యార్థులు కొత్త కోర్సులు దక్కించుకుంటారు. మిత్రులతో విభేదాలు తొలగి ఊరట చెందుతారు. కాంట్రాక్టులు. దక్కించుకుంటారు. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో అందరూ మెచ్చుకునే రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలపై చర్చిస్తారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. గత సంఘటనలు నెమరువేసుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గతం కంటే మెరుగుపడి రుణాలు కూడా తీరతాయి.

కుటుంబంలో అందరితోనూ సఖ్యత నెలకొంటుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు అంటి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవేత్తలకు పదవీయోగ సూచనలు. మహిళలకు శుభవార్తలు అంచుతాయి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకర రాశి

మకర రాశి వారి శ్రమ ఫలించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తులు మరింతగా చేరువ కాగలరు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అప్పులు కూడా తీరతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తీరి ఊరట చెందుతారు.

శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. శారీరక రుగ్మతలు కొంత బ్యాధిస్తాయి. వ్యాపారాలలో లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు ఉత్సాహవంతమైన కాలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు, మిత్రులు శత్రువుల్లా మారతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. రుణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ఆకారణంగా విభేదాలు నెలకొంటాయి. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలలో మరింత శ్రద్ధ వహించాలి. పెట్టుబడుల్లో తొందరవద్దు. ఉద్యోగాలలో ఊహించని బదిలీలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. మహిళలకు సోదరులు, సోదరీలతో గణేశత్రాలు పఠించండి.

మీన రాశి

మీన రాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు సహాయపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. కొన్నివివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం, స్వీయానుభవంతో నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ బాకీలు వసూలవుతాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి.

కుటుంబబాధ్యతల విషయంలో రాజీపడరు. బంధువులు తోడ్పాటు అందిస్తారు. ఆరోగ్యం. క్రమేపీ మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అధిక లాభాలు గడిస్తారు. నూతన భాగస్వాములను ఆహ్వానిస్తారు. ఉద్యోగాలలో విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవేత్తలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు, మహిళలకు మానసిక ప్రశాంతత. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk

సంబంధిత కథనం