హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (వారఫలాలు) 08.06.2025 నుంచి 14.06.2025 వరకు
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం
మాసం: జ్యేష్ట మాసం, తిథి : శు. ద్వాదశి నుంచి కృ. తదియ వరకు
మేష రాశి వారు ఈ వారం వాహన, విద్య, అభ్యాసంపై ఎక్కువ దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. డ్రైవింగ్ చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు విద్యాసంబంధమైన విషమాలలో వ్రాయటంపై దృష్టి కేటాయించాలి. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. సంతాన సంబంధ అభివృద్ధి కొరకు ఆరోగ్య నిమిత్తం ఖర్చులు చేస్తారు. తగిన శ్రద్ధ తీసుకుంటారు.
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. బందుమిత్రులతో మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. గౌరవం ఇచ్చి గౌరవం పొందాలి. ఇబ్బంది పెట్టే స్నేహ వర్గానికి దూరంగా ఉండాలి. దూర ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ పారాయణం మంచిది.
వృషభ రాశి వారికి ఈ వారం అంగారక, చంద్రులు తృతీయ స్థానస్థితి వలన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్రంగా కృషి చేస్తారు. సహకారం, కమ్యూనికేషన్, ప్రయాణాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. రావలసిన రుణములో అందుకుంటారు. విద్యావిషయాలలో తగిన శ్రద్ధ అవసరం. వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమ, ఇతరుల జోక్యం ఇబ్బందిని కలిగిస్తాయి.
గృహ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. మాతృ సంబంధ అంశాలలో ఖర్చులు, సమయానికి ఆహార స్వీకరణ మంచిది. మిత్రులతో కలిసి విందు వినోదాల కొరకు ఖర్చులు అధికంగా చేస్తారు. సదయంగా, స్ఫూర్తిగా మాట్లాడుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత శ్రద్ధ, హాబీలపై దృష్టి సారిస్తారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు అమ్మవారి ఆరాధన మంచిది.
మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు, చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. రావలసిన రుణాలు అందుకుంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. కుటుంబ వ్యవహారాల్లో అపార్థాలకు, ఘర్షణలకు తావివ్వకుండా ముందుకు వెళ్లాలి. ప్రయాణాల విషయంలో, కొత్త వ్యక్తుల పరిచయాలలో ముఖ్యంగా కమ్యూనికేషన్‌ఒక్కలలో ఆచితూచి వ్యవహరించాలి.
విద్యాసంబంధమైన అంశాలలో దూర ప్రయాణాలు, విదేశీ అవకాశాలు, ఉన్నత వ్యక్తులను సంప్రదించి పనులు నిర్వర్తించుకోవడంలో విదానం అవసరం. తండ్రి ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకుంటారు. వృత్తి వ్యవహారాలలో ఇతరుల సహకారం అందుతుంది. తల్లిదండ్రుల సౌకర్యాల కోసం ఆలోచనలు చేస్తారు. వ్యవసాయం, స్వగ్రామం, సుదర్శనంపై ఆసక్తి అధికంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి ఈ వారం తీవ్ర ఒత్తిడి, ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. వృత్తి, సంతాన అంశాల మీద స్థాయిలో దృష్టి సారించడానికి కృషి చేస్తారు. మానసిక ఉద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి ధ్యానం (మెడిటేషన్) మంచిది. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక సంబంధ విషయాలపై దృష్టి సారిస్తారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు కాకుండా జాగ్రత్త వహించాలి.
మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, వృత్తిరీత్యా ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు అవసరం. మానసిక స్థిమితం పెంచుకోవాలి. వాదనల తర్వాత గృహ, వాహన విషయాలు, స్థిరాస్తుల సెటిల్‌మెంట్ కొరకు ప్రయత్నాలు అధికంగా ఉంటాయి.
సింహ రాశి వారికి నిద్రలేమి, అధిక ఒత్తిడి, వ్యాపార సంబంధిత ప్రయాణాలు, రావలసిన రుణములు పొందడంలో అధిక ప్రయత్నం అవసరం. నిరాశ, చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. తల్లితండ్రులతో సంప్రదింపులు, ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో చర్చలు ఉంటాయి. వారికి విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి.
ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో వ్యాపార భాగస్వాములతోనూ, పెట్టుబడుల విషయంలో ఘర్షణాత్మక వాతావరణం నివారించాలి. నెట్‌వర్క్ పెంచుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి పరిరక్షణ, అభివృద్ధి కలుగుతాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. దర్పంగా కాకుండా ధైర్యంగా ఉండాలి.
కన్య రాశి వారికి ఈ వారం చంద్రుడు, కుజునితో కలిసి లాభస్థానంలో సంచారం, నూతన పరిచయాలు, ప్రయాణాలు, విద్యాసంబంధ రీసెర్చ్ అంశాలు ఆకస్మిక లాభాలను ఇస్తాయి. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆశించిన విషయాలలో భూమి, ఆస్తి విషయాలు, తోబుట్టులతో సంబంధాలు బలపడతాయి. ఆకస్మిక ఖర్చులు శక్తికి మించి ఉంటాయి. ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, ప్రవచనాలు, ప్రసంగాలు ఆనందాన్నిస్తాయి.
దూరదేశ పర్యటనల కొరకు కొత్త ఆలోచనలు చేస్తారు. నిద్రలేమి, ఒత్తిడి, ఖర్చులు, పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. రుణాలు చెల్లిస్తారు. మానసిక ఆనందం, ఉత్సాహం పెరుగుతుంది. ఆశించిన విషయాలలో విజయం సాధిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి, కొత్త విషయాల అధ్యయనం చేస్తారు. స్థిరాస్తి, భాగస్వామ్య వ్యవహారాలు ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధువుల రాక, విందులు, వినోదాలు ఆనందాన్నిస్తాయి.
తులా రాశి వారికి రాజ్యస్థానంలో చంద్రుడు, కుజుడు సంచారం, లాభస్థానంలో కేతు, సప్తమ శుభ అనుసరించి వృత్తి విషయంలో, భాగస్వామ్య అంశాలలో కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన లాభాలను, వృత్తిధరంగా పెట్టిన పెట్టుబడుల విషయంలో అందిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా అవరాలములను సద్వినియోగం చేసుకోవాలి. రహస్య శత్రువుల విమర్శలను, అవమానాలను అధిగమించే ప్రయత్నం చేయాలి.
విద్యాపరమైన విషయాలు విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. రీసెర్చ్ స్టూడెంట్లకు, వైద్య విద్యార్థులకు తగిన సమయం. విదేశీ అవకాశాలు, వ్యక్తిగత శ్రద్ధ పెంచుకోవాలి. చైనందిన వ్యవహారాల్లో ఒక ప్రత్యేక విధానం అవలంబిస్తారు. ఆరోగ్యం, ఆహార అలవాట్లు మార్పులు, బ్యూటీ క్లినిక్స్, బోటిక్ నడిపేవారికి అవకాశాలు బాగుంటాయి. మార్షల్ ఆర్ట్స్, సంగీత, నృత్య కళలపై మక్కువ పెరుగుతుంది.
తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. శత్రువులపై విజయం సాధించేందుకు నైపుణ్యాలు పెంపొందిస్తూ ముందుకు వెళతారు. దూర ప్రయాణానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన విషయాలపై కొంత అసంతృప్తి ఉంటుంది. గృహ, స్థిరాస్తి, వాదకత్వ అంశాల్లో కీలక చర్చలు, జాగ్రత్తగా మోసపోకుండా ఉండాలి. డ్రైవింగ్‌పై శ్రద్ధ అవసరం. వృత్తిలో అధికారులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి.
ఆర్థిక, కుటుంబ ఖర్చులు అధికం. కుటుంబంతో, భాగస్వామి, బంధువుల కలయిక, సమావేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనలు కనిపిస్తాయి. వారాంతంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం ఖర్చులు అధికం. మంచి ఫలితాల కోసం సత్యనారాయణ స్వామి దేవాలయ సందర్శన మంచిది.
ధనుస్సు రాశి వారికి ఈ వారం సంతాన సంబంధిత ఖర్చులు ఉంటాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు, కొత్త విషయాలు మొదలవుతాయి. ఆకస్మిక వాయిదాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. తండ్రి ఆరోగ్యం కోసం శ్రద్ధ అవసరం.
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాల్లో ఆసక్తి కొంత తగ్గుతుంది. శత్రువులపై విజయం, త్యాగాలు పెరగడం, దగ్గర ప్రయాణాలు, కొత్త పరిచయాలు మోసపోవకుండా జాగ్రత్త అవసరం. గృహ, వాహన, విద్య, మాతృ సంబంధ అంశాల్లో అధిక శ్రద్ధ అవసరం. వృత్తిలో అభివృద్ధి, స్వంత వ్యాపారంపై ఆసక్తి పెరుగుతుంది. లాభదాయక వాతావరణం ఉంటుంది. ఆలోచనలు ఫలిస్తాయి. సంతాన వృద్ధి, సృజనాత్మక విషయాలు బాగుంటాయి. వాహన కొనుగోలుకు ఆలోచనలు ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం లక్ష్మీనారాయణ స్తోత్రం పారాయణం మంచిది.
మకర రాశి వారికి ఈ వారం స్థిరాస్తులు, ఆర్థిక, వాహన వ్యవహారాలు కొంతవరకు అనుకూలతతో కూడిన మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం బహుమతులు ఇవ్వడం, వారి కొరకు ఆలోచనలు చేస్తారు. మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం తగదు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మానసిక చికాకుల విషయంలో వైద్యులను సంప్రదిస్తారు.
సంతాన అభిప్రాయాలతో చికాకులు లేకుండా సమన్వయం పాటించాలి. వారి అభివృద్ధి, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. విద్య, దూర ప్రవేశాల్లో అవకాశాల కోసం మీ వంతు కృషి చేస్తారు. తండ్రి ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యాపరంగా అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో విజయం. గణితం, లాజిక్ వంటి విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు.
కుంభ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. రోగనిరోధక శక్తి కొంతవరకు బాగానే ఉంటుంది. శత్రువులపై విజయాలు సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళతారు. నూతన ఉద్యోగావకాశాల కోసం ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు. మిత్రుల సహకారం, శక్తి సామర్థ్యాలు పెంచుకుంటారు. లక్ష్య సాధనలో అనుకూలత కొరకు తగిన విధంగా ప్రయత్నాలు చేస్తారు.
భాగస్వామ్య వ్యవహారాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. గృహ వాతావరణం సౌకర్యంగా ఉంటుంది. విద్యార్థులకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అపార్థాలు రాకుండా తగిన విధంగా ముందుకు వెళ్లాలి. స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఆత్మీయులు, మిత్రులు దూరం కావచ్చు. వారసత్వ ఆస్తుల విషయంలో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్త అవసరం.
మీన రాశి వారికి ఈ వారం అధిక ఉద్వేగపూరితమైన ఆలోచనలు కనిపిస్తాయి. సంతానంతో విభేదాలు రాకుండా జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాలు, పెట్టుబడులపై ఆలోచనలు చేస్తారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. శక్తిని వృత్తిలో వినియోగించి, నూతన అవకాశాలు పొందుతారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.
సంతానానికి విదేశీ అవకాశాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు వ్యతిరేకంగా ఉండడం వల్ల వైరాగ్య ధోరణి కనిపించవచ్చు. జీవిత భాగస్వామికి నూతన అవకాశాలు. తల్లి ఆరోగ్యం కొంతవరకు మెరుగవుతుంది. మాటలతో పనులు సాధించుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉంటే సోదరి సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. పెట్టిన పెట్టుబడులపై అభివృద్ధి కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
టాపిక్