ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. వారికి వ్యాపారాల్లో లాభాలు, పసుపు, నేరేడు అదృష్ట రంగులు.. ఆదిత్య హృదయం పఠించండి-weekly horoscope from mesha rasi to meena rasi june 29th to july 5th ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. వారికి వ్యాపారాల్లో లాభాలు, పసుపు, నేరేడు అదృష్ట రంగులు.. ఆదిత్య హృదయం పఠించండి

ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. వారికి వ్యాపారాల్లో లాభాలు, పసుపు, నేరేడు అదృష్ట రంగులు.. ఆదిత్య హృదయం పఠించండి

HT Telugu Desk HT Telugu

ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 29.06.2025 నుంచి 05.07.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

ఈ వారం రాశి ఫలాలు (freepik )

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 29.06.2025 నుంచి 05.07.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: ఆషాడ మాసం, తిథి : శు. చవితి నుంచి శు. దశమి వరకు

మేష రాశి

మేష రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వర్తమానాలు, అదనపు రాబడి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయ వర్గాలకు సన్మానాలు, దూర ప్రయాణాలు. అనారోగ్యం, బంధు విరోధాలు. లేత నీలం, గులాబీ రంగులు. విష్ణు ధ్యానం చేయండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలితమిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. కళాకారులకు సన్మానాలు, ఊహించని అవకాశాలు. బంధువులతో తగాదాలు, కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

మిథున రాశి

మిథున రాశి వారు సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభ వర్తమానాలు. రాబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కార్య సిద్ధి, పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. రాజకీయ వర్గాలకు పదవీయోగం. వృథా ఖర్చులు అధికం, మానసిక ఆందోళన. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన పురోభివృద్ధి. వ్యయ ప్రయత్నాలు, ఆరోగ్య భంగం. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి పనులు నిదానంగా సాగుతాయి. స్నేహితులతో స్వల్ప వివాదాలు, కలహాలు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. తీర్ధయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కే ఛాన్స్. వ్యయ ప్రయత్నాలు, మనశ్శాంతి లోపిస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కన్య రాశి

రావలసిన డబ్బు అంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆప్తులతో వివాదాలు తీరతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఊహించని అవకాశాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

తుల రాశి

తుల రాశి వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం మరింత తగ్గుతుంది. కళాకారులకు అన్ని విధాలా అనుకూలం. బంధు విరోధాలు, పనిఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. శివారాధన మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి రావలసిన సొమ్ము అందుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు, వాహన, గృహయోగాలు. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది, లాభాలు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. ధన వ్యయం, ఆరోగ్య, కుటుంబ సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. దేవీ ఖడ్గమాల పఠించండి.

ధనుస్సు రాశి

అనుకున్న ఆదాయం లభించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూ వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు. అనారోగ్య సూచనలు, శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకర రాశి

మకర రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూముల కొనుగోలు, ఆదాయం ఆశాజనకం. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. రాజకీయ వర్గాలకు కొన్ని విజయాలు వరిస్తాయి. బంధువులతో తగాదాలు. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారు ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు పరిష్కారమవుతాయి. సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు, ఇంట్లో శుభకార్యాల సందడి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆశలు చిగురిస్తాయి. ధన నష్టం, అనారోగ్య సూచనలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

మీన రాశి

ఆదాయం కొంత నిరుత్సాహ పరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు, బాధ్యతలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు కొంత నిరాశ ఎదురవుతుంది. అనారోగ్య సూచనలు. నిరుద్యోగులకు కొంత గందరగోళం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. వాహనయోగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.