ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. వాళ్ళకు కొత్త అగ్రిమెంట్లు, పదోన్నతులు, సన్మానాలు!-weekly horoscope from mesha rasi to meena rasi june 22nd to june 28th ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. వాళ్ళకు కొత్త అగ్రిమెంట్లు, పదోన్నతులు, సన్మానాలు!

ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. వాళ్ళకు కొత్త అగ్రిమెంట్లు, పదోన్నతులు, సన్మానాలు!

Peddinti Sravya HT Telugu

ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 22.06.2025 నుంచి 28.06.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

ఈ వారం రాశి ఫలాలు (Canva)

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 22.06.2025 నుంచి 28.06.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: జ్యేష్ఠ/ఆషాడ మాసం, తిథి : కృ. ద్వాదశి నుంచి శు. తదియ వరకు

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూముల కొనుగోలు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. కళాకారులకు శుభవార్తలు. వారం చివరిలో ఆరోగ్య భంగం. పసుపు, లేత ఎరుపు రంగులు; ఆదిత్య హృదయం పఠించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంతకాలం వేధించిన సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. భూ వివాదాలు తీరతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఇంటా బయట ఒత్తిడులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఆశించిన పదోన్నతులు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఖర్చులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు; విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథున రాశి

ఈ వారం అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన సొమ్ము సైతం అందుతుంది. మీపై ఉంచిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగ లాభం, వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు, కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వ్యయ ప్రయాసలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు; ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఈ వారం ఎంతటి కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరు, ప్రతిష్ఠలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం, కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు; దేవీస్తోత్రాలు పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారు కొంత శ్రమపడాల్సిన సమయం. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పనులు కొన్ని నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు; దుర్గాదేవిని పూజించండి.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ వారం అనుకున్న కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు సొమ్ము అందుతుంది. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో ఏకీభవిస్తారు. విద్యార్థుల యత్నాలు నఫలం. ఆస్తి వివాదాలు కొంతమేరకు పరిష్కారం. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు తథ్యం. వారం ప్రారంభంలో వివాదాలు, అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు; శివస్తోత్రాలు పఠించండి.

తుల రాశి

ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు నూతనోత్సాహం. ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. భూములు, వాహనాల కొనుగోలు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు, మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు; కనకధారాస్తోత్రం పఠించండి.

వృశ్చిక రాశి

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు. విద్యార్థులకు శుభవార్తలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగల అవకాశం. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వివాదాలు, అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు; శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు రాశి

ఈ వారం ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇంటా బయట ఒత్తిడులు ఎదురవుతాయి. అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. చిరకాల మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు, ధనలాభం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు; విష్ణుధ్యానం చేయండి.

మకర రాశి

మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంతవరకూ అనుకూలిస్తుంది. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభను నిరూపించుకుంటారు. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయ వర్గాలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు, పని ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు; హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభ రాశి

ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు కొంతవరకూ పరిష్కారం. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం ఉండవచ్చు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. కళాకారులకు సన్మానయోగం. వారం ప్రారంభంలో ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు; గణేశ్ స్తోత్రాలు పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు అవార్డులు. వారం చివరిలో ధన వ్యయం. నలుపు, ఆకుపచ్చ రంగులు; రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.