ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. వారికి విదేశీ అవకాశాలు, లలితా దేవిని ప్రార్థించటం మంచిది!-weekly horoscope from mesha rasi to meena rasi july 6th to july 12th ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. వారికి విదేశీ అవకాశాలు, లలితా దేవిని ప్రార్థించటం మంచిది!

ఈ వారం రాశి ఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. వారికి విదేశీ అవకాశాలు, లలితా దేవిని ప్రార్థించటం మంచిది!

HT Telugu Desk HT Telugu

ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 06.07.2025 నుంచి 12.07. 2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

ఈ వారం రాశి ఫలాలు

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (వారఫలాలు) 06.07.2025 నుంచి 12.07. 2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: ఆషాడ మాసం, తిథి : శు. ఏకాదశి నుంచి కృ. విదియ వరకు

మేష రాశి

మేష రాశి వారికి వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా, ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు పోటీ తత్వం పెరుగుతుంది, రుణములు చెల్లిస్తాడు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అనవసర ఖర్చులను కొంతమేర నియంత్రించుకోగలరు. రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తలు అవసరం, జాత్య వర్ణంలో విభేదాలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతను పొందుకోవడానికి ప్రయత్నాలు వేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కొత్త పనులు మొదలు పెడతారు. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు, జీవిత భాగస్వామి సహకరిస్తారు.

వారం మధ్యలో కుటుంబ వ్యవహారాలలో సంబంధమైన విషయాలలో ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి. వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారు వారం ప్రారంభంలో ఫలితములు గమనించగా సంతాన సంబంధమైన, పెట్టుబడుల విషయాలలో కొంత చికాకులు, ఉద్వేగాలు అధికంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్థిక ఖర్చులు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమయానికి ఆహార స్వీకరణ, విశ్రాంతి అవసరం. వృత్తిపరమైన ప్రయాణములు, జీవిత భాగస్వామితోను, వారి బందువులతో మాట్లాడేటప్పుడు అనవసర అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్తలు అవసరం.

పౌరుషం, నాయకత్వ లక్షణాలు, ఆధిపత్య ధోరణిని విడనాడాలి. చిన్నచిన్న విషయాలకు కలహములు, అపార్థములు ఉండకూడదు, జాగ్రత్తలు అవసరం. సంబంధించిన అంకెల మీద విస్తృతంగా దృష్టి సారిస్తారు. వారం చివర్లో కోపాన్ని, పౌరుషాన్ని నియంత్రించుకోవాలి. విద్యార్థులు విద్యాసంబంధమైన విషయంపై దృష్టి సారించాలి.

మిధున రాశి

మిధున రాశి వారికి వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా గృహ, వాహన, తల్లి ఆరోగ్యం, వ్యవసాయ సంబంధ అంశాలలో కొంత అసౌకర్యం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు విద్యపై దృష్టి అవసరం. లాభ చంద్ర సంచారము ద్వారా సంతానంతో అనుబంధం, అనుకూలత, సృజనాత్మకత పెరుగుతుంది. ఎదురు చూస్తున్న వర్తమానాలు దొరకడం మంచి ఫలితాన్నిస్తుంది. ఒక వార్త ఆసక్తిని రేకెత్తిస్తుంది.

వారం మధ్యలో అనవసర ఖర్చులు, వాగ్దానాలకు దూరంగా ఉండాలి. తోబుట్టువులతో, ముఖ్యంగా అన్నదమ్ములతో సఖ్యత అవసరం. సంతానం నుంచి బహుమతులు అందుకుంటారు. పాపింగ్‌లు, విందు వినోదాలు, మంచి ఖర్చులు ఆనందాన్ని ఇస్తాయి. మరిన్ని మంచి ఫలితాల కొరకు గణేష్ ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు వారం ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రవి మిధునలోకి ప్రవేశించడంతో వ్యయ ప్రభావం, కొంత ఖర్చులు, తదితర వైద్య సాహసాలు పెరుగుతాయి.

నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధమైన పనుల్లో వేగం, ఉత్సాహం, గురువుల ఆశీర్వచనాలు, ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలకు కొంత అవకాశాలు ఉంటాయి. వారం మధ్యలో ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశాలలో ఉండే తోబుట్టువులు, స్నేహితుల సహకారం, బహుమానాల రూపంలో అందుతుంది.

సింహ రాశి

సింహ రాశి వారు వారం ప్రారంభంలో మాటల విషయంలో, కుటుంబ వ్యవహారాలలో, గృహ వాతావరణంలో, కుటుంబ సభ్యులతో, ఆర్థిక అంశాలలో తగిన విధంగా అచంచలంగా వ్యవహరించాలి. ఆకస్మిక చికాకులు, ఇబ్బందులు కలిగించే విధంగా అనవసర ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వారం మధ్యలో వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలకు అవకాశం, బాధ్యతలు పెరుగుతాయి. అనవసర విమర్శలకు దూరంగా ఉండాలి.

వారాంతంలో సహకారం, ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎంతగానో ఎదురుచూస్తున్న విషయాలలో దూర ప్రదేశం నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, బంధువర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

కన్య రాశి

కన్య రాశి వారు వారం ప్రారంభంలో ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ, ప్రయాణాలలో చికాకులు, అనవసర వ్యయాలు ఉంటాయి. ఆశించిన అంశాలలో సాధారణ ఫలితాలు ఇస్తాయి. కుటుంబ వాతావరణంలో ఆనందం కలుగుతుంది. దూరప్రదేశాల నుంచి సమాచారాలు కొంత ఆనందాన్ని ఇస్తాయి. పౌరుషం పెరుగుతుంది.

కంటి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. వృత్తికి సంబంధించిన విషయాలలో, భాగస్వామ్య వ్యవహారాలలో ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం ఆశిస్తారు. వారం మధ్యలో దూర ప్రయాణానికి, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి విదేశీ అవకాశాలు ఉంటాయి. వారం చివర్లో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మరిన్ని ఫలితాల కొరకు లలితా దేవిని ప్రార్థించటం మంచిది.

తులా రాశి

తులా రాశి వారు వారం ప్రారంభంలో చంద్రసంచారాన్ని పరిశీలించగా, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం పై తగిన శ్రద్ధ అవసరం. చంద్రుని ప్రభావం వల్ల సంఘంలో గుర్తింపు, గౌరవం, చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ధన రాబడి ఉంటుంది.

వారం మధ్యలో తండ్రి ఆరోగ్యం, ఆత్మీయ విషయాలు, విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, వ్యాపార వ్యవహారాలు కొంత ఆందోళన కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయాలి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. అశాంతిని అధిగమిస్తారు. దైవ చింతన, సంకల్పబలంతో అనుకున్నది సాధిస్తారు. మంచి ఫలితాల కొరకు మార్గాదేవి ఆరాధన మంచిది.

వృశ్చిక రాశి

వారం ప్రారంభంలో ఆకస్మిక క్రమంలో విజయం, ఆర్థిక లాభం, ఆగుతూ వస్తున్న అనేక పనులు ముందుకు వెళతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, మిత్రుల సహకారం, పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన పనులు జరగడానికి సూచనలు వస్తాయి. అనవసర ఖర్చులు నియంత్రించగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ మీద మీరు నమ్మకం పెరుగుతుంది, స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడతాయి.

వారం మధ్యలో వ్యాపార విస్తరణ, గృహ సంబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు, విందు వినోదాలు జరుగుతాయి. భాగస్వామ్య వ్యవహారాలలో పెట్టుబడులకు ఆలోచనలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కొత్త కార్యక్రమాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరిన్ని మంచి ఫలితాల కొరకు సూర్యనారాయణ స్వామి ఆరాధన మంచిది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు వారం ప్రారంభంలో వృత్తి సంబంధిత విషయాలలో అధిక శ్రమతో ముందుకు వెళతారు. కొత్త వృత్తులకు ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. గౌరవం, బాధ్యతలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో మాటామాటాల ఆలోచనలు ఫలిస్తాయి. సంతాన అభివృద్ధి, ఆర్థిక విషయాలపై ఎక్కువ ఆలోచనలు చేస్తారు. రుణాలు చెల్లిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, పోటీలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి పరిధిని విస్తరించుకుంటారు, తగిన గుర్తింపు, గౌరవం పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు బలపడతాయి. కంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వృత్తి పరంగా అనవసర వ్యక్తుల జోక్యం చికాకులు కలిగించవచ్చు. ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది.

మకర రాశి

మకర రాశి వారు వారం ప్రారంభంలో చంద్రసంచారం ఫలితాంశాలను గమనించగా, తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. పెద్దలతో, ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. గవర్నమెంట్ పనులలో, ఉన్నత స్థాయి అధికారులతో, రాజకీయ నాయకుల సహకారాన్ని కోరుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణానికి ప్రయత్నిస్తారు. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టాలి. గృహ, వాహన రిపేర్లకు శ్రద్ధ అవసరం.

వారం మధ్యలో వందేములు, బెట్టింగులు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. వృత్తిపరంగా అనవసర వ్యక్తుల జోక్యం చికాకులను కలిగిస్తుంది. స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు సత్యనారాయణ స్వామి ఆరాధన చేయాలి. వృత్తి అభివృద్ధి కోసం శివాలయ సందర్శన మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారు వారం ప్రారంభంలో ఫలితాంశాలను గమనించగా, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అధిక ఖర్చులు, ప్రయాణాలు, వృత్తి పరమైన చికాకులు ఉంటాయి. వారసత్వ ఆస్తుల గురించి చర్చలు, ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు ఊహించని ఇబ్బందులను పెంచుతాయి. తలనొప్పి, కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది.

ముఖ్య వ్యవహారాలలో శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్లడానికి కృషి చేస్తారు. వారం మధ్యలో డ్రైవింగ్ చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. గృహ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో ముఖ్య సమయాల్లో అనవసర గందరగోళం ఉంటుంది. ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ చాలా అవసరం.

మీన రాశి

మీన రాశి వారు వారం ప్రారంభంలో ఫలితాంశాలను గమనించగా, వ్యాపార వ్యవహారాలలో, స్నేహ సంబంధాలలో తగిన జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాలలో ఆటంకాలు, నిలుపుకోవడంలో ఇబ్బందులు, అనవసర ఖర్చులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో పౌరుషం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.

వ్యక్తుల సహకారాన్ని పొందుతారు. కొత్త గృహ, వాహనాల కోసం రుణాలకు ప్రయత్నిస్తారు. వారాంతంలో కుటుంబ స్త్రీల సహకారం పొందుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత, పూర్వ రుణాల చెల్లింపులు జరుగుతాయి. లాభదాయక ఆలోచనలు చేస్తారు. మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయుని ఆరాధన మంచిది.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.