రాశి ఫలాలు (వారఫలాలు) 18.05.2025 నుంచి 24.05.2025 వరకు
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం
మాసం: వైశాఖ మాసం, తిథి : షష్టి నుంచి ద్వాదశి వరకు
మేష రాశి వారు వారం ప్రారంభంలో జీవిత భాగస్వామి అభివృద్ధి, వ్యక్తిగత, వృత్తి మొదలైన వాటి కొరకు చేసే ఖర్చులు, ఆలోచనలు పాలిస్తాయి. నూతన పరిచయాలు, మైత్రి బంధాలు బలపడతాయి. దూర ప్రదేశాలలో వ్యాపార విస్తరణ అంశాలలో అలోచనలు, ఆర్థిక సంబంధమైన అంశాలలో ఆలోచనలు అనుకూలం. వారం మధ్యలో ఆరోగ్య ప్రయాణ సంబంధ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పదులు వాయిదా పడే అవకాశం ఉంది.
రోగ నిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సంబంధ వ్యవహారాల్లోనూ, మాటలలో ఉద్వేగం కోపాన్ని నియంత్రించుకోవాలి. స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఆత్మీయులు దూరంపెట్టే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య విషయంలో, పోటీ పరీక్షలలో మిశ్రమ ఫలితాలు వారాంతంలో వృత్తిలో భాధ్యతలు, శ్రమ గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి వారు వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్నిక ప్రయాణాలు. గురువుల యొక్క సహకారం, ఆశీస్సులు ఉంటాయి. మైత్రి బంధాలు బలపడతాయి. ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యక్తిగత అభివృద్ది కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. నూతన అవకాశాలు, గుర్తింపు. నూతన వాహనాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన లాభం కన్నా గౌరవం పెరుగుతుంది.
వృత్తి విషయాలలో, సంతానం అభివృద్ధి, ఆరోగ్య విషయాలలో ఆలోచనలు నియంత్రించుకోవాలి. గృహ అలంకార నిమిత్తం, కొత్త పుస్తకాల కొనుగోలు కొరకు, ఇంట్లో రిపేర్ల దృష్ట్యా, ఆకస్మిక ఖర్చులు నిర్ణయ సామర్థ్యంలో ఇతరుల సహకారం తీసుకోవడానికి ఇష్టము కలుగదు. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మిధున రాశి వారు వారం ప్రారంభంలో రుణములు తీసుకునే ప్రయత్నాలు, ఇంతకు ముందు మీ దగ్గర రుణాలు తీసుకున్న వారు సమయానికి ఇవ్వడంలో జాప్యం, సంతాసం అవసరాల నిమిత్తం ఖర్చు. వారి ఆరోగ్య, అభివృద్ధి అంశాలలో ప్రత్యేక శ్రద్ద, స్థిరాస్తుల పై పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం. వృత్తి ప్రదేశంలో అధిక బాధ్యతలు, శ్రమ, గౌరవం ఉన్నప్పటికీ అనవసర వ్యక్తుల ప్రవర్తన, జోక్యం చికాకు కలిగిస్తుంది.
తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలోనూ, న్యాయ సంబంధ విషయంలోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసర ఖర్చులు, ఇబ్బంది కలిగించే అలవాట్లకు వ్యసన పరులైన స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వారం చివరిలో ఆరోగ్యము శ్రద్ద తీసుకోవాలి. సమయానికి ఆహారము, విశ్రాంతి అవసరం. నూతన పెట్టుబడులు, వ్యాపార విస్తరణలో నూతన పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంచడం చాలా మంచిది.
కర్కాటక రాశి వారికి వారం ప్రారంభంలో తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్వగ్రామ సందరన కొరకు తల్లితో సంప్రదిస్తారు. విద్య సంబంధ మైన విషయాల కొరకు, నూతన విషయాలు గ్రహించుటలో శ్రమ చేస్తారు. విద్యార్థులు జ్ఞాపకశక్తి విషయంలో శ్రీ హయగ్రీవాయ నమః మంత్రం జపించుట మేలు. ఆలోచనలు ప్రతిపాదించుటలో అలస్యం కాకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. సంతానం అభివృద్ధి విషయంలోని ఇంతకు ముందు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మీయ వ్యక్తులతో విందు వినోదాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు కొరకు అనుకోని ఖర్చులు చేస్తారు.
సింహ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు, వృత్తిపరమైన విషయాలలో పురోగతి సాధించడానికి అనుకూల సమయం. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యక్తుల సహకారంతో నూతన ఆలోచనలను అమలు పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయంలో సామర్థ్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అవకాశాలు లభించవచ్చు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో పోటీలలో అనుకున్న ఫలితాలు సాధించవచ్చు. స్థిరాస్తుల అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు సాధారణ ఫలితాలను ఇవ్వవచ్చు.
అనవసర ఆలోచనలతో హృదయాందోళన, సంతానంతో సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించాలి. క్రీడారంగంలో ఉన్నవారు పోటీలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు పై దృష్టి పెట్టడం మంచిది. ఆలోచనల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల చికాకులు ఏర్పడవచ్చు, ముఖ్యంగా మగ పిల్లల అభివృద్ధి విషయంలో, స్నేహాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వ్యసనాలకు లోను కాకుండా జాగ్రత్త వహించాలి.
కన్య రాశి వారు వారం ప్రారంభంలో కుటుంబంతో కలిసి ఆర్థిక సంబంధాల్లో, ఆధ్యాత్మిక క్షేత్ర సుదర్శనం, దైవ దర్శనం, దూర ప్రయాణాలు, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు. ఎక్కువ శాతం సోషల్ మీడియా, స్క్రీన్ టైమ్‌తో సమయాన్ని వృథా చేసుకోకుండా కంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వారం మధ్యలో స్థిరాస్తులు విషయంలో తోబుట్టువులతో వాదనలకు దూరంగా ఉండాలి. సామర్థ్యం, పరాక్రమం పెరుగుతాయి.
రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి వేసే ప్రయత్నాల్లో వారి మీద విజయాన్ని సాధిస్తారు. రోగనిరోధక శక్తి విషయంలో, బంధు మిత్రులతో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి విషయంలో శ్రద్ధ వహించాలి. తండ్రి పెద్దలతో వాదోపవాదాలకు లోను కాకుండా తగిన విధంగా భూ విషయాల్లో సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్లాలి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కృషి చేయాలి.
తులా రాశి వారికి వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్య విషయంలో అనుకూలత, కుటుంబ, ఆహార, ఆర్థిక విషయాల్లో సానుకూలత ఉంటుంది. కొత్త వ్యక్తులలో వాగ్వాదాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల ముఖ్యంగా సంతానము ఆరోగ్య అభివృద్ధి విషయంలోనూ, గృహంలో స్థిరాస్తుల కొరకు లోన్ తీసుకునే విషయంలోనూ దృష్టి సారిస్తారు. ఆత్మీయుల ఆరోగ్యాభివృద్ధి కొరకు ఉద్వేగంతో కూడిన ఆలోచనలు ఉంటాయి.
దగ్గర ప్రయాణాలకు, మిత్రులతో సంప్రదింపులకు అవకాశం. వృత్తిలో కమ్యూనికేషన్ సమస్యను అధిగమించాలి. జీవిత భాగస్వామితో నిదానంగా వ్యవహరిస్తూ భవిష్యత్ ప్రణాళికలను చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ద్వంద్వంగా తీసుకునే నిర్ణయాలు ఆత్మీయ వ్యక్తులకు స్వార్థంగా అనిపించుట వల్ల కొంత ఇబ్బందులకు అవకాశం ఉండవచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి ముందుకు వెళ్లాలి.
వృశ్చిక రాశి వారు వారం ప్రారంభంలో వ్యాపార విస్తరణలు, ప్రయాణాలు, భాగస్వామ్య వ్యవహారాలలో, జీవిత భాగస్వామి ఆరోగ్యము, సంతానము కొరకు ఖర్చులు, షాపింగులు అధికంగా ఉంటాయి. వ్యాపార విరామ సమయంలో కొంత శారీరక నిస్సత్తువ కలుగుతుంది. విద్యార్థులకు విద్యా సంబంధ అంశాలు, ఇన్వెస్ట్‌మెంట్ల లాభాలు, ఇంతవరకు ఆగిన ఆర్థిక విషయాలు కొంత ముందుకు సాగుతాయి. వారం చివరిలో వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది.
ఇతరుల సహకారం లేకుండానే స్వంత నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులతో మంతనాలు, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. శారీరక శ్రద్ధ, నూతన భాషలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. కొత్త ప్రదేశాలు ఆనందాన్ని కలిగిస్తాయి.
ధనుస్సు రాశి వారికి వారం ప్రారంభంలో రుణము లభిస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విజయాన్ని సాధించేందుకు చేసే కార్యక్రమాలలో శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు, నూతన గృహ, వాహన విషయాలపై చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.
అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. న్యాయ సంబంధ అంశాలపై చర్చలు ముందుకు సాగుతాయి. దూర ప్రదేశాలలో అవకాశాలు వచ్చినా, నిర్ణయ సామర్థ్యం లోపం వల్ల పూర్తిగా ఉపయోగించుకోలేరు. వారం చివరిలో ముఖ్యంగా కుటుంబ సమస్యలు, అందిన ఆర్థిక అంశాలలో వ్యవహరించే విధానంలో మార్పులు అవసరం. మర్షణతో కూడిన మాటల వల్ల వ్యక్తులతో మాటల పట్టింపులు రావొచ్చు.
మకర రాశి వారికి వారం ప్రారంభంలో సంతాన ఆరోగ్యం, మీ సృజనాత్మకత అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో ఆగిపోయిన అభివృద్ధిలో ఆత్మీయుల, అనుకున్న వ్యక్తుల స్వార్థ ఆలోచనలు అడ్డంకులు కలిగిస్తాయి. నిర్ణయ సామర్థ్యం, కమ్యూనికేషన్ విషయంలో ఎదుగుదల సాధించగలుగుతారు. వృత్తిపరంగా ఊహించని వ్యక్తుల సహకారం అందుతుంది. ఆర్థిక లాభం, స్థిరాస్తుల కొనుగోలు విషయంలో తొందరపడకుండా, కొత్త వ్యక్తులను మరియు వారి ఆలోచనలను నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర వ్యయములు, ప్రలోభాలకు లోనుకాకుండా జాగ్రత్త వహించాలి. వారం చివరిలో భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవచ్చు.
కుంభ రాశి వారికి వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం కొంత తగ్గుతుంది. దూర ప్రయాణాలకు అవకాశముంటుంది. మీ ఆర్థిక, ఆరోగ్య, రుణ, పోటీ విషయాల్లో పెద్దల సలహా, సహకారం అవసరమవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య మరియు సౌకర్య అవసరాలపై దృష్టి సారించాలి. ఉన్నత విద్య కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు విద్యా విషయాల్లో, పోటీల్లో కొంత సామాన్య ఫలితాలు కలుగుతాయి.
వృత్తిలో కొత్త బాధ్యతలు, నూతన శ్రమ, కొత్త పనులు ఎదురవుతాయి. వ్యక్తుల పరిచయాల్లో మోసం జరగవచ్చునన్న అవకాశముంది. జీవిత భాగస్వామికి వృత్తిలో అవకాశాలు దూరప్రాంతాల్లో వస్తాయి. మిత్రులు, సహచరులతో అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. గృహ సంబంధ విషయాల్లో ఖర్చులు, పాత ఋణాలు, వైరాగ్య ఆలోచనలు చికాకులు కలిగించవచ్చు. వారం మధ్యలో బాధలు ఉన్నా, ఆశతో వృద్ధి చేసే అవకాశం ఉంటుంది.
మీన రాశి వారు వారం ప్రారంభంలో ప్రయాణాలు చేస్తూ ఉండగా స్వార్థపూరితమైన వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి విద్యా సంబంధమైన విషయాల్లో అభివృద్ధి, ఆశించిన ఫలితాలు లభిస్తాయి. శక్తి మించిన ఖర్చులు, ఉన్నత విద్యకు సంబంధించి దూర ప్రదేశాల్లో అవకాశాలు, విదేశాల్లో ఉండే ఆత్మీయుల సహకారంతో అభివృద్ధి సాధ్యమవుతుంది.
వారం మధ్యలో దూర ప్రయాణాలు, కమ్యూనికేషన్ విషయంలోనూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. మిత్రులతో, తోబుట్టువులతో వివాదాలకు దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు గౌరవం ఇచ్చి గౌరవం పొందాలి. నిరుద్యోగులకు, వృత్తిలో అభివృద్ధి కోసం ప్రయత్నించే వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000
టాపిక్