ఈ వారం రాశిఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. ఈ రాశి వారికి దైవదర్శనాలు, నూతన అవకాశాలు-weekly horoscope from mesha rasi to meena rasi april 27th to may 3rd check yours now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ వారం రాశిఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. ఈ రాశి వారికి దైవదర్శనాలు, నూతన అవకాశాలు

ఈ వారం రాశిఫలాలు.. 12 రాశుల వార ఫలాలు.. ఈ రాశి వారికి దైవదర్శనాలు, నూతన అవకాశాలు

HT Telugu Desk HT Telugu

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 27.04.2025 నుంచి 03.05.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

రాశి ఫలాలు

రాశిఫలాలు (వారఫలాలు) 27.04.2025 నుంచి 03.05.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: వైశాఖ మాసం, తిథి : కృ. అమావాస్య నుంచి శు. షష్టి వరకు

మేష రాశి

మేష రాశి వారికి తల్లి తండ్రులు సౌకర్యం అవసరాల కోసం దృష్టి మీ ఆర్థిక అంశాలలో పెద్దల సలహా, సహకారం, విద్యార్థులకి విద్యావిషయాల్లో, పోటిల్లో కొంత సామాన్యఫలాలు, ప్రస్తుతం ఉన్న వృత్తిలో వార్మికలు, నూతన శ్రమ. కొత్త వసులు, వ్యక్తుల పరిచయాలు మోసానికి అవకాశములు, జీవిత భాగస్వామికి వృత్తిలో అవకాశములు.

దూర ప్రదేశముల్లో మిత్రులుతో అభిప్రాయభేదములు రాకుండా వ్యవహారించాలి. దూరప్రయాణముల అవకాశము. ఆసంతృప్తి, వారము మధ్యలో బాధములు అందినప్పటికి వాటిని పరిష్కరిస్తారు. స్వార్ధపరీత వ్యక్తులవలన కొంత మోసపోయే అవకాశములు, స్థిరాస్తులు ప్రయత్నములు వాహనములు. గృహ సంబంధ విషయాల్లో ఖర్చులు, వారంతములో ఖర్చులు అధకము, నియంత్రించుకోటం అవసరం. కుటుంబ స్త్రీల ఆరోగ్యముడై శ్రద్ధ తో వైద్యులను కలిసే అవకాశములు ఉన్నాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారం ప్రారంభంలో కమ్యూనికేషన్ విషయంలోనూ నిర్ణయాలు తీసుకునే సందర్భంగా తగిన జాగ్రలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు స్వార్థపూరితమైన వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, శక్తి మించిన ఖర్చులు, మిత్రులతో, తోబుట్టువులతో వివాదానికి దూరంగా ఉండాలి.

మాట్లాడేప్పుడు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాలలో అవకాశాలు విదేశాలలో ఉండే ఆత్మీయు సహకారంతో అభివృద్ధి. అత్మ శక్తి పెరుగుతుంది. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటారు. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు

మిధున రాశి

మిధున రాశి వారు వారం ప్రారంభంలో నూతన పరిచయాలు. మైత్రి బంధాలు బలపడతాయి. ఆర్ధిక సంబంధమైన అంశాలలో ఆలోచనలు అనుకూలం. వ్యక్తిగత వృత్తి మొదలైన వాటి కొరకు అనుకోని ఖర్పులు, ఘర్షణాత్మకమైన ఆలోచనలను ప్రశాంతతను తగ్గిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్య, ప్రయాణ, సంబంధ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి.

ముఖ్యమైన పనుల వాయిదా పడే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబ సంబంధ వ్యవహారాల్లోనూ, మాటలలో ఉద్వేగం కోపాన్ని నియంత్రించుకోవాలి. స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఆత్మీయులు దూరం పెట్టే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకుంటారు. ఉన్నత విద్య విషయంలో, పోటీ పరీక్షలలో మిశ్రమ ఫలితాలు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు వారం ప్రారంభంలో క్రమ వ్యక్తిగత అభి వృద్ది కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు, దైవదర్శనాలు. పెద్దల, గురువులు సహకారం, ఆశీస్సులు ఉంటాయి. నూతన అవకాశాలు. బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం, ఆహారం విషమంలో శ్రద్ధ తీసుకోవాలి. వారం మధ్యలో నూతన స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు బలపడతాయి.

సంఘాల్లో గుర్తింపు గౌరవం, వాహనాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తి విషయాలలో, సంతానం అభివృద్ధి ఆరోగ్య విషయాలలో అధిక ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు ఆరోగ్యం శ్రద్ధ అనవసరమైన ఖర్చు నియంత్రణ అవసరం.

సింహ రాశి

వారం ప్రారంభంలో అత్మీయుల కొరకు సంతానం కొరకు ఖర్చు, వారి ఆరోగ్య అభివృద్ధి అంశాలలో. ప్రత్యేక వృత్తి చేసే ప్రదేశంలో అధిక బాధ్యతలు శ్రమ గౌరవం ఉన్నప్పటికీ అనవసర వ్యక్తుల ప్రవర్తన, జోక్యం చికాకు కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలోనూ, దూరవిద్యా, న్యాయ సంబంధ విషయంలోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి. స్థిరాస్తుల పై పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం. రావలసిన ధనల మీకు అందుతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి.

కన్యా రాశి

వారం ప్రారంభంలో విద్యాసంబంధమైన విషయాల కొరకు, నూతన విషయాలు గ్రహించుటలో శ్రమ వేస్తారు. స్తిరాస్తులు పెట్టుబడుల కొరకు తల్లితో సంప్రదిస్తారు. ఆలోచనలు ప్రతిపాదించుటలో ఆలస్యం కాకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. విద్యార్థులు జ్ఞాపకశక్తి విషయంలో శ్రీ హయగ్రీవాయ నమః మంత్రం జపించుట మేలు. ప్రియమైన వ్యక్తులతో విందు వినోదాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి.

వారికి బహుమానాల కొరకు, ప్రయాణాలు కొరకు అనుకోని ఖర్చులు చేస్తారు. సంతానం అభివృద్ధి విషయంలోని ఇంతకు ముందు పెట్టుబడులు ఇన్వెస్టెంట్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాత రుణములు వసూలు అవుతాయి, చెల్లిస్తారు కూడా. ఆకస్మిక ప్రయాణాలు, రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధతో ఖర్చు చేస్తారు. వారాంతంలో సంఘంలో కొత్త పరిచయాలు, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు.

తులా రాశి

తులా రాశి వారు వారం ప్రారంభంలో వృత్తి పరమైన సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యక్తుల సహకారంతో నూతన ఆలోచనలని అమలు పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు, దూర ప్రదే శాలలో ఇంటర్వ్యూలు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో పోటీలలో అను కున్న ఫలితాలు, స్థిరాస్తుల అభివృద్ది కొరకు ప్రయత్నాలు సామాన్య ఫలాలు, ఎక్కువ అనవసర ఆలోచనలతో హృదయాందోళన సంతానముతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మీ ఆలోచనలకి వారి ఆలోచనలకి సమన్వయం లేకపోవడం వల్ల చికాకులు, ముఖ్యంగా మగ పిల్లల వారి వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ చికాకులు ఉంటాయి.

వృశ్చిక రాశి

వారం ప్రారంభంలో సంతానము కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, దైవ దర్శను దూర ప్రయాణాలు, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు. ఈ విషయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వారం మధ్యలో సామర్థ్యం పరాక్రమం పెరుగుతాయి. మిత్ర బృందం సహకరిస్తారు. రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయుత్నాల్లో వారి మీద, విజయాన్ని సాధిస్తారు.

తండ్రి పెద్దలతో వాదోపవాదాలకు లోను కాకుండా తగిన విధంగా విషయాలలో సలహా సంప్రదింపులతో ముందురు వెళ్లాలి. బంధుమిత్రులతో జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తులు విషయంలో తోబుట్టువులతో వాదనలకు దూరంగా ఉండాలి. వృత్తి డిపార్ట్మెంటల్ టెస్ట్లు వాటి విషయంలో శ్రద్ద వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలు, అభివృద్ధి విషయంలో తగిన విధంగా కృషి చేయాలి.

ధనస్సు రాశి

వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో ఖర్చుల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం లోనూ, గృహంలో స్థిరాస్తుల కొరకు లోన్ తీసుకునే విషయంలోనూ దృష్టి సారిస్తారు. కుటుంబ, ఆహార, ఆర్థిక విషయాలలో, ముఖ్యంగా సంతానముతో వాగ్వాదాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో నిధానంగా వ్యవహరిస్తూ భవిష్య ప్రణాళికలను చర్చిస్తూ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఉద్వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల అది ఆత్మీయ వ్యక్తులకు స్వార్థంగా అనిపించుటచే కొంత ఇబ్బందులకు అవకాశం ఉన్న రీత్యా ఆచితూచి ముందుకు వెళ్లాలి.

మకర రాశి

మకర రాశి వారికి వారం ప్రారంభంలో వ్యాపార విస్తరణ. సంతానము కొరకు ఖర్చులు, షాపింగులు అధికంగా ఉంటాయి. వారం మధ్యలో ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యంగా స్థిరాస్తులు అభివృద్ధి కొరకు విద్యార్థులు విద్యాసంబంధ అంశాలులో నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక లాభం ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది ఇతరుల సహకారం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటారు దూర ప్రదేశాల్లో ఆత్మీయులను కలుస్తారు. మధ్య వర్తిత్వం వహించే వ్యక్తుల స్వార్థపూరిత ఆలోచనల పట్ల కూడా సంఘంలో స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు ఇబ్బందులు కలుగచేస్తాయి..

కుంభ రాశి

వారం ప్రారంభంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవతారాలు, నూతన గృహ వాహన విషయాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. రుణము లభిస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విజయము సాధించడానికి చేసే కార్యక్రమాలలో శ్రద్ధ. వారం మధ్యలో ఖర్చులు అధికంగా ఉంటాయి.

అవకాశాలు కలిగించినప్పటికీ నిర్ణయ సామర్థ్యం లోపంతో పూర్తిగా సద్వినియోగం చేసుకోలేరు. పెద్దలతో వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఘరణతో కూడిన మాటల వల్ల వ్యక్తులతో మాట వర్ణింపులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, ఆర్థిక అంశాలలో నిదానం అవసరం.

మీన రాశి

వారం ప్రారంభంలో వృత్తి విషయంలో ఆలో చనలు కొంత ఘర్షణగా ఉంటాయి. వారం మధ్యలో ఆర్థిక, లాభవరమైన అంశాలలో ఎదురు చూస్తున్న వర్తమానాలు, ఆగుతూ వస్తున్న అభివృద్ధిలో ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల స్వార్థ ఆలోచనలు ఇబ్బందిని, ఘర్షణని కలిగిస్తాయి. స్థిరాస్తులు భూములు కొనుగోలు విషయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకోకుండా, కొత్త వ్యక్తులను, వారి ఆలోచనలను నమ్మే విషయంలో అంతూచి వ్యవహరిస్తూ వ్యయములు కాకుండా ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

సంబంధిత కథనం