ఈ వారం ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధన, వస్తు లాభాలు!-weekly horoscope from mesha rasi to meena rasi april 20th to april 26th check yours now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ వారం ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధన, వస్తు లాభాలు!

ఈ వారం ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధన, వస్తు లాభాలు!

HT Telugu Desk HT Telugu

ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 20.04.2025 నుంచి 26.04.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

ఈ వారం రాశి ఫలాలు

రాశిఫలాలు (వారఫలాలు) 20.04.2025 నుంచి 26.04.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం

మాసం: చైత్ర మాసం, తిథి : కృ. సప్తమి నుంచి కృ. త్రయోదశి వరకు

మేష రాశి

మేష రాశి అపదలో ఉన్న వారికి కొంత సాయపడతారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలన్నీ తీరుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆస్తి పంపకాలు వంటివి ఫలప్రదం కావడం వంటి ఫలితాలు, వ్యతిరేకులను సైతం మీదారికి తెచ్చుకోవడంలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలపైనా దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యలు ఆమోదించి అభినందిస్తారు.

పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. విద్యార్థులు తాము ప్రతిభను నిరూపించుకునే సమయం. నిరుద్యోగులకు అవకాశాలు దగ్గరకు వచ్చే సూచనలు, కళాకారులు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం. గుర్తింపు లభిస్తుంది. ఐటీ రంగం వారు ప్రతిభతో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. మహిళలకు ఆలోచనలు కలసివస్తాయి. వారం మధ్యలో కుటుంబంలో విభేదాలు, ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రయాణాలు ఉండవచ్చు. శ్రీవిష్ణుసహస్రనాను పారాయణ చేయండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు అనుకున్న లక్ష్యాలు నెరవేరడానికి కొంత కష్టించాల్సిన అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబసభ్యులు, సన్నిహితుల నుండి ఒత్తిడులు రావచ్చు. సోదరులు మీపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తారు. ఆత్మవిశ్వాసం సడలనీయకుండా పట్టుదలతో ముందుకు సాగండి. కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లు దక్కించుకుంటారు. గృహ, వాహనయోగాలు కలుగుతాయి.

వృత్తులు, వ్యాపారాలలో మొత్తం మీద అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగులు విధుల్లో ఆప్రమత్తుడై మెలగాలి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు ఆయా రంగాలలో కొంత మేర విజయాలు సాధిస్తారు. క్రీడాకారులు ఐటీ రంగం వారికి అనుకూల వాతావరణం వారం ప్రారంభదశలో శుభవర్తమానాలు కొన్ని సమస్యలు తీరే అవకాశం. విందువినోదాలు.

మిధున రాశి

మిధున రాశి వారు అనుకున్న కార్యక్రమాలు కొన్ని శ్రమానంతరం పూర్తి చేస్తారు. పరిమితులకు మించి ఖర్చులు ఎదురై సతమతమవుతారు. తరచూ ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. బంధువులు, స్నేహితులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. మీ ప్రతిభ చాటుకునేందుకు అవకాశం. సహనమే మిమ్మల్ని సమస్యల నుండి ఒడ్డుకు చేరుస్తుంది.

ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగూ మీరు ఉపయుక్త మవుతుంది. మీ ఆత్మీయత, అనురాగాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వృత్తులు, వ్యాపారాలలోని వారికి చివరిలో మరింత అనుకూలమనే చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగాలలోని వారికి మరింత కలిసివస్తుంది. కళాకారులు, రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. వారం మధ్యలో ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. మిత్రులతో వివాదాలు, ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఎటువంటి కార్యం చేపట్టినా విజయవంతమే. ఆప్తులు మరింత విలువ ఇస్తారు. అస్తుల పంపకాలలో నెలకొన్న సమస్య తొలగే అవకాశం ఉంది. స్నేహితులు సైతం మీ విజయాలకు సహాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు అశించిన ఆదాయం లభించి ఖర్చులు అధిగమిస్తారు. పలుకుబడి మరింత పెరిగి మంచి గుర్తింపు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

శారీరక రుగ్మతలు వ్యాధించినా ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలలోని వారికి మరింత సంతోషం ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. వైద్యులు, ఐటీ రంగం వారికి విశేషంగా కలసివస్తుంది. వారం మధ్యలో దుబారా ఖర్చులు, ఒత్తిడులు పెరుగుతాయి. లేనిపోని నిందలు భరించాల్సి వస్తుంది. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికీ అనుకోని ప్రయాణాలు, తద్వారా వృథా ఖర్చులు, కొన్ని వ్యవహారాలకు సంబంధించి చర్చలు మందగిస్తాయి. ఆస్తుల విషయంలోనూ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఆరోగ్య విషయాలపై నిర్లక్ష్యం వద్దు. చిన్నవాటి విషయాలను నెమరువేసుకుంటారు. బంధుగణం నుండి ఒత్తిడులు రావచ్చు. తరచూ ప్రయాణాలు చేస్తుంటారు.

ఆదాయానికి కొంత లోటు ఏర్పడినా క్రమేపీ పుంజుకుంటారు. మౌనం అన్ని విధాలా శ్రేయస్కరం. వృత్తులు, వ్యాపారాలలోని వారికి క్లిష్టతరమైన సమస్యలు ఎదురవుతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో పొరపాట్లు దొర్లి మాట పడతారు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. మహిళలకు మానసిక అవేదన. వారం మధ్యలో శుభ వర్తమానాలు.

కన్య రాశి

కన్య రాశి వారికీ కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. సేవాభావంతో ముందుకు సాగి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. బంధువులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. వివాహాది కార్యక్రమాల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. భవనాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ప్రయాణాల్లో పరిచయమైన వ్యక్తి ద్వారా కీలక సమాచారం రావచ్చు. వృత్తులు, వ్యాపారాలలోని వారు మిశ్రమ ఫలాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. కళాకారులు, పరిశోధకులు, రచయితలకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. క్రీడాకారులు, ఐటీ రంగం వారి అశలు, ఫలిస్తాయి. మహిళలకు ఉన్నత హెూదాలు దక్కవచ్చు. వారం మధ్యలో మానసిక ఆందోళన, చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనారోగ్య సూచనలు.

తుల రాశి

తుల రాశి వారి అప్పులు ఎట్టకేలకు తీరి ఊరట చెందుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొని ఉత్సాహంతో గడుపుతారు. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరేందుకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. అందర్నీ ఆకట్టుకునేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగాలు లభించే సమయం. కుటుంబసభ్యులు మీ పట్ల మరింత సానుకూల వైఖరి ప్రదర్శిస్తారు. మీ నిర్ణయాలలో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించండి. వృత్తులు, వ్యాపారాలలోని వారికి కలిసివచ్చే కాలమనే చెప్పాలి.

రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మిశ్రమంగా ఉంటుంది. వైద్యులు, ఐటీ రంగం వారు మునుపటి నుండి ఎదుర్కొంటున్న చిక్కులు వీడతాయి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో శ్రమ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కొండరు మీపై విమర్శలు గుప్పిస్తారు. శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ముఖ్య వ్యవహారాలను ఇతరుల సాయం లేకుండానే పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. బంధువులు మీ పట్ల మరింత ప్రేమానురాగాలు కురిపిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగప్రయత్నాలు సఫలం కాగలవు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు.

విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించవచ్చు. వృత్తులు, వ్యాపారాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఉత్సాహంగా గడువుతారు. కళాకారులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు విజయాలు సొంతం చేసుకుంటారు. ఐటీ రంగం వారికి ఒక సమాచారం అందుతుంది. మహిళలకు మనోనిబ్బరం పెరుగుతుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదిస్తారు. దూరప్రయాణాలు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు బంధువులతో తరచూ వివాదాలు నెలకొనే సమయం ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందడుగు వేస్తారు. ప్రతి వ్యవహారంలోనూ మరింత నిదానం అవసరం. ఆదాయం, వ్యయాలు సమానస్థాయిలో ఉండి ఊపిరి పీల్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో ప్రతిష్టంభన, దైవకార్యాలలో పాల్గొంటారు. మీయత్నాలు ముందుకు సాగవు.

ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. వృత్తులు, వ్యాపారాలలోని వారికి సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారులు కొంత నిదానంగా ముందుకు సాగడం మంచిది. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిళ్లు తప్పవు, ఐటీ రంగం వారి యత్నాలలో కొంత విరామం రావచ్చు. వారం చివరిలో బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. సమాజసేవే పరమార్ధంగా ముందుకు సాగుతారు. శ్రీ ఆదిత్య హృదయం పఠించండి.

మకర రాశి

మకర రాశి వారి ఔదార్యాన్ని అవకాశంగా తీసుకుని మోసగించేందుకు కొందరు యత్నించవచ్చు. అయితే వాస్తవం గ్రహించి కొంత బయటపడతారు. అప్పులు సైతం చేస్తారు. మితిమీరిన విశ్వాసం విడనాడి ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగేయడం మంచిది. క్రమేపీ పరిస్థితుల్లో కొంత మార్పులు ఉండవచ్చు. రాబడి, ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలలో మెరుగుదల కనిపిస్తుంది. ఆస్తుల విషయంలోనూ అగ్రిమెంట్లు చేసుకుంటారు.

వృత్తులు, వ్యాపారాలలోని వారికి శుభదాయకమే. ముఖ్యంగా వ్యాపారాలలో కొనసాగే వారికి మొదట్లో నిరాశ ఎదురైనా ఎట్టకేలకు లాభాలు అందుతాయి. కళాకారులు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులకు ఆకస్మిక విదేశీ యానం. మహిళలు తీసుకునే నిర్ణయాలు కొంత వివాదం రేపుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు, కీలక నిర్ణయాలు, శ్రీ గురుదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికీ ఏ కార్యక్రమం ప్రారంభించినా చేపట్టినా విజయమే. ముఖ్యంగా ఇంటికి సంబంధించి వ్యవహారాలన్నీ సజావుగా పూర్తి చేస్తారు. మీ సమర్థత, నైపుణ్యత వెలుగులోకి వచ్చే కాలం సోదరులలతో మరింత సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. కొన్ని కోర్టు కేసులు చివరి దశకు చేరడం ఉత్సాహాన్నిస్తుంది.

విద్యార్థులు, నిరుద్యోగులు తమ సత్తా చాటుకుని ముండదుగు వేస్తారు. గృహ నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తులు, వ్యాపారాలలోని వారు చాకచక్యంగా వ్యవహరించి ముందుకు సాగుతారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు పురస్కారాలు రావచ్చు. ఐటీ రంగం వారికి మరిన్ని వెసులుబాట్లు కలుగుతాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వారం చివరిలో శ్రమా ధిక్యం. బంధువులతో తగాదాలు, ఇంటా బయటా దిక్కులు, శ్రీవారాహీ స్తోత్రం పఠించండి.

మీన రాశి

మీన రాశి వారు ముఖ్య వ్యవహరాన్ని సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు, సోదరీలు, సంతానం కూడా మీకు మరింత సహకరిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించి ముందుకు సాగుతారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు లభించి ఊరట చెందుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మిత్రుని ద్వారా ఊహిందని విధంగా సహకారం అందుతుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తులు, వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. కళాకారులు రాజకీయవేత్తలు, క్రీడాకారులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. మహిళలు సంతోషకరంగా గడుపుతారు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలం ఇంటాబయటా ఒత్తిడులు మానసిక ఆందోళన, దూరప్రయాణాలు. శ్రీ కాలభైరవాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

సంబంధిత కథనం