రాశిఫలాలు (వారఫలాలు) 13.04.2025 నుంచి 19.04.2025 వరకు
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం
మాసం: చైత్ర మాసం, తిథి : కృ.పాడ్యమి నుంచి కృ.సప్తమి వరకు
మేష రాశి వారు నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకున్న మేరకు డబ్బు సమకూరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. అనారోగ్యం. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. నీలం, నేరేడు రంగులు. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.
వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఇంటి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మిధున రాశి వారికి అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్ధులు అనుకున్న ఫలితాలు రాబడతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కర్కాటక రాశి వారి ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు అనుకూల స్థితి. ధనవ్యయం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
సింహ రాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలిస్తుంది. మీ నిర్ణయాలపై సానుకూలత ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. సన్మానాలు జరుగుతాయి. చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. మిత్రులతో మాటపట్టింపులు. నలుపు. లేత ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కన్య రాశి వారు ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన సమయం. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాల కొనుగోలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవార్డులు, సన్మానాలు, ఆరోగ్య భంగం. గులాబీ. ఆకుపచ్చ రంగులు. గణేశ స్తోత్రాలు పఠించండి.
తులా రాశి వారికి పట్టుదలతో విజయాలు చేకూరతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు గతం కంటే అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. అనారోగ్యం. గులాజీ, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.
వృశ్చిక రాశి వారికి సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. మధ్యమధ్యలో కొంత అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహం. పనుల్లో ప్రతిబంధకాలు, పసుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు రాశి వారికి స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభాలు కలుగుతాయి. వివాహాది వేడుకల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కళారంగం వారి సేవలకు సన్మానాలు అందుకుంటారు. వ్యయ ప్రయాసలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.
మకర రాశి వారికి ఆర్థికంగా మరింత ప్రగతి ఉంటుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. మీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు అందుతాయి. స్వల్ప అనారోగ్యం. ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.
కుంభ రాశి వారు మొదట్లో ఉన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తీరతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి సఫలమవుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు, కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, నేరేడు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
మీన రాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనాలు, భూముల కొనుగోలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. అనుకోని ధనవ్యయం. నీలం, ఆకుపచ్చరంగులు. దేవీస్తుతి మంచిది.
సంబంధిత కథనం
టాపిక్