బంగారు ఆభరణాలు ధరించడం శుభప్రదం. మీరు మీ సమస్యకు అనుగుణంగా సరిగ్గా ధరిస్తే మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు. అయితే బంగారం ధరించడం ఎలా అదృష్టం కలిగిస్తుందో తెలుసుకుందాం..
అదృష్ట కోసం బంగారాన్ని ధరించడం శ్రేయస్కరం. అయితే ఏ రకమైన బంగారాన్ని ఎప్పుడైనా ధరించవచ్చా? అనే అనుమానం చాలా మందికి వస్తుంది. మీరు మీ అదృష్టాన్ని మెరుగుపరుచుకోవాలంటే బంగారు ఆభరణాలను ధరించడానికి సరైన మార్గం తెలుసుకోవాలి. ప్రకాశించే.. బంగారం వేసుకుంటే.. అదృష్టం కూడా ప్రకాశిస్తుందని నమ్ముతారు.
బంగారం ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో బంగారానికి చాలా విలువ ఉంది. బంగారం లేని ఇల్లు ఉండదేమో. కాస్త బంగారమైన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఆధ్యాత్మికంగానూ బంగారానికి ప్రాముఖ్యత ఉంది. బంగారం సూర్య భగవానుని ఆశీస్సులు పొంది సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని కూడా నమ్ముతారు. ఏ బంగారు ఆభరణాలు ధరించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో, వాటిని ధరించే విధానం ఏంటో తెలుసుకోండి.
ఉంగరపు వేలుకు బంగారాన్ని ధరించడం వల్ల గౌరవం పెరుగుతుంది. ఇది సూర్య భగవానుడి ద్వారా ఆనందాన్ని, గౌరవాన్ని పెంచుతుంది.అలాగే ఈ వేలికి రాగి ఉంగరాన్ని ధరించవచ్చు.
ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్, డిప్రెషన్‌తో బాధపడేవారు, ఇతరుల కంటే తమను తాము తక్కువగా భావించే వారు బంగారు ఉంగరాన్ని చూపుడు వేలుకు ధరించాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంచుతుంది.
మెడలో బంగారం ధరించడం వల్ల గుండెకు బలం చేకూరుతుందా? అని చాలా మంది అడుగుతుంటారు. అయితే మెడలో బంగారు గొలుసు వేసుకుంటే.. గుండెను బలపరుస్తుందని కొందరి మాట.
ముక్కు, చెవులకు ఎలాంటి నగలు ధరించాలి? అని కూడా కొందరు మాట్లాడుకుంటారు. శాస్త్రం ప్రకారం, శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ అంచుల నుండి వస్తుంది. కాబట్టి తలకు ఇరువైపులా అంటే ముక్కు, చెవులకు బంగారు ఆభరణాలు ధరించాలి.
బంగారంలా ఉండే నగలు ఈ రోజుల్లో చాలా చోట్ల అమ్ముడవుతున్నాయి. కానీ మీరు ఈ నకిలీ నగలను ధరిస్తే, దాని నుండి వెలువడే శక్తి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
బంగారు ఆభరణాలను తలకు, కాళ్లకు పెట్టుకుంటే కొన్ని రకాల రోగాలు మాయం అవుతాయని అంటారు. దీని నుండి విడుదలయ్యే ఉష్ణ శక్తి తల, పాదాలను ప్రభావితం చేస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.