Diamond: ఈ ఐదు రాశుల వాళ్ళు డైమండ్ ధరిస్తే అదృష్టం ధగధగా మెరిసిపోతుంది
Diamond: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వజ్రం ధరించడం అందరికీ అదృష్టాన్ని ఇవ్వకపోవచ్చు. ఏ రాశుల వారికి వజ్రం అదృష్టాన్ని ఇస్తుంది. ఎవరు దీన్ని ధరించకూడదో తెలుసుకుందాం.
Diamond: వజ్రం అత్యంత ఖరీదైనది. దీన్ని ధరించాలని అందరికీ ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితి సహకరించక అది కలగానే మిగిలిపోతుంది. వజ్రం హోదాను సూచిస్తుందని అంటారు. అందుకే దీన్ని అందరూ ధరించలేరు. ధనవంతులు తమ జాతకానికి తగిన విధంగా సరిపోయే వజ్రాన్ని ధరిస్తారు. ఇది ధరించిన వారి అందాన్ని రెట్టింపు చేస్తుంది. వారిని ఆకర్షణీయంగా మారుస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వజ్రం ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. మీ రాశి ప్రకారం ఎలాంటి వజ్రం ధరించాలో తెలుసుకోవచ్చు. సంపదకు కారకుడైన శుక్రుడు వజ్రపు రత్నాన్ని సూచిస్తాడని చెబుతారు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వజ్రం ధరించడం వల్ల మేలు జరుగుతుందని చెబుతారు. వజ్రం ధరించడం వల్ల వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఏ రాశి వారు వజ్రాన్ని ధరించడం శ్రేయస్కరం? ఎవరు వజ్రం ధరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు? దానిని ధరించడానికి నియమాలు ఏంటో తెలుసుకుందాం.
ఈ రాశుల వారు వజ్రాన్ని ధరించవచ్చు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, మిథునం, కన్య, తుల, కుంభ రాశిలో జన్మించిన వాళ్ళు వజ్రాన్ని ధరించవచ్చు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం జాతకంలో శుక్రుడు యోగకారకుడిగా ఉన్నప్పుడే వజ్రాన్ని ధరించాలి. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉండి ఉచ్ఛస్థితిలో ఉంటే వజ్రం ధరించడం శుభప్రదం. శుక్రుని మహాదశ సమయంలో మాత్రమే ప్రజలు వజ్రాన్ని ధరించగలరు.
వజ్రం ధరించడం వల్ల మనిషి వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుందని చెబుతారు. వస్తు సంపదలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ పెరుగుదలకు అడ్డంకులు తొలగిపోతాయి. వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. వజ్రం ధరించడం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని చెబుతారు.
వజ్రాన్ని ఎలా ధరించాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ మాసానికి చెందిన శుక్ల పక్షం శుక్రవారం సూర్యోదయం తర్వాత వజ్రాన్ని ధరించాలి. వజ్రాన్ని ధరించే ముందుగా దాన్ని శుద్ది చేయాలి. ఎందుకంటే తయారీ సమయంలో ఏవైనా ప్రతికూల శక్తులు వాటికి ఉంటే అవి తొలగిపోతాయి. అందుకే వజ్రాన్ని ముందుగా పాలు, గంగాజలం, చక్కెర మిఠాయి, తేనె మొదలైన వాటితో శుద్ధి చేయాలి. దీని తరువాత శుక్ర గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని జపించాలి. దీని తర్వాత వజ్రాన్ని ధరించాలి. జ్యోతిష్యుల అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే వజ్రం ధరించడం శ్రేయస్కరం.
ఈ రాశుల వారికి వజ్రం ధరించడం అశుభం
వజ్రం కొందరికి మాత్రమే అదృష్టాన్ని ఇస్తుంది. అది జాతకం ప్రకారమే ధరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు వజ్రం ధరించడం మానుకోవాలి. వజ్రం ధరించడం వారికి అశుభం అని చెబుతారు. కర్కాటక రాశి కలిగిన వాళ్ళు మాత్రం కొన్ని పరిస్థితులలో మాత్రమే వజ్రాన్ని ధరించవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.