ప్రాపర్టీలు, డబ్బు, కొత్త ప్రాజెక్టులు ఇలా ఎన్నో.. త్వరలో కుజుని అస్తంగత్వం, ఈ మూడు రాశులకు వరం!-wealth new projects jobs luck and many to these rasis with mars set this transit will give golden days to these rasis ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ప్రాపర్టీలు, డబ్బు, కొత్త ప్రాజెక్టులు ఇలా ఎన్నో.. త్వరలో కుజుని అస్తంగత్వం, ఈ మూడు రాశులకు వరం!

ప్రాపర్టీలు, డబ్బు, కొత్త ప్రాజెక్టులు ఇలా ఎన్నో.. త్వరలో కుజుని అస్తంగత్వం, ఈ మూడు రాశులకు వరం!

Peddinti Sravya HT Telugu

గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా మార్పులు వస్తాయి. కుజుడు ధైర్యానికి కారకుడు. కుజుడు నవంబర్ 1న 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాడు. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందితే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుజుని అస్తంగత్వంతో ఈ రాశులకు అనేక లాభాలు

కుజుని అస్తంగత్వంతో ఈ రాశులకు అనేక లాభాలు (pinterest)

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా మార్పులు వస్తాయి. కుజుడు ధైర్యానికి కారకుడు. కుజుడు నవంబర్ 1న 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాడు. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందితే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుజ సంచారంలో మార్పు:

కుజుడు నవంబర్ 1 సాయంత్రం 6:30కి అస్తంగత్వం చెందుతాడు. మే 2, 2026 వరకు అస్తంగత్వంలోనే ఉంటాడు. ఎక్కువ కాలం పాటు కుజుడు అస్తంగత్వం చెందడంతో కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు వస్తాయి. కుజుడు ఇలా అస్తంగత్వం చెందడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు.

జీవితం సంతోషంగా మారుతుంది. మరి ఏ రాశుల వారు కుజుని అస్తంగత్వంతో శుభ ఫలితాలను ఎదుర్కొంటారు? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడే తెలుసుకుందాం. వీటిలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

కుజుని అస్తంగత్వంతో ఈ రాశులకు అనేక లాభాలు

1.మిథున రాశి:

మిథున రాశి వారికి ఎక్కువ కాలం పాటు కుజుడు అస్తంగత్వంలో ఉండడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి.

రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇబ్బందులు అన్ని తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఈ సమయంలో ఏ విధమైన సమస్య అయినా సరే తీరిపోతుంది.

2.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి కుజుని సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తవుతాయి.

షాపులు ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎక్కువ లాభాలు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పటినుంచో కొనాలనుకున్న ప్రాపర్టీ మీ చేతికి వస్తుంది.

3.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఇది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొత్త అవకాశాలు కూడా వస్తాయి.

విదేశీ ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రాజెక్టులు కూడా మీ చేతికి వస్తాయి.

గమనిక: ఇవి జ్యోతిష శాస్త్ర అంచనాలు మాత్రమే. మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.