ఈ ఆలయంలో నీరు అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని నమ్మకం.. ఇంతటి మహిమగల ఆలయం ఎక్కడ ఉంది? పూర్తి వివరాలు ఇవిగో!-water in sri vaitheeswaran koil cures diseases and helps to get rid of problems check full details of this temple ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ ఆలయంలో నీరు అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని నమ్మకం.. ఇంతటి మహిమగల ఆలయం ఎక్కడ ఉంది? పూర్తి వివరాలు ఇవిగో!

ఈ ఆలయంలో నీరు అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని నమ్మకం.. ఇంతటి మహిమగల ఆలయం ఎక్కడ ఉంది? పూర్తి వివరాలు ఇవిగో!

Peddinti Sravya HT Telugu

వైతేశ్వరన్ కోయిల్ చాలా మహిమగలది. ఇక్కడ పవిత్ర జలం కుష్టువ్యాధి నుంచి బయటపడేస్తుందని నమ్మకం. ఈ ఆలయానికి వెళ్లి, ఇక్కడ స్నానం చేస్తే ఎంతటి అనారోగ్య సమస్యల నుండైనా బయటపడచ్చు. ఇంతటి మహిమగల ఆలయం ఎక్కడ ఉంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.

వైతేశ్వరన్ కోయిల్ (pinterest)

అద్భుతలకు నిలయాలు మన భారతదేశ దేవాలయాలు. దుఃఖాల నుంచి బయటపడడం మొదలు అనారోగ్య సమస్యల్ని తరిమి కొట్టడం వరకు, సానుకూల శక్తిని తొలగించడం మొదలు ప్రశాంతతని అందించే వరకు ఎన్నో సమస్యలను తీరుస్తాయి. కేవలం దేవుళ్లను ఆరాధించడానికి మాత్రమే కాదు. అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి కూడా దేవాలయాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు.

దేవాలయానికి వెళ్లడం వలన అంతర్గత శాంతి కలుగుతుందని, వ్యాధుల నుంచి బయటపడచ్చని ప్రజలు నమ్ముతారు. గంగా వంటి పవిత్ర నదుల నుంచి దేవాలయాల్లో ప్రజలకు అందించే ప్రసాదం దాకా దేవుడు పంపించిన వైద్యులు అని భక్తుల విశ్వాసం.

చాలా దేవాలయాల్లో విగ్రహాలని తాకడం, పవిత్ర జలాలను తాకడం లేదంటే బూడిద, పువ్వులు ఇటువంటివి ఎన్నో స్వస్థత పొందడానికి సహాయ పడతాయి. ఇవి అద్భుతమని ఔషధంగా పనిచేస్తాయని ప్రజల నమ్మకం.

సమస్యలను తొలగించే దేవాలయాలు

ఆలయం ఎంత పెద్దదైనా, చిన్నదైనా భక్తులని లోపల నుంచి నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది. కొన్ని శక్తులు ఏకంగా భక్తులని మార్చేస్తాయి. రాజస్థాన్ లో మెహందీపూర్ బాలాజీ ఆలయం దుష్టశక్తులు, ప్రతికూల శక్తులతో బాధపడే వారిని నయం చేయడానికి సహాయపడుతుంది. బైద్యనాథ్ ఆలయం ప్రజల్ని నయం చేయడానికి.. వ్యాధుల నుంచి బయట పడేయడానికి ఉపయోగపడుతుంది.

కొంతమంది మానసిక సమస్యలతో బాధపడేవారు కేరళలో ఉన్న చొట్టనిక్కర భగవతి ఆలయానికి వెళ్లి ఉపశమనాన్ని పొందారు. అయితే, ఇవన్నీ పక్కన పెడితే మరో ఆలయం గురించి చెప్పుకుని తీరాలి. తమిళనాడులోని వైతేశ్వరన్ కోయిల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఆలయంలో దైవిక వైద్యం చేసే వైతేశ్వరన్ రూపంలో శివుడు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దైవిక వైద్యుడు ఆలయం అని కూడా అంటారు.

వైతేశ్వరన్ కోయిల్

ఆలయ పవిత్ర జలం కుష్టువ్యాధి నుంచి బయటపడేస్తుందని ప్రజలు నమ్ముతారు. అలాగే ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి సహాయపడుతుందని అంటారు.

వైతేశ్వరన్ కోయల్ ఒక అద్భుతం

ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో ఇతిహాసాలు, కథలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది అంగారకుడి కథ. ఈ ఆలయంలో వైతేశ్వరుడిని ప్రార్థించడం వలన అంగారకుడు కుష్టి వ్యాధి నుంచి నయమైనట్లు ప్రజల నమ్మకం.

వైద్యాన్ని అందించే నీరు

అత్యంత ప్రసిద్ధి చెరువులలో సిద్దామృత తీర్థం ఒకటి. వైద్యం చేసే నీటిని ఇది కలిగి ఉంటుందని నమ్ముతారు. ఈ నీటిలో స్నానం చేస్తే శారీరక, మానసిక వ్యాధులు నయమవుతాయట. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడికి రాలేకపోతే బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చి నీటిని తీసుకువెళ్తారు.

వీటిని సమర్పిస్తారు

సాధారణంగా ఆలయానికి వెళ్ళేటప్పుడు పండ్లు, పూలు సమర్పిస్తూ ఉంటాము. కానీ ఈ ఆలయంలో బెల్లం, ఉప్పు, మిరియాలను సమర్పిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం