స్వప్న శాస్త్రం ప్రకారం కలలో యుద్ధం కనపడితే శుభమా, అశుభమా?-war in dreams are auspicious or not check what will happens based on swapna shastra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  స్వప్న శాస్త్రం ప్రకారం కలలో యుద్ధం కనపడితే శుభమా, అశుభమా?

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో యుద్ధం కనపడితే శుభమా, అశుభమా?

Peddinti Sravya HT Telugu

స్వప్న శాస్త్రం ప్రకారం, మనకి వచ్చే కలలు ఆధారంగా భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకోవచ్చు. కొన్ని కలలు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల్ని సూచిస్తాయి. ఒక్కోసారి మనకి మంచి కలలు కూడా వస్తూ ఉంటాయి. కలలో యుద్ధం కనపడితే శుభప్రదమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో యుద్ధం కనపడితే శుభమా, అశుభమా? (pinterest)

మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. అయితే కలలు వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుంది. కొన్ని కలలు శుభప్రదం. కొన్ని కలలు వస్తే మాత్రం అవి చెడు సంకేతాలు అని గ్రహించాలి. స్వప్న శాస్త్రం ప్రకారం, మనకి వచ్చే కలలు ఆధారంగా భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకోవచ్చు. ప్రతీ కల వెనుక ఒక రహస్యం దాగి ఉంటుంది.

కొన్ని కలలు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల్ని సూచిస్తాయి. ఒక్కోసారి మనకి మంచి కలలు కూడా వస్తూ ఉంటాయి. కలలో యుద్ధం కనపడితే శుభప్రదమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కోసారి కలలో యుద్ధం జరుగుతున్నట్లు కనబడుతూ ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమ, అశుభమా అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో యుద్ధం కనపడితే దాని వెనక అర్థం ఏంటి?

1.యుద్ధం జరుగుతున్నట్లు

కలలో యుద్ధం జరుగుతున్నట్లు కనపడితే అది శుభప్రదం కాదు. ఒకవేళ కనుక ఇటువంటి కల వచ్చిందంటే భవిష్యత్తులో ఏదైనా సమస్యలో ఇరుక్కోవాల్సి ఉంటుందట. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుందట.

2.కలలో యుద్ధ విమానం

కలలో యుద్ధ విమానం కనపడితే శుభప్రదం. ఎవరి కలలోనైతే యుద్ధ విమానం కనపడుతుందో వారి జీవితంలో అనేక విజయాలని అందుకుంటారని దానికి అర్థం. అలాగే కొత్త వ్యాపారాన్ని కూడా భవిష్యత్తులో మొదలు పెడతారని సంకేతం. ఇటువంటి కల శక్తిని చూపిస్తుంది.

3.మీరు యుద్ధం చేయడం

కలలో మీరు యుద్ధం చేస్తున్నట్లు కనపడితే అది మంచిది కాదు. ఆ వ్యక్తి జీవితంలో గందరగోళం లేదా చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

4.మీపై యుద్ధం జరగడం

ఒకవేళ మీపై ఎవరైనా యుద్ధం చేస్తున్నట్లు కల వస్తే, మీ జీవితంలో సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయట. ఇటువంటి కలలు వచ్చినప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే ఎటువంటి సమస్యలు ఉండవు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.