Sun Transit 2022 : సూర్యుని రాశిచక్రంలో మార్పు.. పలు రాశులవారికి అదృష్టం..
Sun Transit 2022 : ఈరోజు సూర్యుని రాశిచక్రం మారబోతోంది. సూర్యుని సంచారము వలన ప్రతి రాశిపై ఏదో ఒక ప్రభావం ఉంటుంది. అయితే తాజాగా సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల పలు రాశుల వారికి లాభాలు ఉంటాయి అంటున్నారు. ఇంతకీ ఏ రాశివారికి ప్రయోజనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun Transit 2022 : నవంబర్ 16వ తేదీన అనగా ఈరోజు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రోజున సూర్యుని వృశ్చిక సంక్రాంతి కూడా ఉంది. దీనితో సౌర క్యాలెండర్ వృశ్చిక రాశి కొత్త నెల కూడా ప్రారంభమవుతుంది. సూర్యుని ఈ సంచారము వలన అన్ని రాశి చక్రాలపై ప్రభావం ఉంటుంది. అయితే.. కొన్ని రాశుల వారికి లాభాలు కలిసి వస్తాయి అంటున్నారు. ఇంతకీ ప్రయోజనం పొందే ఆ రాశుల వారు ఎవరంటే..
మిథున రాశి
సూర్యుని రాశి మార్పులో మిథున రాశి వారు అత్యంత లాభాన్ని పొందబోతున్నారు. వారి ఇంటికి కొత్త వాహనం లేదా ఆస్తి రావచ్చు. రుణంపై ఇచ్చిన డబ్బును కూడా స్వీకరించవచ్చు. స్టాక్ మార్కెట్‌లో నిమగ్నమైన వ్యక్తుల షేర్లలో బూమ్ ఉంటుంది. అది వారిని ధనవంతులను చేస్తుంది.
కర్కాటక రాశి
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు సూర్యుని సంచారము వలన గొప్ప వార్తలను పొందుతారు. కోర్టులో నడుస్తున్న పాత కేసులు వారికి అనుకూలంగా వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
కన్య
సూర్యభగవానుడి రాశిలో మార్పు కారణంగా కన్యా రాశి వారికి అదృష్టం లభిస్తుంది. వారు పనికి సంబంధించి ప్రయాణం చేయవచ్చు. సమాజంలో వారి స్థానం, ప్రతిష్టలు పెరుగుతాయి. పనిలో తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ఇది వ్యాపారంలో పురోగతి ఇస్తుంది.
మకరరాశి
ఈ రాశి వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది. పిల్లల చదువు విషయంలో ఆటంకాలు ఉండవు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఎక్కడి నుంచైనా హఠాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి షికారుకి వెళ్లే అవకాశముంది.
వృశ్చిక రాశి
సూర్యుని సంచారము కారణంగా.. ఈ రాశి ప్రజలు అనేక శుభవార్తలను వింటారు. విదేశాల్లో తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. శత్రువుల బలం మందగించి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్