Ugadi Rasi Phalalu 2025: వృశ్చిక రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు.. ఈ ఏడాది నూతన వస్తు, ఆభరణాలు
Ugadi Rasi Phalalu 2025: వృశ్చిక రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా వున్నాయి? వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వృశ్చికం (విశాఖ 4వ పాదం: అనూరాధ: జ్యేష్ఠ)
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా
గురుడు వృషభ రాశి సంచారంతో శుభవార్తలు
గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
గురుడు మిథునంలో ఉండడం వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను వస్తాయి. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు ఎక్కువవుతాయి.
శని మీన రాశి సంచారంతో బంధు, మిత్రులతో విరోధం
శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృ బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
రాహువు మీన రాశి సంచారంతో నూతన వ్యక్తులతో పరిచయం
రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. పిల్లల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.
కేతువు కన్య రాశి సంచారంతో నూతన వస్తు, ఆభరణాలు
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
19.5.25 నుండి వసంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఋణ ప్రయత్నాలు చేస్తారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా
బృహస్పతి మే నుండి ఎనిమిదవ స్థానములో, శని ఐదవ స్థానములో, రాహువు మే నుండి నాలుగవ స్థానములో, కేతువు మే నుండి పదవ స్థానములో సంచరించుట చేత వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గ్రహ గతులను పరిశీలించగా మధ్యస్థ ఫలితాలను సూచించుచున్నవి. ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవలసిన సమయం.
వృశ్చిక రాశికి పంచమ స్థానములో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికి అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచన. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెట్టును. మానసిక సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు కలుగుచున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలిగినప్పటికి పని ఒత్తిళ్ళు వంటివి కొంత వేధించును.
ఎవరికి ఎలా?
- వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చును. ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు జాగ్రత్త వహించాలి.
- వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును.
- పని ఒత్తిళ్ళు ఏర్పడు సూచన. ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించండి.
- మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండండి. ప్రతీ విషయాన్ని మనసు లోతుల్లోకి తీసుకోకండి.
- రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయం. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది.
- వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును.
- వ్యాపారాభివృద్ధి జరుగును. సినీరంగం, మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం. వ్యాపారపర మైనటువంటి నిర్ణయాలు శుభఫలితాలను ఇచ్చును.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి. తాంబూలం సెనలగను ముత్తయిదువలకు సమర్పించండి. సెనగల ప్రసాదమును ఆలయాలలో పంచిపెట్టండి.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విపరీతమైన ఖర్చులుంటాయి. ఏ కార్యము తలపెట్టినా కలసిరాదు. శారీరక అలసట. అపజయములు. వృథా శ్రమ. అనుకోని కష్టములు. అవమానములు ఎక్కువ. పుత్రుల కోసం ఆలోచన. శుభ వర్తమానముంటుంది.
మే నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులు కలసివచ్చును. కార్యలాభం. ప్రయాణము నందు సౌఖ్యం. కొత్త వ్యవసాయం ప్రారంభం. వ్యవహారాలలో విజయం. కోర్టు తీర్పు అనుకూలించును. సంఘంలో గౌరవముంటుంది. మానసికాందోళన, భయము.
జూన్ నెల
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు. తీర్థయాత్రలు చేస్తారు. స్నేహితుల సహకారముంటుంది. శత్రువులు అధికమవుతారు. కార్యాటంకములు. పట్టుదల పెరుగును. స్థిరచరాస్తుల విక్రయం. కాళ్ళకు గాయములగును.
జూలై నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రప్రాప్తి. స్నేహ కలహములుంటాయి. దేవాలయ దర్శనములు. కుటుంబములో సౌఖ్యము. పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు. మీరు చేసే పనికి ఆటంకాలు ఏర్పడతాయి. ధన లాభం.
ఆగస్టు నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపారపరంగా ఆటంకాలు. ధన నష్టములు, అపనిందలుంటాయి. స్థానచలనములు. ఆరోగ్య సమస్యలుంటాయి. స్త్రీ సమాగమములు. శక్తికి మించిన పనులు చేయుదురు. స్నేహితుల సహకారముంటుంది.
సెప్టెంబర్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కార్యజయములు, అధికార లాభము. శుభమూలక ధన వ్యయం. వ్యవసాయపరంగా అభివృద్ధి. అందరి సహకారం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగును. ఆస్థి వివాదాలు కొన్ని అశుభవార్తలుంటాయి.
అక్టోబర్ నెల
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. తక్కువ శ్రమతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. కోర్టు వ్యవహారములు కలసిరావు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కావలసినవారితో ఇబ్బందులు.
నవంబర్ నెల
ఈ మాసం అనుకూలంగా లేదు. మాట పట్టింపులుంటాయి. శతృత్వము. వాహన ప్రమాదాలున్నాయి. పోలీసు వారితో చిక్కులు. అనారోగ్య సమస్యలు. మీరు పనిచేయు సంస్థలో కీలకపాత్ర వహిస్తారు. జాయిట్ వ్యాపారం కలసిరాదు.
డిసెంబర్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. మనోవేదన. వృథా ప్రయాస. కోర్టుపరంగా ఇబ్బందులు. వృథా ప్రయాణాలుంటాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు. ఇంటి పనులపరంగా ఖర్చు. వివాహ ప్రయత్నాలు.
జనవరి నెల
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది. ధనదాయం పెరుగును. రాజకీయపరంగా శుభకార్యాలకు హాజరవుతారు. ఒక సమాచారం ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. స్నేహ బాంధవ్యాలు పెరుగును. భార్యా పిల్లల గూర్చి ఆలోచిస్తారు.
ఫిబ్రవరి నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపార వ్యవహారములు కలసివచ్చును. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికార ఒత్తిడి. సంతానపరంగా ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. రుణములు తీర్చుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మార్చి నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం. స్థిరాస్తి వృద్ధి చేయుదురు. ఆకస్మిక ధన లాభము. వాహన, వస్త్ర లాభము. లావాదేవీలు ఫలించును. దూరపు వ్యక్తులతో సంప్రదింపులు. నిరుత్సాహం.
సంబంధిత కథనం