Vivaha Panchami: నేడే వివాహ పంచమి, దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ఇవి దానం చేయడం మర్చిపోకండి-vivaha panchami celebrating love harmony and peace in marriage life with special donations for blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vivaha Panchami: నేడే వివాహ పంచమి, దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ఇవి దానం చేయడం మర్చిపోకండి

Vivaha Panchami: నేడే వివాహ పంచమి, దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ఇవి దానం చేయడం మర్చిపోకండి

Ramya Sri Marka HT Telugu
Dec 06, 2024 06:35 AM IST

Vivaha Panchami: దాంపత్య జీవితంలో గొడవలు, మనస్పర్దలు తొలగిపోయి అన్యోన్యంగా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేసే రోజు వివాహ పంచమి. శ్రీరాముడు, సీతాదేవిల వివాహాన్ని పురస్కరించుకుని ఈ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున కొన్నింటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మిక.

వివాహ పంచమి రోజు దానాలు
వివాహ పంచమి రోజు దానాలు (pinterest)

శ్రీరాముడు, సీతాదేవిల పవిత్ర వివాహాన్ని జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ వివాహ పంచమి. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున స్వయం వరంలో శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచి సీతమ్మ తల్లిని వివాహమాడాడు. అందుకే ఈ రోజును వివాహ పంచమిగా పిలుస్తారు. వివాహ పంచమి వివాహ పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. ఈ పండుగ వారి ప్రేమ, భక్తికి ప్రాతినిధ్యంగా పరిగణిస్తారు.

yearly horoscope entry point

ఈ పర్వదినాన పెళ్లి అయిన జంటలు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. ఈ రోజున సీతారాములను ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్మిక. పైగా సంతోషకరమైన, విజయవంతమైన వైవాహిక జీవితాన్ని సిద్ధిస్తుందని విస్తృతంగా నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, 2024లో వివాహ పంచమి డిసెంబర్ 5న తెల్లవారుజామున 12:39 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 6న మధ్యాహ్నం 12:07 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయం ప్రకారం, వివాహ పంచమి ప్రధానంగా 6 డిసెంబర్ 2024న ఆచరిస్తారు.

ఈ రోజున, భక్తులు తమ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సును తీసుకురావడానికి, శ్రీ మహా విష్ణువును, లక్ష్మీ దేవిని సూచించే అరటి చెట్టును పూజించాలనే నియమం ఉంది. పెళ్లి కావాల్సిన యువతీయువకులకు ఈ ఆచారం ముఖ్యంగా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆరాధనతో పాటు వివాహ పంచమి నాడు చేసే దానం కూడా సంప్రదాయంలో అపారమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున నిర్దిష్ట వస్తువులను సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని, సంతోషం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తారు.

వివాహ పంచమి రోజున దానం చేయడం వల్ల ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆటంకాలు తొలగి పరిష్కారం దొరుకుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, ఈ రోజున దానం చేయడం వల్ల సామరస్యపూర్వక వైవాహిక జీవితంతో పాటు ప్రేమ మరింత పెరిగి బంధం బలపడుతుంది. ఆయా కుటుంబాలలో సద్భావన కలిగి శాంతి, శ్రేయస్సును పెంపొందుతాయి.

వివాహ పంచమి రోజున ఏయే వస్తువులు దానం చేస్తే శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

  • సౌభాగ్యానికి చిహ్నాలుగా భావించే కుంకుమ, గాజులు మొదలైనవి వివాహ పంచమి పర్వదినాన దానం చేయడం వల్ల వివాహిత మహిళలు సంతోషకరమైన, సంతృప్తికరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు.
  • ఈ రోజున పేదవారికి లేదా అవసరమైన వారికి బట్టలు దానం చేయడం వల్ల సత్కర్మ ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవితంలో అడ్డంకులను తొలగిస్తుంది.
  • వివాహ పంచమి రోజున ధన ధాన్యాలను దానం చేయడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటుంది. ఆ ఇంట సంపద మెరుగై సంతోషం నెలకొంటుంది.
  • అలాగే ఈ రోజున ఆకలితో ఉన్నవారికి లేదా అనారోగ్యంతో ఉన్న వారికి ఆహారం, పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక శ్రేయస్సుకు దోహదపడుతుంది.
  • వివాహ పంచమి రోజున స్వీట్లు దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరిగి, ఇల్లు ఆనందమయం అవుతుంది.
  • ఈ రోజు దగ్గరలోని ఆలయానికి ఆవు పాలు దానం చేయడం వల్ల శ్రేయస్సుతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.

దానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

దానం చేసే సమయంలో చిత్తశుద్ధిగా దానం చేయాలి. మనసులో ఎటువంటి దురాశ లేదా స్వార్థం లేకుండా నిస్వార్థ హృదయంతో లేని వారికి సహాయం చేయాలి. ఆర్భాటాల కోసం, ప్రదర్శనల కోసం దానం చేయకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner