Vivaha Panchami 2022 : వివాహ పంచమి రోజున వివాహం చేసుకోరు.. ఎందుకో తెలుసా?-vivaha panchami 2022 date and time and shuba muhurtam and significance and history ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Vivaha Panchami 2022 Date And Time And Shuba Muhurtam And Significance And History

Vivaha Panchami 2022 : వివాహ పంచమి రోజున వివాహం చేసుకోరు.. ఎందుకో తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 18, 2022 07:58 AM IST

Story Behind Vivaha Panchami 2022 : వివాహ పంచమి రోజున.. సీతా-శ్రీరాముడికి అంగరంగ వైభవంగా పెళ్లిచేస్తారు. ఈ కల్యాణాన్ని ఓ వేడుకలా జరుపుకుంటారు. కానీ వివాహ పంచమి రోజున మాత్రం వివాహం చేసుకోవడం అశుభంగా పరిగణిస్తారు. అసలు వివాహ పంచమి రోజు ఎందుకు ప్రత్యేకమైనదో.. ఆరోజు ఎందుకు పెళ్లిల్లు చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.

వివాహ పంచమి
వివాహ పంచమి

Vivaha Panchami 2022 : హిందూ క్యాలెండర్ ప్రకారం.. మార్గశిర మాసంలోని.. శుక్ల పక్షం ఐదవ రోజున వివాహ పంచమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం వివాహ పంచమి నవంబర్ 28వ తేదీన వచ్చింది. భక్తులు వివాహపంచమిని ఓ పండుగలా చేసుకుంటారు. ఉపవాసాలు, పూజలు చేస్తారు. సీతా-శ్రీరామ కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఇన్ని చేసినా.. ఆరోజు మాత్రం వివాహం చేసుకోరు. దానిని అశుభంగా భావిస్తారు. మరి ఇంతకీ ఆరోజు ఏమి చేస్తే మంచిదో.. పెళ్లిల్లు ఎందుకు ఆరోజు చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

* వివాహ పంచమి తేదీ - నవంబర్ 28, సోమవారం

* పంచమి తిథి ప్రారంభం - నవంబర్ 27 సాయంత్రం 4.25 గంటలకు

* పంచమి తిథి ముగింపు - నవంబర్ 28 మధ్యాహ్నం 1.35 గంటలకు

నవంబర్ 28న ఉదయ తిథి కావడంతో అదే రోజు వివాహ పంచమి పండుగను జరుపుకుంటారు.

వివాహ పంచమి 2022 శుభ సమయం

* అభిజీత్ ముహూర్తం - ఉదయం 11.48 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

* సర్వార్థ సిద్ధి యోగం - నవంబర్ 29 ఉదయం 10.29 నుంచి 6.55 వరకు

* రవియోగం - నవంబర్ 29 ఉదయం 10.29 నుంచి 6.55 వరకు

అందుకే వివాహ పంచమి రోజున వివాహం చేయరట..

భార్యాభర్తలు అంటే రాముడు,సీతలా ఉండాలి అంటారు. ఆదర్శవంతమైన జీవితానికి వారు చక్కని ఉదాహరణ అందించారు. కానీ ఇప్పటికీ ప్రజలు రాముడు, సీత వివాహం జరిగిన తేదీన వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. దీనికి కారణం శ్రీ రాముడు, సీతమ్మ జీవితంలో పెళ్లి తర్వాత చాలా కష్టాలు అనుభివించారు.

ఇద్దరూ 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అనంతరం సీత ఒక అగ్నిపరీక్షను ఎదుర్కొంది. తర్వాత రాముడు గర్భవతి సీతను విడిచిపెట్టేశాడు. అనంతరం సీత తన తదుపరి జీవితాన్ని అడవిలో గడపవలసి వచ్చింది. అక్కడే ఉంటూ తన పిల్లలను పెంచింది. ఇలా రాముడు, సీత వైవాహిక జీవితంలో చాలా కష్టాలను చూశారు. అందుకే వివాహ పంచమి రోజున వారి పిల్లలకు వివాహం చేయరు. ఎందుకంటే సీత, శ్రీరాముడు అనుభవించినన్ని కష్టాలు, దుఃఖాన్ని వారి పిల్లలు ఎన్నటికీ భరించలేరని వారికి తెలుసు.

వివాహ పంచమి రోజు ఏమి చేయాలంటే..

వివాహ పంచమి రోజున కన్యక బాలికను పూజించడాన్ని శ్రేయస్కరంగా చెప్తారు. అలా చేస్తే వారికి ఉత్తమ వరుడు లభిస్తాడని భావిస్తారు. వివాహానికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా లేదా ఏదైనా కారణం వల్ల జాప్యం జరిగినా వివాహ పంచమి రోజున రాముడు, సీతమ్మకు పూజలు చేస్తే మంచిదని చెప్తారు. మరోవైపు వివాహ పంచమి రోజున భార్యాభర్తలు ఉపవాసం పాటిస్తే వారి వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం