Vivah Panchami 2024: వివాహ పంచమి రోజున ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి? మేషం నుంచి మీనం వరకూ
Vivah Panchami 2024: పురాణాల్లో వివాహ పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సీతారాములు కళ్యాణం జరిగిన ఈ రోజున ప్రత్యేక పూజలు, పరిహారాలు చేసే వారికి వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని, కోరికలు నెరవేతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరోజు ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి.
హిందూ పండగల్లో వివాహ పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీరాముడు సీతామాతను వివాహం చేసుకున్నాడు. వివాహ పంచమి రోజున చేసే ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ దూరం చేస్తాయని, సంతానం విషయంలో కూడా కోరికలు నెరవేరతాయిని హిందువుల విశ్వాసం. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వివాహ పంచమిగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వివాహ పంచమి డిసెంబర్ 6న వచ్చింది. ఈ రోజున ప్రత్యేక పరిహారాలను పాటించడం వల్ల వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు,విశ్వాసం పెరుగుతాయి. వివాహం కాని వారికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కోరుకున్న వరుడిని పొందాలనే కోరిక కూడా నెరవేరుతుందని నమ్ముతారు. సంతానం విషయంలో ప్రతికూల పరిస్థితులు కూడా దూరమవుతాయని నమ్మిక. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం వివాహ పంచమి రోజున ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం.
వివాహ పంచమి రోజున ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి?
మేష రాశి: దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉండటానికి మేష రాశి వారు వివాహ పంచమి రోజున సీతారాములను నిష్టతో పూజించాలి. స్త్రీలు సీతాదేవికి ఎర్ర గాజులు, బట్టలను సమర్పించాలి.
వృషభ రాశి: వృషభ రాశి వారు వివాహ పంచమి రోజున శ్రీరాముడు, సీతామాతను కలిసి పూజించాలి. సీతారాములకు ఇష్టమైన పాలు, పాయసం, పండ్లను సమర్పించాలి.
మిథున రాశి: వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవడానికి, నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్థిల్లడానికి మిథున రాశి వారు వివాహ పంచమి రోజున సీతాదేవికి ఆకుపచ్చ గాజులు, బట్టలు సమర్పించాలి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు వివాహ పంచమి రోజున సీతారాములకు ఇష్టమైన పసుపు రంగు లేదా గులాబి రంగు వస్త్రాలను సమర్పించాలి. పూజలో నైవేద్యంగా పాయసాన్ని పెట్టడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి: వివాహ పంచమి రోజున రాముడికి పసుపు పువ్వులు, సీతామాతకు గులాబీ పువ్వులు, తులసి ఆకులను సమర్పించడం వల్ల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండుతుందని విశ్వాసం.
కన్యా రాశి: వివాహ పంచమి రోజున కన్య రాశి వారు శ్రీ సీతా చాలీసా పారాయణం చేయాలి. సీతాదేవికి ఇష్టమైన గులాబీ రంగు లేదా పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి.
తులా రాశి: తులారాశి వారు వివాహ పంచమి రోజున సీతాదేవికి గులాబీ గాజులు లేదా పసుపు రంగు గాజులను సమర్పించాలి. రాముడికి ఇష్టమైన పాయసం లేదా ఖీర్ ను నైవేద్యంగా సమర్పించాలి.
వృశ్చిక రాశి: వివాహ పంచమి సందర్భంగా వృశ్చిక రాశి వారు సీతాదేవికి చీర, గాజులు సహా పదహారు రకాల వస్తువులతో అలంకరణ చేయాలి. ముత్తయిదువులకు వాయనం ఇస్తే మరింత మంచిది.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు వివాహ పంచమి నాడు శ్రీరాముడికి బెల్లం సమర్పించాలి. వైవాహిక జీవితంలో సమస్యలను దూరం చేసుకునేందుకు దంపతులిద్దరూ కలిసి సీతారాములను నిష్టతో ప్రార్థించాలి.
మకర రాశి: మకర రాశి వారు వివాహ పంచమి నాడు శ్రీ రామ్ చాలీసా పఠించాలి. సీతాదేవికి ఇష్టమైన పసుపు, కుంకుమ, తులసి ఆకులు, సువాసన వెదజల్లే పూలను పూజలో ఉపయోగించాలి.
కుంభ రాశి: వివాహ పంచమి సందర్భంగా కుంభ రాశి వారు సీతారాములకు ఖీర్ లేదా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పసుపుకుంకుమలతో పాటు జామి వుప్వులు, వేప, తులసి ఆకులతో పూజించాలి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించాలి.
మీన రాశి: మీన రాశి వారు వివాహ పంచమి నాడు శ్రీ సీతా చాలీసా పఠించాలి. గులాబీ రంగు లేదా పసుపు రంగు వస్త్రాలు, గాజులకు సమర్పించాలి.