ప్రతీ ఒక్కరికి కూడా ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది. వాటి నుంచి బయటపడడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో పరిహారాలని కూడా పాటిస్తూ ఉంటారు. అయితే, చాలా మంది వీసా రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు కూడా త్వరగా వీసాని పొందాలనుకుంటే ఈ పరిహారాలని ప్రయత్నం చేయండి. వీటితో వీసా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
కొన్ని జ్యోతిష్య పరిహారాలని పాటించడం వలన సమస్యల నుంచి బయటపడొచ్చు. అనుకున్న పనులు జరుగుతాయి. ఏమైనా కష్టాలు ఉంటే అవి తొలగిపోతాయి. అయితే, వీసా రావాలంటే మాత్రం వీటిని ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. వీసా లభిస్తుంది.
వీసా రాక ఇబ్బంది పడుతున్నట్లయితే రెగ్యులర్ గా పక్షులకు ధాన్యాలు, నీళ్లు అందించండి. ఈ పరిహారాన్ని పాటించడం వలన సులువుగా వీసా వస్తుంది.
త్వరగా విదేశాలకు వెళ్లాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా ఒక రాగి పాత్ర తీసుకుని అందులో కుంకుమ నీళ్లు కలిపి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేసేటప్పుడు సూర్యుని మంత్రాలని పటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వీసాకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి.
త్వరగా వీసా రావాలంటే సుందరకాండని చదువుకోవడం మంచిది. ఈ పరిహారాన్ని పాటిస్తే వేగంగా వీసా లభిస్తుంది. మంగళవారం లేదా శనివారం నాడు చదివితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
గురువు, శుక్రుడు జాతకంలో అసంతృప్తి కలిగినట్లయితే శాంతి పరచడానికి కొన్ని చర్యలను పాటించవచ్చు. గురువారంనాడు పసుపు రంగు ఆహారాన్ని తినడం, పసుపు రంగు దుస్తుల్ని ధరించడం వలన శుక్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం వలన కూడా ఈ గ్రహాలు సంతోషపడతాయి. వీసా త్వరగా లభించే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం