ధన త్రయోదశి నాడు శక్తివంతమైన యోగాలు, ఈ రాశుల వారికి అపారమైన సంపద కలుగుతుంది, వీళ్ళ ఇళ్లల్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది-very powerful yogas on dhanu trayodashi dhanteras 2025 these zodiac signs receives immense wealth lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ధన త్రయోదశి నాడు శక్తివంతమైన యోగాలు, ఈ రాశుల వారికి అపారమైన సంపద కలుగుతుంది, వీళ్ళ ఇళ్లల్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది

ధన త్రయోదశి నాడు శక్తివంతమైన యోగాలు, ఈ రాశుల వారికి అపారమైన సంపద కలుగుతుంది, వీళ్ళ ఇళ్లల్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది

Peddinti Sravya HT Telugu

ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుకుంటాము. ఆ రోజు ధన్వంతరి, కుబేరులను పూజిస్తారు. ఈసారి ధన త్రయోదశి వేళ కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ధన త్రయోదశి వేళ అరుదైన బ్రహ్మయోగం ఏర్పడుతుంది. ఇది రాత్రి వరకు ఉంటుంది.

ధన త్రయోదశి నాడు శక్తివంతమైన యోగాలు (pinterest)

ధన త్రయోదశి చాలా విశేషమైన రోజు. ధన త్రయోదశి నాడు ఉపవాసం ఉంటే కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుకుంటాము. ఆ రోజు ధన్వంతరి, కుబేరులను పూజిస్తారు. ఈసారి ధన త్రయోదశి వేళ కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ధన త్రయోదశి వేళ అరుదైన బ్రహ్మయోగం ఏర్పడుతుంది. ఇది రాత్రి వరకు ఉంటుంది.

శక్తివంతమైన యోగాలు

అదే విధంగా ఎంతో విశేషమైన శివవాస యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ యోగాల కారణంగా అన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. కొన్ని రాశులు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మరి ధన త్రయోదశి వేళ ఏ రాశి వారు అదృష్టాన్ని పొందబోతున్నారు, ఎవరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ధన త్రయోదశి నాడు శక్తివంతమైన యోగాలు.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు:

1.మేష రాశి:

మేష రాశి వారికి ధన త్రయోదశి వేళ అనేక మార్పులు ఉంటాయి. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు. సంతోషంగా ఉంటారు. దేనికి లోటు ఉండదు.

2.కన్యా రాశి:

కన్యా రాశి వారికి ధన త్రయోదశి వేళ బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు కూడా ఎక్కువ లాభాలను పొందుతారు. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. జీవితం ఆనందంగా సాగుతుంది. పూర్వికుల నుంచి ఆస్తి వస్తుంది.

3.తులా రాశి:

తులా రాశి వారికి ధన త్రయోదశి అదృష్టం తీసుకువస్తుంది. ఈ రాశి వారు ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. జీవిత భాగస్వామి ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. వారి సపోర్ట్ కూడా ఉంటుంది.

4.ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి ఈ యోగాల వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. పాత పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.