ధన త్రయోదశి కంటే ముందే గజకేసరి రాజయోగం, ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే.. సంతోషం, ప్రశాంతత, డబ్బు, అదృష్టం ఇలా అన్నీ!-very powerful gajakesari yogam before dhanteras these rasis receives golden days and get wealth peace luck happiness too ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ధన త్రయోదశి కంటే ముందే గజకేసరి రాజయోగం, ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే.. సంతోషం, ప్రశాంతత, డబ్బు, అదృష్టం ఇలా అన్నీ!

ధన త్రయోదశి కంటే ముందే గజకేసరి రాజయోగం, ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే.. సంతోషం, ప్రశాంతత, డబ్బు, అదృష్టం ఇలా అన్నీ!

Peddinti Sravya HT Telugu

ఈ ఏడాది ధన త్రయోదశి కంటే ముందే గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. అక్టోబర్‌ 12న చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే గురువు అదే రాశిలో సంచారం చేస్తాడు. ఈ ప్రత్యేకమైన యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. సానుకూల మార్పులు చూస్తారు. మరి గజకేసరి రాజయోగం ఏ రాశులకి కలిసి వస్తుంది?

ధన త్రయోదశి కంటే ముందే గజకేసరి రాజయోగం (pinterest)

గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. త్వరలో ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడనుంది. ఈ యోగం కారణంగా చాలా మంది జీవితాల్లో వెలుగులు వస్తాయి, సంతోషం ఉంటుంది, డబ్బుకి లోటు ఉండదు. ఈ ఏడాది ధన త్రయోదశి కంటే ముందే ఈ రాజయోగం ఏర్పడబోతోంది. అక్టోబర్‌ 12న చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే గురువు అదే రాశిలో సంచారం చేస్తాడు.

గజకేసరి రాజయోగం

ఈ రెండిటి సంయోగం వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యోగం చాలా ప్రత్యేకమైనది. ఈ యోగం కారణంగా మానసిక ప్రశాంతత ఉంటుంది, అనేక విధాలుగా లాభాలు ఉంటాయి.

ఆర్థికపరంగా బాగుంటుంది

అయితే, ఈ ప్రత్యేకమైన యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. సానుకూల మార్పులు చూస్తారు, ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. అయితే మరి గజకేసరి రాజయోగం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలన్నీ పొందుతారో ఇప్పుడే తెలుసుకుందాం.

గజకేసరి రాజయోగంతో ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. మీ భావాలను, ఆలోచనలను ఇతరులతో సులువుగా పంచుకుంటారు. ఈ సమయంలో ఎప్పటి నుంచో రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది.

మార్కెటింగ్‌, మీడియా, బ్యాంకింగ్‌ రంగాల్లో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. స్టాక్‌ మార్కెట్‌ ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి. పూర్తికాని పనులు పూర్తవుతాయి. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది. ఎక్కువ డబ్బుని ఆదా చేస్తారు.

2.మిధున రాశి

మిధున రాశి వారికి గజకేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సానుకూల మార్పులను చూస్తారు. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. తెలివితేటలు, ఆలోచన సామర్థ్యం కూడా ఎక్కువ అవుతుంది.

వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పెళ్లి కాని వారికి ఈ సమయంలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. సంతోషం, ప్రశాంతత, డబ్బు, అదృష్టం మీతోనే ఉంటాయి. మొత్తానికి గజకేసరి రాజు యోగంతో మీకు అనేక విధాలుగా కలిసివస్తుంది.

3.కన్య రాశి

కన్య రాశి వారికి ఈ ప్రత్యేకమైన యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. కన్య రాశి వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. కొత్త వాటిని మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం.

కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికపరంగా బావుంటుంది. వ్యాపారస్తులకి కూడా ఇది శుభ సమయం. మీ తండ్రితో మీకున్న అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. ప్రశాంతత, సంతోషము ఉంటాయి.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.