శుక్రుడి రాశి మార్పు: వృషభంలోకి శుక్రుడు, ఈ ఏడు రాశుల వారి జీవితాల్లో శ్రేయస్సు, సంపద!-venus transit in tarus and it brings wealth and prosperity to these seven zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శుక్రుడి రాశి మార్పు: వృషభంలోకి శుక్రుడు, ఈ ఏడు రాశుల వారి జీవితాల్లో శ్రేయస్సు, సంపద!

శుక్రుడి రాశి మార్పు: వృషభంలోకి శుక్రుడు, ఈ ఏడు రాశుల వారి జీవితాల్లో శ్రేయస్సు, సంపద!

Peddinti Sravya HT Telugu

శుక్రుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు, భౌతిక సౌకర్యాలు, ఆర్థిక లాభాలను అందిస్తాడు. శుక్రుడి రాశి మార్పు పన్నెండు రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ ఏడు రాశులకు మాత్రం అనేక లాభాలను ఇస్తుంది. మరి ఈ రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

వృషభరాశిలోకి శుక్రుడు

జూన్ 29న మధ్యాహ్నం రెండు గంటలకు శుక్రుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు, భౌతిక సౌకర్యాలు, ఆర్థిక లాభాలను అందిస్తాడు.

శుక్రుడి రాశి మార్పు, రాశుల వారిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది అనేది తెలుసుకుందాం.

శుక్రుడి రాశి మార్పు ఏ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది:

1.మేష రాశి:

మేష రాశి వారికి శుక్రుడు వృషభ రాశి సంచారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడి రాశి మార్పుతో, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి నుంచి బాగా లాభాలు వస్తాయి. కుటుంబ సమతుల్యత కూడా ఉంటుంది.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి శుక్రుని రాశి మార్పు అనేక లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

3.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి శుక్రుని రాశి మార్పు అనేక విధాలుగా సహాయపడుతుంది. ఈ సమయంలో, ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి కూడా డబ్బులు వస్తాయి. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. ప్రేమ జీవితంలో కూడా మంచి మార్పులు ఉంటాయి.

4.కన్య రాశి:

కన్య రాశి వారికి శుక్రుని రాశి మార్పు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. విదేశాలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తారు. ప్రేమ జీవితం కూడా మధురంగా మారుతుంది.

5.ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి శుక్రుని రాశి మార్పు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు పని ప్రదేశంలో సక్సెస్‌ను అందుకుంటారు. ఆరోగ్యం కూడా నెమ్మదిగా మెరుగుపడుతుంది.

6.మకర రాశి:

మకర రాశి వారికి శుక్రుని రాశి మార్పు మంచి లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు గృహజీవితంలో సంతోషంగా ఉంటారు. ఆర్ట్, రైటింగ్, క్రియేటివ్ వర్క్స్ చేసే వారికి కూడా ఈ సమయం బాగుంటుంది.

7.మీన రాశి:

మీన రాశి వారికి శుక్రుని రాశి మార్పు అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో, ఈ రాశి వారు చిన్న చిన్న ట్రిప్స్ వేస్తారు. కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ధైర్యం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.