గ్రహాలన్నీ ఎప్పటికప్పుడు రాశులని మారుస్తూ ఉంటాయి. అలాగే ఇతర గ్రహాలతో సంయోగం చెందుతూ ఉంటాయి. దీంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి. శక్తివంత రాజయోగాల్లో మాలవ్య రాజయోగం కూడా ఒకటి.
మాలవ్య రాజయోగం ప్రభావం వలన ఐశ్వర్యం, తేజస్సు, శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి. త్వరలోనే జూన్ నెలలోనే ఈ యోగం ఏర్పడనుంది. అదృష్ట గ్రహం అయినటువంటి శుక్రుడు జూన్ 29 మధ్యాహ్నం 1:56 గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ రాశిలోకి వచ్చినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఈ రాజయోగం కారణంగా అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది కానీ కొన్ని రాశుల వారు మాత్రం విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. వారు అనేక లాభాలని పొందుతారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
మీన రాశి వారికి మాలవ్య రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళతారు. శుక్రుడు వృషభ రాశి సంచారంతో ఏర్పడిన ఈ మాలవ్య రాజ యోగం నిరుద్యోగులకు ఉద్యోగాలని అందిస్తుంది.
వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. కొత్త వాహనాలని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త ఇంటి నిర్మాణానికి ప్రణాళికలు వేస్తారు.
వృషభ రాశి వారికి మాలవ్య రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది. సానుకూల మార్పులు చూస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం నుంచి అనేక లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. మార్కెటింగ్, సేల్స్ వంటి రంగాల్లో రాణిస్తున్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి.
కన్యా రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. కెరియర్ లో సక్సెస్ ని అందుకుంటారు. జీతం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. పెళ్లి కానీ వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.