Venus transit: కొత్త సంవత్సరం వీరికి అదిరే ఆరంభం ఇవ్వబోతున్న శుక్రుడు, ఆదాయం మెండుగా ఉంటుంది
Venus transit: 2025 సంవత్సరంలో శుక్రుడు తన ఉచ్ఛమైన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీన రాశిలో శుక్రుడు రాక వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడబోతుంది. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం అంతకు మించి ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ఆనందం, సంపద, వైభవం, ఐశ్వర్యం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. శుక్రుడు దాదాపు ఇరవై ఐదు రోజులకు ఒకసారి ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతాడు.
ప్రస్తుతం ధనుస్సు రాశిలో ఉన్న శుక్రుడు ఈ ఏడాది చివర్లో శనికి చెందిన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 28న రాత్రి 11.48 గంటలకు కుంభ రాశి ప్రవేశం చేస్తాడు. అనంతరం కొత్త సంవత్సరం 2025 మొదటి నెల జనవరిలో శుక్రుడు తన ఉన్నతమైన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీన రాశిలో శుక్రుని సంచారం కొన్ని రాశులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్ర సంచార ప్రభావం వల్ల ఈ రాశుల వారు ఆర్థికంగా పురోభివృద్ధిని, వృత్తిలో పురోగతిని పొందుతారు. శుక్ర సంచారము వలన ఏ రాశుల వారికి మేలు కలుగుతుందో తెలుసుకోండి.
శుక్ర సంచారం ఎప్పుడు?
దృక్ పంచాంగ్ ప్రకారం జనవరి 28, 2025 మంగళవారం ఉదయం 07:12 గంటలకు శుక్రుడు మీన రాశిలో సంచరిస్తాడు. ఈ రాశిలో శుక్రుడు ఉన్నతంగా ఉంటాడు. అందువల్ల సంపద రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల దాని విలువ మరింత పెరుగుతుంది.
మీన రాశికి అధిపతి దేవతల గురువుగా భావించే బృహస్పతి. జ్యోతిష్య శాస్త్రంలో మీన రాశిలో శుక్రుడి సంచారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. దేవతల గురువు, రాక్షసుల గురువు ఇద్దరి ప్రభావంతో అన్ని రకాల సౌకర్యాలు అందుతాయి. అన్నింటా విజయవంతం అవుతారు.
మేషం
మీన రాశిలో శుక్రుడి సంచారం మేష రాశి వారికి శుభప్రదం కానుంది. ఈ కాలంలో కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. పాత వనరుల నుండి కూడా డబ్బు వస్తుంది. గౌరవం పెరుగుతుంది. మంచి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. మీరు ప్రభావవంతమైన వ్యక్తులను కలవవచ్చు. డబ్బు ప్రవాహం అధికంగా ఉంటుంది. ఖర్చులు ఎన్ని ఉన్నప్పటికీ డబ్బు మాత్రం తరిగిపోదు. సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి. వృత్తి పరంగా ఎదిగేందుకు అనుకూలమైన సమయం.
వృషభం
శుక్రుని రాశిలో మార్పు వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. ఏదైనా కల నెరవేరవచ్చు. ఆదాయం, ఉద్యోగంలో పదోన్నతులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. వృషభ రాశికి శుక్రుడు అధిపతి కావడం వల్ల వీరికి ఆదాయం క్రమంగా పెరుగుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి.
కుంభం
కుంభ రాశి వారికి శుక్ర సంచారం చాలా శుభప్రదం కానుంది. శుక్ర సంచార ప్రభావం వల్ల మీరు ఆకస్మిక ధనలాభాలను పొందే అవకాశం ఉంది. మీరు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. నిలిచిపోయిన డబ్బును తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పని తీరులో మార్పు వచ్చే అవకాశం ఉంది. కొత్త అతిథుల రాక సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రేమ జీవితం సక్సెస్ అవుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.