Venus transit: శుక్రుడి సంచారం.. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్, సంపన్నులు కాబోతున్నారు
Venus transit: శుక్రుడు త్వరలో తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. మేషరాశిలో శుక్రుడి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టం వెన్నంటే ఉండబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Venus transit: నవగ్రహాలలో శుక్రుడు శుభప్రదమైన వాడు. ప్రేమ, ఆకర్షణ, అందానికి ప్రతీకగా భావిస్తారు. ఏప్రిల్ 24వ తేదీ శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.
మేష రాశిలో శుక్రుడి సంచారం అత్యున్నత స్థానంగా పరిగణిస్తారు. భౌతిక ఆనందాలు, సంపద, భావోద్వేగాలతో కూడా శుక్రుడు సంబంధం కలిగి ఉంటాడు. శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది. కొన్ని రాశులలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచారం లాభాలను ఇస్తుంది. సౌభాగ్యానికి కొదవ ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం వరిస్తుందో చూద్దాం.
మేష రాశి
మేష రాశిలోనే శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ సమయం మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగంలో ముందుకు సాగడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాల్లో రాణిస్తారు. శుక్రుడి సంచారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు తీసుకొస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణ నెలకొంటుంది.
వృషభ రాశి
శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. పనిలో మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాలలో పని చేసేందుకు కూడా అవకాశాలు పొందుతారు. అంకితభావం, నిబద్ధతతో పనిచేయడం వల్ల అదనపు ప్రయోజనాలు పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్ ముందుకు సాగేందుకు ఇది గొప్ప అవకాశంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది. తోబుట్టువులు అండగా నిలుస్తారు.
మిథున రాశి
మిథున రాశి వారికి శుక్రుడి సంచారం ఉద్యోగ జీవితంలో పురోగతిని ఇస్తుంది. మీ ఆదాయం పట్ల చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారవేత్తలు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేస్తున్న వారికి పురోగతికి మంచి అవకాశాలు లభిస్తాయి. బహుళ జాతి కంపెనీల కోసం పనిచేస్తున్న వారికి ఇది అద్భుతమైన సమయం. పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పురోగతి కారణంగా ఇల్లు లేదా కారు మొదలైన వాటిని కొనుగోలు చేయగలుగుతారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మీన రాశి
శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు మీన రాశి వారికి శుభదినాలు ప్రారంభమవుతాయి. కమ్యూనికేషన్ సామర్ధ్యాలతో ఇతరులను మెప్పించగలుగుతారు. ఉద్యోగులు పనులకు సంబంధించి అద్భుతమైన అవకాశాలను పొందుతారు. మాటల మాధుర్యంతో సహోద్యోగులు, ఉన్నతాధికారుల హృదయాలను గెలుచుకుంటారు. వ్యాపారం చేస్తున్న వాళ్ళు అనేక ఒప్పందాలు చేసుకుంటారు. ఇవి ప్రయోజనాలను ఇస్తాయి. ఆర్థిక లాభాలు పొందుతారు.
మకర రాశి
శుక్రుడి సంచారంతో మకర రాశి వారికి జీవితం మెరుగ్గా ఉంటుం.ది ఉద్యోగంలో ముందుకు సాగేందుకు అనేక అవకాశాలు లభిస్తాయి. మీ ఎదుగుదల అభివృద్ధికి ఈ సమయం కీలకంగా మారుతుంది. మకర రాశి పదవ ఇంట్లో శుక్రుడు ప్రవేశించడం వల్ల అనేక రంగాలలో పురోగతి లేదా విజయాన్ని సూచిస్తుంది. కళ, సంగీతం, ఆభరణాలతో వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలను పొందుతారు. కష్టపడి పని చేయడం వల్ల మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. శుక్రుడి ప్రభావంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యంగా మెలుగుతారు. ఆదాయం పెరగడంతో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలు ఊపందుకుంటాయి.