Venus transit: మూడు రాజాయోగాలు తీసుకురాబోతున్న శుక్రుడు.. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం
Venus transit: మరికొద్ది రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. వృషభ రాశిలోకి ప్రవేశించబోయే శుక్రుడు మూడు రాజ యోగాలు ఇవ్వనున్నాడు. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
Venus transit: సంపద, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించే శుక్రుడు త్వరలో రాశి చక్రం మార్చబోతున్నాడు. ఇది మేషం నుంచి మీనం వరకు 12 రాశులపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మే 19 ఆదివారం శుక్రుడు మేషం నుంచి బయలుదేరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
శుక్రుడి రాకతో వృషభ రాశిలో అనేక శుభయోగాలు ఏర్పడతాయి. ఇప్పటికే వృషభ రాశిలో బృహస్పతి, సూర్యుడు సంచరిస్తూ ఉంటారు. ఫలితంగా శుక్రుడి కలయిక వల్ల మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు, బృహస్పతి కలసి గురు ఆదిత్య యోగం ఏర్పరుస్తారు. ఇక శుక్రుడు, గురువు కలిసి గజలక్ష్మీ రాజయోగాన్ని ఇస్తారు. అలాగే శుక్రుడు, సూర్యుడు కలిసి శుక్రాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు. ఒక గ్రహం రాకతో ఏక కాలంలో మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.
శుక్రుడు సంచరించినప్పుడు ఆ రాశుల మీద లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. శుక్ర సంచారం వల్ల ఏర్పడిన ఈ మూడు రాజయోగాలు మేషంతో సహా కొన్ని రాశుల జీవితాల్లో అనేక ముఖ్యమైన మార్పులను తెస్తాయి. కెరీర్ లో ఎదుగుదలకు ఎన్నో సువర్ణావకాశాలు లభిస్తాయి. ప్రతి పనిలో అదృష్టాన్ని పొందుతారు. జీవితంలో సుఖసంతోషాల, సౌభాగ్యాలు కలుగుతాయి. శుక్రుడి సంచారంతో ఏయే రాశులు ప్రకాశిస్తాయో తెలుసుకుందాం.
మేష రాశి
శుక్రుడి సంచారంతో మేష రాశి వారికి శుభం చేయకూరుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆదాయం పెరుగుతుంది. అందరినీ ఆకర్షిస్తారు. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. మంచి ప్యాకేజీ తో కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు.
వృషభ రాశి
శుక్రుడి సంచారం వృషభ రాశిలోనే జరుగుతుంది. దీని వల్ల ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగుతాయి. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. కెరీర్ లో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం అవుతుంది.
కన్యా రాశి
శుక్రుడి శుభ స్థానం వల్ల కన్యా రాశి వారికి ఆకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సంపద పెరుగుదలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి ఈ సమయంలో లాభాలు ఉంటాయి. జీవితంలో సంతోషం, వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతుంది.
ధనుస్సు రాశి
మూడు రాజయోగాలను ఇస్తున్న శుక్రుడి ప్రభావం ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను పుష్కలంగా ఇస్తుంది. జీవితంలో పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి జీవితంలో చేసే పనులు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.