తులా రాశిలోకి శుక్ర గ్రహ సంచారం.. 3 రాశుల వారికి ఆర్థిక ప్రయోజనం
Venus Transit: శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. నవంబర్ 30 న జరిగే ఈ రాశి పరివర్తన అనేక రాశుల జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

సంపదకు కారకుడైన శుక్రుడు నవంబర్‌లో తన సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.శుక్ర సంచారం నవంబర్ 30 న మధ్యాహ్నం 12:05 జరుగుతుంది. శుక్రుడు తన దిగువ రాశి కన్యా రాశిని వదిలిపై రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్ర గ్రహసంచార ప్రభావం మొత్తం 12 రాశుల జాతకులపై కనిపిస్తోంది. శుక్రుడు తులా రాశిలోకి అడుగుపెడుతున్నప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్ర గణాంకాల ప్రకారం శుక్ర గ్రహసంచార ప్రభావం వల్ల మేషరాశితో సహా పలు రాశుల వారికి ఆర్థిక లాభాలు, వృత్తిలో పురోభివృద్ధి, సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆయా రాశుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
మేషరాశి
మేషరాశి జాతకులకు శుక్రుడు జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తాడు. శుక్ర గ్రహసంచార కాలంలో వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ప్రేమ జీవితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగం కనిపిస్తోంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సౌకర్యాలు పెరుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు శుక్రగ్రహ సంచారం మేలు చేస్తుంది. శుక్ర సంచారం ప్రభావంవల్ల ధనలాభం పొందుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. భూమి, భవనం, వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
కన్య రాశి
శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించడం వలన కన్య రాశి జాతకుల అదృష్టం బాగుంటుంది. శుక్రుడి అనుగ్రహంతో మీరు పనిలో విజయం సాధిస్తారు. మీ మాటలతో అందరినీ ఆకర్షిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. శుక్ర గ్రహ సంచారం మీ ప్రేమ జీవితాన్ని మునుపటి కంటే మెరుగు పరుస్తుంది.