జులైలో చంద్రుడి రాశిలోకి శుక్రుడు.. ఈ ఐదు రాశుల వారి ప్రేమ జీవితం అద్భుతం
Venus transit: ప్రేమ, వైవాహిక జీవితానికి కారకుడిగా భావించే శుక్రుడు చంద్రుడి రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల ఐదు రాశుల వారికి ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. అవి ఏ రాశులో చూసేయండి.
Venus transit: జులై నెలలో అనేక పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చుకుంటున్నాయి. సూర్యుడు, బుధుడితో పాటు శుక్రుడు కూడా జులైలో రాశి చక్రం మార్చుకుంటాడు. సంపద, ప్రేమ, ఆనందానికి ప్రతీక అయిన శుక్రుడు జూన్ 12న సాయంత్రం 6:15 గంటలకు మిథున రాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం ఇదే రాశిలో అస్తంగత్వ దశలో ఉన్నాడు. జూన్ 30వ తేదీ ఉదయిస్తాడు. శుక్రుడు జూలై 7, 2024 వరకు మిథున రాశిలో ఉండి తర్వాత తన తదుపరి రాశిలోకి ప్రవేశిస్తాడు.

జులై నెలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశికి అధిపతి చల్లని మనసు కలిగిన చంద్రుడు. శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల చాలా రాశుల వారు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. ఐదు రాశుల వాళ్ళకి స్వర్ణయుగం ప్రారంభమైనట్టే. శుక్ర సంచారము వలన ఏ రాశుల వారికి మేలు కలుగుతుందో తెలుసుకోండి.
మేష రాశి
శుక్రుడి సంచార ప్రభావం వల్ల మేష రాశి వారికి మేలైన ప్రయోజనాలు జరుగుతాయి. ప్రేమకు కారకుడైన శుక్రుడి ప్రభావంతో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ శృంగార సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో ఒత్తిడితో కూడిన సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు పూర్తి లాభాలను పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది.
వృషభ రాశి
శుక్రుడి సంచార ప్రభావం వల్ల వృషభ రాశి జాతకులకు శుభ ఘడియలు ఆరంభమ వుతాయి. వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలలో విజయం మీకోసం ఎదురుచూస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు డబ్బు సంపాదించడంలో విజయవంతమవుతారు. డబ్బును ఆదా చేయగలుగుతారు. ఉద్యోగాలలో పనిచేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి
శుక్రుడు మిథున రాశిని వీడి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. ఫలితంగా ఈ రాశి వారికి శుక్రుడి సంచారం వలన పూర్తి ప్రయోజనం పొందుతారు. మానసిక ఉపశమనం పొందుతారు. మీ కెరీర్‌లో పురోగతి ఉంటుంది. మీ తెలివితేటలు, అవగాహన కారణంగా వృత్తిలో పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అద్భుతమైన సమన్వయంతో ప్రేమ పెరుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు మెరుగైన భౌతిక సౌకర్యాలను పొందుతారు.
సింహ రాశి
సింహ రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తుల వృత్తిలో మార్పు ఉండవచ్చు. వ్యాపారస్థులకు లాభాలు ఉంటాయి. పిల్లలకు సంబంధించి సానుకూల వార్తలు వచ్చే అవకాశం ఉంది. తోబుట్టువులు, స్నేహితుల నుండి మద్దతు పొందుతారు.
కర్కాటక రాశి
చంద్రుడు పాలించే ఈ రాశిలోకే శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. అందువల్ల వీరికి భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలను సాధించడానికి ప్రయత్నాలను పెంచుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. సౌకర్యవంతమైన జీవితం గడిపేందుకు అవకాశం వస్తుంది. అయితే ఈ కాలంలో తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.