బీకేర్‌ఫుల్‌.. మేష రాశిలో శుక్రుడి సంచారం, ఈ మూడు రాశుల వారి ప్రేమ జీవితంలో చిన్నపాటి సమస్యలు ఉండచ్చు!-venus transit in aries and problems in tarus virgo scorpio love life be careful ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  బీకేర్‌ఫుల్‌.. మేష రాశిలో శుక్రుడి సంచారం, ఈ మూడు రాశుల వారి ప్రేమ జీవితంలో చిన్నపాటి సమస్యలు ఉండచ్చు!

బీకేర్‌ఫుల్‌.. మేష రాశిలో శుక్రుడి సంచారం, ఈ మూడు రాశుల వారి ప్రేమ జీవితంలో చిన్నపాటి సమస్యలు ఉండచ్చు!

Peddinti Sravya HT Telugu

శుక్రుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ప్రేమ, ఆకర్షణ, అందం, కళలు, భౌతిక సౌకర్యాలు, వైవాహిక జీవితానికి చిహ్నంగా భావిస్తారు. శుక్రుడి మేష రాశి సంచారంతో ఏ రాశుల ప్రేమ జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏయే రాశుల వారికి ప్రేమలో ఎలాంటి సమస్యలు వస్తాయనేది చూసేయండి.

శుక్రుడి రాశి మార్పుతో ఈ మూడు రాశులకు ప్రేమ జీవితంలో సమస్యలు

ఈరోజు శుక్రుడు మేష రాశి సంచారం మొదలు కానుంది. శుక్రుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ప్రేమ, ఆకర్షణ, అందం, కళలు, భౌతిక సౌకర్యాలు, వైవాహిక జీవితానికి చిహ్నంగా భావిస్తారు. వాటి ప్రభావం బాగుంటే మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీ జీవితం విలాసవంతంగా మారుతుంది.

శుక్రుడు మీన రాశి నుండి బయటకు వచ్చేస్తాడు. మే 31, 2025న ఉదయం 11:17 గంటలకు మేష రాశిలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు పెరుగుతాయి.

శుక్రుడి మేష రాశి సంచారంతో ఏ రాశుల ప్రేమ జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏయే రాశుల వారికి శుక్రుడి రాశి మార్పుతో ప్రేమలో ఎలాంటి సమస్యలు వస్తాయనేది చూసేయండి.

శుక్రుడి రాశి మార్పుతో ఈ మూడు రాశుల ప్రేమ జీవితంలో సమస్యలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారి ప్రేమ జీవితంలో శుక్రుడు సమస్యలను కలిగిస్తుంది, అదే సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో వాదించవద్దు. ఎలాంటి వాదనలకైనా దూరంగా ఉండాలి. మీ జీవితంలోని సమస్యలను సరిదిద్దడానికి మీ భాగస్వామిని ఆశ్చర్యపరచడానికి ప్రయత్నించండి.

2.కన్యా రాశి

కన్యా రాశి వారి ఎనిమిదో ఇంట్లో శుక్రుడి సంచారం జరుగుతుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితంలో ఇబ్బంది రావచ్చు. ఒకవేళ పెళ్లి జరగకపోతే ప్రస్తుతానికి కాస్త వెయిట్ చేయడం మంచిది. ఈ రాశి వారు రిలేషన్ షిప్స్ విషయంలో కాస్త ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కుటుంబ జీవితాన్ని దెబ్బతీస్తుంది.

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శుక్రుడి సంచారం కారణంగా ఆరోగ్యం లేదా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రభావం చూపుతారు. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీ భాగస్వామితో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వండి. వారికి పర్సనల్ స్పేస్ ఇవ్వండి. వీలైనంత ఎక్కువ సమయం కలిసి గడపడానికి ప్రయత్నించండి. వారు చెప్పేది బాగా వినండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.