Daridra yogam: దరిద్ర యోగం ఇవ్వబోతున్న శుక్రుడు.. ఈ మూడు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి-venus transit creates daridra yoga in august month three zodiac signs must careful ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Daridra Yogam: దరిద్ర యోగం ఇవ్వబోతున్న శుక్రుడు.. ఈ మూడు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి

Daridra yogam: దరిద్ర యోగం ఇవ్వబోతున్న శుక్రుడు.. ఈ మూడు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి

Gunti Soundarya HT Telugu
Aug 02, 2024 03:03 PM IST

Daridra yogam: శుక్రుడు ఆగస్ట్ నెలలో తన రాశిని మార్చుకోబోతున్నాడు. దీని వల్ల దరిద్ర యోగం ఏర్పడబోతుంది. ఫలితంగా మూడు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

దరిద్ర యోగం ఇవ్వబోతున్న శుక్రుడు
దరిద్ర యోగం ఇవ్వబోతున్న శుక్రుడు

Daridra yogam: జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంయోగం వల్ల కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ గ్రహాల కలయిక వల్ల అనేక రకాల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఆగస్టు నెలలో అటువంటి అశుభకరమైన యోగం ఒకటి ఏర్పడబోతోంది. అదే దరిద్రయోగం. గ్రహాల స్థానం వల్ల కలిగే చెడు యోగం ఫలితంగా కొందరికి సమస్యలు ఎదురవుతాయి. ఈ దరిద్ర యోగం ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసుకుందాం.

సూర్యుడు, శుక్రుడు వంటి అనేక ప్రధాన గ్రహాలు ప్రతి నెల తమ రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రేమ, విలాసం, భౌతిక సుఖాలు అందించే శుక్రుడు ఆగస్ట్ 25వ తేదీన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది శుక్రుడికి బలహీనమైన రాశి. శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు దురదృష్టకరమైన దరిద్రయోగం ఏర్పడుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దరిద్ర యోగం వల్ల ఆర్థిక సమస్యలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అది వ్యక్తి జాతకంలో శుక్రుడి స్థానాన్ని ఆధారంగా ప్రభావం చూపిస్తుంది. ఒక శుభ గ్రహం అశుభ గ్రహానికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ దరిద్ర యోగం ఏర్పడుతుంది. అది మాత్రమే కాకుండా బృహస్పతి ఆరు, పన్నెండవ ఇంట్లో ఉంటే జాతకంలో దరిద్రయోగం ఏర్పడుతుంది. ఈ దరిద్రయోగం ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్నెండు రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ముఖ్యంగా మూడు రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్ని రోజులపాటు ఈ మూడు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మేషరాశి

మేష రాశి వారికి ఆగస్ట్ నెల సవాలుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మేష రాశి డబ్బు ఇంట్లో సంచరిస్తాడు. అలాగే బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంటాడు. అందువల్ల జీవితంలోని అన్ని అంశాలలో జాగ్రత్త వహించాలి. అలాగే అంగారకుడు మూడో ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగం చేసే ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

కర్కాటక రాశి

దరిద్ర యోగం ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. శని డబ్బు ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. కుటుంబంలోనూ సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలోను నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయడమే మంచిది.

మకర రాశి

ఆగస్ట్ నెల మకర రాశి వారికి కాస్త కఠినంగా ఉండొచ్చు. ఈ నెలలో బుధుడు తిరోగమనంతోపాటు శుక్రుడు దరిద్రయోగం వల్ల నీచ స్థితిలో ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులు పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చేసే పనికి మరొకరు క్రెడిట్ పొందే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం చేసే చోట ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు. వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

శుక్రుడిని బలపరిచే నివారణలు

శుక్రవారం లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించాలి. అలాగే మీకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలి. గులాబీ రంగు దుస్తులు ధరించడం మంచిది. ప్రతిరోజు ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 108సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల శుక్రుడి స్థానం బలపడుతుంది. దుష్ప్రభావాలు తగ్గుముఖం పడతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner