శుక్రుడి రాశి మార్పుతో ఈ మూడు రాశులకు గోల్డెన్ టైం మొదలు.. ధనం, ఉద్యోగాలు, ఫ్లాట్లు ఇలా ఎన్నో!-venus tranist in vrishabha rasi and golden time begin for aries cancer and scorpio ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శుక్రుడి రాశి మార్పుతో ఈ మూడు రాశులకు గోల్డెన్ టైం మొదలు.. ధనం, ఉద్యోగాలు, ఫ్లాట్లు ఇలా ఎన్నో!

శుక్రుడి రాశి మార్పుతో ఈ మూడు రాశులకు గోల్డెన్ టైం మొదలు.. ధనం, ఉద్యోగాలు, ఫ్లాట్లు ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

జూన్ 29న, ఆదివారం, శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు ప్రేమ, ఆనందం, విలాసాలకు కారకుడు. శుక్రుడు రాశి మార్పు 12 రాశులపై ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం శుభంగా మారింది. మరి వారిలో మీరూ ఒకరేమో చూసుకోండి.

శుక్రుడి రాశి మార్పుతో ఈ మూడు రాశులకు గోల్డెన్ టైం మొదలు

గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాయి. ఆ గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు కొన్నిసార్లు శుభయోగాలు, కొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి. 9 గ్రహాలు కూడా కాలానికి అనుగుణంగా ఒక రాశి నుండి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి.

జూన్ 29న, ఆదివారం, శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు ప్రేమ, ఆనందం, విలాసాలకు కారకుడు. శుక్రుడు రాశి మార్పు 12 రాశులపై ప్రభావం చూపించినప్పటికీ, మూడు రాశుల వారికి మాత్రం శుభంగా మారింది. మరి ఆ రాశులు వారు ఎవరు? వారు ఎలాంటి లాభాలను పొందారు? వంటి విషయాలను తెలుసుకుందాం.

శుక్రుడు రాశి మార్పుతో ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు:

1.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి శుక్రుడి రాశి మార్పుతో గోల్డెన్ టైమ్ మొదలైంది. ఈ సమయంలో ఈ రాశి వారి సమస్యలన్నీ తొలగిపోతాయి. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వారికి జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు, కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి శుక్రుడి రాశి మార్పు శుభప్రదం. ఈ సమయంలో ఈ రాశి వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఎంతో మునుపటి కంటే నీ లైఫ్ బాగుంటుంది. ఇంట్లో ముఖ్యమైన పనులను చేపడతారు.

3.మేష రాశి:

మేష రాశి వారు శుక్రుడి రాశి మార్పుతో సక్సెస్‌ను అందుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త ప్లాట్ లేదా ఫ్లాట్ కొనే అవకాశం ఉంది. జాబ్ ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.