Venus rise effect: ఉదయించబోతున్న శుక్రుడు.. జూన్ 30 నుంచి ఈ రాశుల వాళ్ళకు మంచి రోజులు-venus rise in mithuna rashi three zodiac signs get benefits from june 30th 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Rise Effect: ఉదయించబోతున్న శుక్రుడు.. జూన్ 30 నుంచి ఈ రాశుల వాళ్ళకు మంచి రోజులు

Venus rise effect: ఉదయించబోతున్న శుక్రుడు.. జూన్ 30 నుంచి ఈ రాశుల వాళ్ళకు మంచి రోజులు

Gunti Soundarya HT Telugu
Jun 19, 2024 08:00 AM IST

Venus rise effect: మరికొద్ది రోజుల్లో శుక్రుడు అస్తంగత్వ దశ నుంచి ఉదయించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పెరగబోతుంది. అవి ఏ రాశులో చూసేయండి.

ఉదయించబోతున్న శుక్రుడు
ఉదయించబోతున్న శుక్రుడు (Pixabay)

Venus rise effect: ప్రేమ, ఆనందం, సంపదను ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం బుధుడికి చెందిన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో శుక్రుడు ఉదయించబోతున్నాడు. ఏప్రిల్ 25వ తేదీన శుక్రుడు అస్తంగత్వ దశలోకి వెళ్ళాడు. జూన్ 30 నుండి శుక్రుడు ఉదయిస్తాడు. జులై 7వరకు శుక్రుడు మిథున రాశిని వీడి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.

మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి లాభాలు, కొన్ని రాశుల వారికి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శుక్రుడు శుభంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. శుక్రుడు రాహు, కేతు, లేదా కుజుడు వంటి దుష్ట గ్రహాలతో కలిసి ఉంటే సవాళ్ళు, అడ్డంకులు తలెత్తుతాయి. అంగారకుడితో ఉంటే చిరాకు, దూకుడు ప్రవర్తన ఉంటుంది.

శుక్రుడు బలంగా ఉన్నప్పుడు వ్యక్తులకు సంతృప్తి, మంచి ఆరోగ్యం, తెలివితేటలు పెరుగుతాయి. వివిధ శారీరక సౌఖ్యాలను అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తారు. సంపాదనలో విజయం సాధిస్తారు. జీవనశైలిని మెరుగుపరుస్తారు. సుమారు 66 రోజుల తర్వాత శుక్రుడు అస్తంగత్వ దశ నుంచి బయటకు రాబోతున్నాడు. అటువంటి పరిస్థితిలో శుక్రుడు పెరగడం వల్ల కొన్ని రాశుల వారి జేబులు డబ్బుతో నిండిపోతాయి.

వృషభ రాశి

మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ప్రారంభం అవుతాయి. ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉన్నాయి. సంతోషం ఆనందంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. శుక్రుడి శుభ ప్రభావం వల్ల కెరీర్‌లో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయాలను ఇస్తాయి.

కన్యా రాశి

శుక్రుడు ఉదయించినప్పుడు కన్యా రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశి వారి ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. స్నేహితుని సహాయంతో జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ధనం రాకకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మికత మీదకు మనసు వెళ్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో ఎక్కువ సమయం గడుపుతారు.

తులా రాశి

మిథున రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల తులా రాశి వారికి లాభం చేకూరుతుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా సమసిపోతాయి. మీ బాస్, సహోద్యోగుల మద్దతుతో మీరు మీ కెరీర్‌లో అన్ని పనులను చాలా చక్కగా పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శుక్రుడి ప్రభావంతో ప్రేమ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. వ్యాపారంలో భారీగా లాభాలు నమోదు చేసుకుంటారు.

జాతకంలో శుక్రుడిని బలపరిచే పరిహారాలు

శుక్రుడు ఇష్టపడే తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. అలాగే ఆరు ముఖ రుద్రాక్ష ధరిస్తే శుక్రుడి అనుగ్రహం పొందుతారు. దీనితో పాటు శుక్రవారం ఉపవాసం పాటించాలి. పెరుగు, బియ్యం, బార్లీ, పెర్ఫ్యూమ్, వెండి వంటివి దానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు.

WhatsApp channel