Venus rise effect: రాబోయే 9 నెలలు ఈ రాశుల వారికి లక్ష్మీదేవి దయతో సంపద పెరుగుతుంది-venus rise in mithuna rashi this zodiac signs will get lakshmi devi blessings improve their financial positions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Rise Effect: రాబోయే 9 నెలలు ఈ రాశుల వారికి లక్ష్మీదేవి దయతో సంపద పెరుగుతుంది

Venus rise effect: రాబోయే 9 నెలలు ఈ రాశుల వారికి లక్ష్మీదేవి దయతో సంపద పెరుగుతుంది

Gunti Soundarya HT Telugu
Jul 05, 2024 04:25 PM IST

Venus rise effect: దృక్ పంచాంగ్ ప్రకారం సంపదను ఇచ్చే శుక్రుడు జూన్ 29, 2024 న మిథున రాశిలో ఉదయించాడు. 2025 సంవత్సరం వరకు ఉన్నత స్థితిలో ఉంటాడు. దీని వల్ల కొన్ని రాశుల వారు చాలా లాభపడతారు.

లక్ష్మీదేవి అనుగ్రహం
లక్ష్మీదేవి అనుగ్రహం

Venus rise effect: హిందూ మతంలో శుభ కార్యాలను నిర్వహించడానికి శుక్రుడు, బృహస్పతి ఉదయించిన స్థితిలో ఉండటం చాలా ముఖ్యమైనది. గురు-శుక్రుడు ఉదయించిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే, వివాహం, గృహ ప్రవేశం, ముండ మొదలైన అన్ని శుభకార్యాలకు శుభ సమయం ఏర్పడుతుంది. 

yearly horoscope entry point

ఏప్రిల్ 29న శుక్రుడు అస్తమించగా, మే 6న బృహస్పతి అస్తమించింది. ఈ కారణంగా మే-జూన్ నెలల్లో వివాహానికి శుభ ముహూర్తాలు లేవు. దృక్ పంచాంగ్ ప్రకారం శుక్రుడు జూన్ 29 రాత్రి 7:52 గంటలకు మిథున రాశిలో ఉదయించాడు. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు సంపద, ఐశ్వర్యం, విలాసవంతమైన జీవితం, అందం, వైవాహిక జీవితం, మంచి ఆరోగ్యానికి కారకంగా పరిగణిస్తారు. 

జాతకంలో శుక్రుని స్థానం బలంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో సుఖాలు, సౌకర్యాలకు లోటు ఉండదు.  ధనలాభం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం శుక్రుడు ఉదయించే స్థితిలోనే సంచరిస్తాడు. దీని వల్ల రానున్న తొమ్మిది నెలలు కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. సంపద వెల్లివిరుస్తుంది. శుక్రుడు ఉదయించడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 

మేష రాశి

శుక్రుడు ఉదయించడం వల్ల మేషరాశి వారి జీవితాల్లో సంతోషం కలుగుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. బంధుత్వాలలో ఉన్న చేదు తొలగిపోతుంది. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. కెరీర్‌లో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి.

మిథున రాశి 

రాబోవు 9 నెలలు మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. కెరీర్‌లో చాలా పెద్ద మార్పులు వస్తాయి. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి.

కన్యా రాశి 

శుక్రుడు ఉదయించడం వల్ల కన్యా రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కెరీర్‌లో పురోగతికి బంగారు అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు విద్యా పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు లభిస్తాయి. సంబంధాలు మెరుగుపడతాయి. అన్నదమ్ములతో సత్సంబంధాలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు ఇది చాలా అనుకూలమైన సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయాలు సాధిస్తారు.

మకర రాశి 

శుక్రుడు ఉదయించడం వల్ల మకర రాశి వారి జీవితాల్లో సంతోషం మాత్రమే ఉంటుంది. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భూమి, ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు భూమి, వాహన ఆనందాన్ని పొందుతారు. భౌతిక సుఖాలలో జీవితాన్ని గడుపుతారు. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. బాంధవ్యాలలో మాధుర్యం పెరుగుతుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner