Venus transit: సూర్యుడికి అతి దగ్గరగా ఉండే రెండో గ్రహం శుక్రుడు. అందుకే నవగ్రహాలలోకెల్లా అత్యంత ప్రకాశవంతమైన గ్రహంగా పరిగణిస్తారు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, కీర్తి, ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడు శుక్రుడు.
శుక్రుడి రాశి మార్పు పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికతో పాటు, అస్తంగత్వం, ఉదయించడం కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతోందని నమ్ముతారు. వివాహం వంటి శుభ కార్యాలకు శుక్రుడి శుభ స్థానం తప్పనిసరిగా చూస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్రుడు ఏప్రిల్ 25న అస్తమించాడు. మే 19వ తేదీన అస్తంగత్వ దశలోనే వృషభ రాశిలోకి ప్రవేశించాడు. సుమారు 66 రోజుల తర్వాత జూన్ 29 శనివారం శుక్రుడు ఉదయించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారు శుభఫలితాలు పొందుతారు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి .వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విలాసవంతమైన జీవనశైలిని పొందుతారు. శుక్రుడి రాకతో ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అటువంటి శుక్ర గ్రహం ఇదే రాశిలో ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి .వృత్తిలో కొత్త విజయాల సాధిస్తారు .వైవాహిక జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. ప్రభుత్వ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. కోర్టు కేసుల నుంచి విముక్తి కలుగుతుంది. వృత్తి జీవితంలో పై అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
శుక్రుడి ప్రభావం ప్రేమ సంబంధాల మీద ఎక్కువగా చూపిస్తుంది. అందువల్ల ఈ రాశి వారి ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సంపద పెరుగుతుంది. నూతన ఆదాయం మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది. ఈ సమయంలో మీ కలలన్నీ నిజం అవుతాయి. ఇది మీకు లక్కీ మంత్ అవుతుంది. మీ జ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు సరైన అవకాశం లభిస్తుంది.
శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించిన వాడిగా చెబుతారు. అందువల్ల కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో డబ్బుకు లోటు ఉండదు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనుకోని ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధించి న్యాయపరమైన చిక్కుల నుంచి బయట పడతారు.
శుక్రుడు ఉదయించడం వల్ల వృశ్చిక రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. ధన పరిమితుల నుంచి బయటపడతారు. అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు మీకు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. కెరీర్ లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు.