Venus transit: శుక్రుడి నక్షత్ర మార్పు.. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆదాయం రెట్టింపు-venus nakshtram transit on june 7th these zodiac signs get lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: శుక్రుడి నక్షత్ర మార్పు.. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆదాయం రెట్టింపు

Venus transit: శుక్రుడి నక్షత్ర మార్పు.. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆదాయం రెట్టింపు

Gunti Soundarya HT Telugu
Jun 03, 2024 11:42 AM IST

Venus transit: సంపదను ప్రసాదించే శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడి కదలికకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది.

శుక్రుడి నక్షత్ర మార్పు
శుక్రుడి నక్షత్ర మార్పు

Venus transit: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహం సంపద, కీర్తి, విలాసవంతమైన జీవితం, సంతోషకరమైన వైవాహిక జీవితానికి కారకంగా పరిగణిస్తారు. శుక్రుడి శుభ ప్రభావం కారణంగా ఒక వ్యక్తి జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది .ఎప్పుడూ డబ్బు కొరత ఎదురుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడి కదలికకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 7న సంపదన ప్రసాదించే శుక్రుడు రోహిణి నక్షత్రం వదిలి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూన్ 18 వరకు ఈ నక్షత్రంలోనే సంచరిస్తాడు. ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి శుక్రుడు నక్షత్రం మార్చగానే అదృష్టం పొందుతారు. సంపద, సంతోషం, అదృష్టం పెరిగే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు ఎంతో మేలు చేస్తాయి.

మృగశిర నక్షత్ర స్వభావం

మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడుగా వ్యవహరిస్తాడు. అధి దేవుడు కుమారస్వామి. ఈ నక్షత్రంలో జన్మించినవారు అదృష్ట జాతకులుగా చెబుతారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. వంశపారపర్యంగా ఆస్తులు పొందుతారు. విలాసాలతో అందమైన జీవితం గడుపుతారు. అయితే కొన్ని సార్లు చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళని కూడా చెడుగా చూసే స్వభావం వీరికి ఉంటుంది. నీతి నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలని తాపత్రయపడతారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. వీరి ఆలోచనలు నిష్పక్షపాతంగా ఉంటాయి .ప్రతి చిన్న విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు. అటువంటి మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు వెళ్ళడం వల్ల ఎవరికి అదృష్టం కలుగుతుందో చూద్దాం.

వృషభ రాశి

శుక్రుడి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి.

మిథున రాశి

శుక్రుడు మృగశిర నక్షత్రంలోకి వెళ్ళగానే మిథున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయానికి అనేక మార్గాలు తారసపడతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే ఉత్తమ సమయం .ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపద పెరుగుతుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి శుక్రుడి నక్షత్రం మార్పు కాలం అద్భుతం. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ధన లాభం పొందుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది

కుంభ రాశి

శుక్రుడి నక్షత్ర మార్పు వల్ల కుంభ రాశి వారు చాలా ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో వృద్ధికి అందరూ సహాయపడతారు. కెరీర్ లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు. జీవితాన్ని సౌకర్యాలతో గడుపుతారు. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవాళ్లు జీవిత భాగస్వామి కోసం చేసే అన్వేషణ పూర్తవుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది.

WhatsApp channel