Gajalakshmi yogam: గజలక్ష్మీ యోగం.. వీరి సమస్యలకు ఫుల్ స్టాప్ పడబోతుంది, ఆదాయం రెట్టింపు అవుతుంది
Gajalakshmi yogam: మేష రాశిలో గజలక్ష్మీ యోగం ఏర్పడనుంది. ఫలితంగా కొన్ని రాశుల వారిని వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆ లక్కీ రాశులు ఏవో చూద్దాం.
Gajalakshmi yogam: వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, కీర్తి, సౌభాగ్యం, ప్రేమ, విలాసవంతమైన జీవితం, సంతోషాన్ని ప్రసాదించే గ్రహంగా భావిస్తారు. శుభాలని ఇచ్చే శుక్రుడు ఏప్రిల్ 25వ తేదీ తన రాశిని మార్చుకోబోతున్నాడు.
ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఏప్రిల్ 25 గురువారం మధ్యాహ్నం మేష రాశిలో సంచరించబోతున్నాడు. ఇప్పటికే అక్కడ దేవ గురువు బృహస్పతి సంచరిస్తున్నాడు. జ్ఞానం, గౌరవం, మంచి ఆరోగ్యం, సంపదకు బృహస్పతి కారకుడిగా పరిగణిస్తారు.
మేష రాశిలో శుక్రుడు, బృహస్పతి కలయిక చాలా శుభదాయకంగా ఉండనుంది. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా గజలక్ష్మి రాజయోగం ఏర్పడటం చాలా శుభమని పండితులు చెబుతున్నారు. ఈ యోగం వల్ల సంపదలను పొందే బలమైన అవకాశాలు కలుగుతాయి. ఆదాయం పెరిగి సుఖసంతోషాలతో గడుపుతారు. దేవ గురువు బృహస్పతి మే 1 వరకు మేష రాశిలోనే ఉంటాడు. దీంతో ఆరు రోజులపాటు గజలక్ష్మి రాజయోగం ఉండనుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ లక్కీ రాశులేవో తెలుసుకుందాం.
మేష రాశి
వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి. మీ రంగంలో విజయాలు సాధిస్తారు. ఒక పెద్ద అవకాశం మీ జీవితాన్నే మార్చబోతుంది.
మిథున రాశి
గురు, శుక్రుల కలయిక వల్ల మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మీరు చేసే పనులలో సానుకూల ఫలితాలు పొందుతారు. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.
సింహ రాశి
గజలక్ష్మీ యోగంతో సింహ రాశి జాతకంలో ఆర్థిక లాభాలు అంచనాలను మించి ఉంటాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఈ కాలంలో మీకు లాభాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది.
తులా రాశి
గజలక్ష్మి యోగం తులా రాశి వారికి ఆదాయం వృద్ధికి కొత్త మార్గాలు తీసుకురానున్నాయి. కెరీర్ లో గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మిమ్మల్ని ఆనందపరిచే వార్తలు వింటారు.
కన్యా రాశి
రెండు గ్రహాల సంచారంతో కన్యా రాశి జాతకులు వైవాహిక జీవితంలో ప్రేమ, సానుకూలత పుష్కలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలగిపోవడంతో సంతోషంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే మీరు అపారమైన విజయాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తిలో పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
మకర రాశి
గజలక్ష్మి యోగ ప్రభావంతో మకర రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లేదా ప్రశంసలు దక్కుతాయి. జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. ప్రగతి పథంలో ఆటంకాలు దొరుకుతాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగుమం అవుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం.