సెప్టెంబర్ 4 న శుక్రుడు కర్కాటక రాశిలోకి మారనున్నాడు. శుక్రుడు, సౌభాగ్యము, అందము, ప్రేమ, వైభవానికి కారకుడు. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ కదలికలను మారుస్తూ ఉంటాయి. ఈ ప్రభావం 12 రాశుల జాతకులపై ప్రభావం పడుతుంది. గ్రహాల యొక్క ఈ మార్పు వల్ల శుభ, అశుభ ప్రభావాలు రెండూ కనిపిస్తాయి. అదే సమయంలో సెప్టెంబర్ 4 న శుక్రుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. శుక్రుడు సౌభాగ్యము, అందము, ప్రేమ, వైభవానికి కారకుడు. శుక్రుడు కర్కాటకంలో సంచరించడం వలన పలు రాశుల జాతకులకు ప్రయోజనాలు లభిస్తాయి.
మేషరాశి జాతకులు శుక్ర సంచారం వల్ల ప్రయోజనం పొందబోతున్నారు. ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయంగా భావించవచ్చు. కుటుంబ సభ్యులతో మీ సంబంధం గాఢంగా ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది.
మిథున రాశి వారికి శుక్ర గ్రహసంచారము ఎంతో ప్రయోజనకరం. ఈ గ్రహ సంచారం కారణంగా మిథున రాశి జాతకులు ఆర్థికంగా మెరుగైన స్థితి పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇదే నా పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈసారి బాగా ఉండబోతుంది.
కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు పనిచేసే చోట విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అదే సమయంలో డబ్బులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.