Venus transit: శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, లక్ష్మీదేవి అనుగ్రహం
Venus transit: శుక్రుడు మార్చి నెలలో మరోసారి రాశి చక్రం మారబోతున్నాడు.31వ తేదీన శుక్రుడు కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం తెచ్చిపెడుతుంది.

venus transit: నవగ్రహాలలో ఒకటైన శుక్రుడు మార్చి నెలలో రెండోసారి రాశి చక్రం మార్చబోతున్నాడు. మార్చి 31న శుక్రుడు కుంభ రాశి నుంచి మీన రాశి ప్రవేశం చేయనున్నాడు. వైవాహిక ఆనందం, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, శారీరక ఆనందం, విలాసాలు, ఫ్యాషన్ వంటి వాటికి శుక్రుడు కారకుడుగా ఉంటాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే మీ ప్రేమ జీవితం, వైవాహక జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే సంపద పెరుగుతుంది. మీన రాశిలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఎదుటివారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. జీవిత భాగస్వామిని సంతోష పెడతారు. వైవాహిక జీవితంలో సంబంధాలు మధురంగా ఉంటాయి. అందుకే వివాహం చేసే సమయంలో శుక్రుడి స్థానం శుభకరంగా ఉండాలని చెప్తారు. మీనరాశిలో శుక్రుడి సంచారం ఏయే రాశుల వారికి లాభాలను ఇస్తుందంటే..
వృషభ రాశి
శుక్రుడి సంచారం వృషభ రాశి పదకొండో ఇంట్లో జరుగుతుంది. ఫలితంగా ఆదాయంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. జీవిత లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. నగదు కొరత కారణంగా ఆగిపోయిన పనులు ఈ సమయంలో తిరిగి పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వాహనం కొనుగోలు చేస్తారు.
మిథున రాశి
శుక్రుడు మిథున రాశి పదవ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. సృజనాత్మక రంగాలలో పనిచేస్తున్న వారికి ఈ కాలం చాలా బాగుంటుంది. ఫర్నిచర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో ఉన్నవారికి ఆశాజకనకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త లాభాలకు అవకాశాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ప్రవేశిస్తాడు. మీ ప్రియమైన వారితో సుదూర ప్రాంతాలకు పిక్నిక్ వెళ్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇవి మీకు వ్యాపారంలో వృద్ధికి సహాయపడతాయి. శుక్రుడి సంచారం వల్ల మీ సమస్యలు తగ్గుతాయి. అదృష్టం తలుపు తడుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. చాలా కాలంగా ఆలస్యంగా కొనసాగుతున్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి.
కన్యా రాశి
శుక్రుడి సంచారం కన్యా రాశి ఏడో ఇంట్లో జరుగుతుంది. ఈ సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో శృంగారభరితమైన జీవితం గడుపుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, లావాదేవీలు చేస్తారు. వ్యాపార భాగస్వామ్యం విజయవంతంగా ఉంటుంది. పని చేసే చోట పురోగతి ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి ఐదో ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులు రొమాంటిక్ గా గడుపుతారు. జీవిత భాగస్వామి సంతోషం కోసం ఏ పనైనా చేస్తారు. ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి కొత్త ప్రవేశిస్తుంది. ఈ సమయంలో కెరీర్ లో మార్పుకు అవకాశాలు ఉండొచ్చు. వివాహం జరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఒక వరంగా ఉంటుంది. కార్యాలయంలో, వ్యాపారంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఆకర్షణీయమైన లాభాలు చేతికందుతాయి. మీ పనులకు ప్రశంసలు లభిస్తాయి. బిజినెస్ ప్లాన్ చేసుకుంటారు.