Venus Direct transit: శుక్ర గ్రహ సంచారం: ఏప్రిల్ 13న ప్రత్యక్ష మార్గంలోకి శుక్రుడు.. వీరికి ధనవృద్ధి!
Venus Direct Transit: శుక్రుడు మీన రాశిలో వక్ర మార్గం నుండి ఏప్రిల్‌లో ప్రత్యక్ష మార్గంలో పయనిస్తాడు. ఈ పరిణామం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడి ప్రత్యక్ష మార్గం ఏయే రాశులకు మంచి రోజులు తెస్తుందో ఇక్కడ చూడండి.
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సుఖ-సౌఖ్యం, ఐశ్వర్యం, సంపదలకు కారకుడిగా భావిస్తారు. శుక్రుని గమనం లేదా స్థితిలో మార్పు, రాశి మార్పు మేషం నుండి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది.
శుక్రుడు ప్రస్తుతం వక్రమార్గంలో ఉన్నాడు. అంటే వెనుకకు కదులుతున్నాడు. త్వరలోనే సూటిగా కదలడం ప్రారంభిస్తాడు. శుక్రుడు మీన రాశిలో 02 మార్చి 2025న తిరోగమనంలోకి వెళ్లాడు. తిరిగి ఏప్రిల్ 13, 2025న ప్రత్యక్ష మార్గంలోకి వస్తాడు. జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ పరిణామం కొన్ని రాశులపై శుభ, అశుభ ప్రభావం చూపుతుంది.. జ్యోతిష్య గణనల ప్రకారం, శుక్రుని సూటి గమనం 3 రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది.
1. మిధున రాశి
మిధున రాశి వారికి శుక్రుని సూటి గమనం లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడు మీ రాశిలోని కెరీర్, వ్యాపార భావంలో ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు. మీకు ఆదాయంలో పెరుగుదల లభించవచ్చు. ప్రేమ జీవితంలో మెరుగైన మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరిస్థితి బలపడుతుంది.
2. కన్య రాశి
కన్య రాశి వారికి శుక్రుని సూటి గమనం శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడు మీ రాశిలోని 7వ భావంలో నేరుగా సంచరిస్తాడు. దీని వల్ల మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఉన్నతాధికారుల ఆశీర్వాదం లభిస్తుంది. వ్యాపారపరంగా విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు.
3. కుంభ రాశి
కుంభ రాశి వారికి శుక్రుని సూటి గమనం అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు మీ రాశిలోని ధన, వాక్ భావంలో నేరుగా సంచరిస్తాడు. దీని వల్ల మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పని ప్రదేశంలో మీ నైపుణ్యాలను చూపించుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పుల సంకేతాలు ఉన్నాయి.
(ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనదని మేం హామీ ఇవ్వడం లేదు. వీటిని అనుసరించే ముందు సంబంధిత రంగ నిపుణుల సలహా తీసుకోండి.)
సంబంధిత కథనం