Venus nakshtra transit: శుక్రుడి నక్షత్ర మార్పు.. వీరికి లక్ష్మీ కటాక్షం, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది
Venus nakshtra transit: శుక్రుడు మరికొన్ని గంటల్లో నక్షత్రం మార్చుకోబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి లక్ష్మీకటాక్షం లభిస్తుంది. డబ్బుతో జేబులు నిండిపోతాయి. ధన కొరత తీరిపోతుంది.
Venus nakshtra transit: ప్రతి గ్రహం రాశిని మార్చుకోవడంతో పాటు నిర్ధిష్టమైన సమయం తర్వాత నక్షత్రాన్ని మార్చుకుంటుంది. సంతోషం, శ్రేయస్సు, ప్రేమ, అందం, సంతోషకరమైన వైవాహిక జీవితం, గౌరవానికి కారణమైన శుక్రుడు మరికొన్ని గంటల్లో తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు.

దృక్ పంచాంగ్ ప్రకారం శుక్రుడు జూన్ 12 న మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు సంపదను ఇచ్చే శుక్రుడు జూన్ 18, 2024 మంగళవారం తెల్లవారుజామున 04:14 గంటలకు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూన్ 29 వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వస్తు సంపదలో పెరుగుదల ఉంటుంది. ధనం, ధాన్యాల నిల్వలు నిండి ధన కొరత ఉండదు. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది.
ఆరుద్ర నక్షత్ర స్వభావం
27 నక్షత్రాలలో ఆరుద్ర ఆరవ నక్షత్రం. దీని కింద జన్మించిన వాళ్ళు పైకి మాత్రం చాలా కఠినంగా ఉంటారు. కానీ లోపల మాత్రం చాలా దయగల స్వభావం ఉంటుంది. జీవితాన్ని చాలా ఉల్లాసంగా గడుపుతారు. ఒక్కసారి వీరితో స్నేహం కుదురితే ఎప్పటికీ వీరిని విడిచిపెట్టలేరు. సానుకూలత, ప్రతికూలత రెండు సమానంగా ఉంటాయి. శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఏ రాశుల వారికి ఉంటుందో తెలుసుకుందాం?
మేష రాశి
మేష రాశి వారు శుక్రుని నక్షత్ర మార్పు వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. ఈ కాలంలో చేసే పెట్టుబడులు కూడా భారీ ఆర్థిక లాభాలను అందిస్తాయి. అవివాహితులకు వివాహాలు నిశ్చయం అవుతాయి. వైవాహిక జీవతానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. సుఖాలు, విలాసవంతమైన జీవితం గడుపుతారు.
సింహ రాశి
శుక్రుడి సంచారం వల్ల సింహ రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కెరీర్‌లో గొప్ప విజయాలు సాధిస్తారు. కొందరి ఉద్యోగాన్వేషణ పూర్తవుతుంది. మీరు మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
తులా రాశి
తులా రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు భాగస్వామ్య వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఆరుద్ర నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. బంధుత్వాలలో ఉన్న చేదు తొలగిపోతుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.