కశ్యపమహర్షిచే ప్రతిష్టించబడ్డ ఆలయం వేదగిరి- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.-vedagiri is the temple started by kashyapa maharshi check full details about it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కశ్యపమహర్షిచే ప్రతిష్టించబడ్డ ఆలయం వేదగిరి- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.

కశ్యపమహర్షిచే ప్రతిష్టించబడ్డ ఆలయం వేదగిరి- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.

HT Telugu Desk HT Telugu
Jan 25, 2025 04:30 PM IST

వేదగిరి స్థలపురాణం ప్రకారం సప్తఋషుల ఆధ్వర్యంలో కశ్యపుడు యాగాన్ని నిర్వహించాడు. ఆ సమయంలో త్రేతాగ్నులను రత్నగిరిగా విలసిల్లుతున్న జొన్నవాడలో, తల్పగిరిగా విలసిల్లుతున్న రంగనాయకుల పేటలో మరియు వేదగిరిలో ప్రతిష్ఠించాడు.

కశ్యపమహర్షిచే ప్రతిష్టించబడ్డ ఆలయం వేదగిరి
కశ్యపమహర్షిచే ప్రతిష్టించబడ్డ ఆలయం వేదగిరి (pinterest)

కశ్యపమహర్షిచే పెన్నానదీ తీరంలో ప్రతిష్టించబడ్డ ఆలయం వేదగిరి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.బ్రహ్మపురాణం ప్రకారం ఈ నరసింహ కొండపై సప్తఋషులు యజ్ఞాన్ని నిర్వహించారని తెలుపబడుతోంది. ఈ యజ్ఞ త్రేతాగ్నులు మూడు కొండలైన వేదగిరి(నరసింహకొండ), రత్నగిరి (జొన్నవాడ) మరియు తల్పగిరి (రంగనాయకుల పేట) లపై ప్రతిష్టించబడ్డాయని తెలుపబడుతోంది.

రాతికట్టడాలపై ఉన్న సమాచారాన్ని బట్టి 9వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహ వర్మచే నిర్మించబడింది. ఆలయం చుట్టూ ఏడు కోనేర్లు ఉన్నాయి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఇంకా ఇక్కడ గుహలు ఉన్నాయి. వీటిని అశ్వత్థామ గుహలు అని అంటారు. వీటికి ఆ పేరు రావటానికి కారణం పూర్వం అశ్వత్థామ ఉపపాండవులను సంహరించాడు. ఆ పాపానికి నివారణ కోసం ఈ నాటికీ అశ్వత్థామ ఈ గుహలలో ఉండి తపస్సు చేస్తుంటాడని భక్తులు విశ్వసిస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వేదగిరి స్థలపురాణం ప్రకారం సప్త ఋషుల ఆధ్వర్యంలో కశ్యపుడు యాగాన్ని నిర్వహించాడు. ఆ సమయంలో త్రేతాగ్నులను రత్నగిరిగా విలసిల్లుతున్న జొన్నవాడలో, తల్పగిరిగా విలసిల్లుతున్న రంగనాయకుల పేటలో మరియు వేదగిరిలో ప్రతిష్ఠించాడు. కశ్యపుడు నిర్విఘ్నంగా యాగం పూర్తి చేసిన అనంతరం పూర్ణాహుతుని నిర్వహించాడు.

పూర్ణాహుతి పూర్తి కాగానే ఆ హోమగుండాల నుండి వెలుపలకి ఒక జ్యోతి అత్యంత తేజోవంతంగా వెలువడింది. ఆ జ్యోతి అక్కడ నుంచి ప్రయాణించి ఒక గుహలోకి ప్రవేశించింది. ఆశ్చర్యంగా చూస్తున్న కశ్యపమహర్షి తదితరులు ఆ జ్యోతి వెంబడే వెళ్ళారు. గుహలోకి ప్రవేశించగా వారికి జ్యోతికి బదులు నారసింహముని మూర్తి దర్శనమిచ్చింది. మహర్షులందరూ తమ పూర్వజన్మ సుకృతం వల్లనే ఇదంతా చూడగలిగామని భావిస్తూ స్వామికి నమస్కరించి ప్రార్థించారు.

వారు ఆ మూర్తిని అక్కడే ప్రతిష్ఠించారు. వారు ప్రతిష్ఠించి మూర్తియే నేడు వేదగిరి గుహలో భక్తుల పూజలను అందుకుంటున్న మూలవిరాట్టు. కోరిన కోర్కెలను ప్రసాదించే ఈ స్వామికి నిత్యం వేడుకగా పూజలు నిర్వహిస్తున్నారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మహర్షులు ఆనాడు నిర్వహించిన ఏడు హోమగుండాలు ఏడు కోనేరులుగా అక్కడే భక్తులకు దర్శనమిస్తున్నాయి. కశ్యపమహర్షి నిర్విహిస్తున్న యాగానికి యాగ సంరక్షకుడిగా ఉన్న గోవిందరాజ స్వామికి ఇక్కడ ఆలయం నిర్మితమై ఉంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

నెల్లూరుకి అన్ని ప్రముఖ ప్రాంతాల నుండి బస్సు లేదా రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నెల్లూరు చేరుకుని అక్కడ నుండి బస్సు లేదా ఆటో ద్వారా ఈ వేదగిరిని చేరుకోవచ్చు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner