వటసావిత్రి వ్రతం జ్యేష్ఠ మాసంలో అత్యంత ముఖ్యమైన వ్రతంగా పరిగణించబడుతుంది. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్ఠు, మాంగల్యభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వటవృక్షం (మర్రి చెట్టు) పూజతో పాటు, సతీమతుల అయిన సావిత్రీ దేవిని ఈ రోజున అత్యంత భక్తితో ఆరాధిస్తారు.
ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ వ్రత విశిష్టతను వివరిస్తూ, సావిత్రీ యమధర్మరాజునే ఓడించి, తన భర్త సత్యవానిని తిరిగి బ్రతికించిన ఘనతను గుర్తు చేశారు. ఆమె ధైర్యం, భక్తి, నిశ్ఛల ప్రేమకు ఇది చిరస్మరణీయ గుర్తుగా నిలుస్తుంది.
వ్రతాచరణలో క్షమ, దయ, దానం, శౌచం, ఇంద్రియనిగ్రహం, దేవపూజ, అగ్నిహోత్రం, సంతోషం వంటి విలువలను పాటించడం అత్యవసరం. వ్రతమేదైనా సరే, సంకల్పం ప్రధానమైనదిగా భావిస్తారు. వ్రత ఆచరణ ద్వారా ఉన్నత జీవితం గడపడానికి అర్హత చేకూరుతుంది.
జ్యేష్ఠ మాసం నక్షత్రంతో కూడిన పూర్ణిమగల మాసం. జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. ఈ మాసంలో వటసావిత్రి వ్రతంతో పాటు రంభావ్రతం వంటి ఇతర వ్రతాలు కూడా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
వటవృక్షం – ఒక దేవవృక్షం. ఇందులో వట మూలంలో బ్రహ్మా మధ్య భాగంలో శ్రీమహావిష్ణువు అగ్ర భాగంలో శివుడు నివసిస్తారని పూరాణాల వివరణ.