Vastu: ఇంట్లో ఈ ప్రదేశాలలో నెమలీకలను ఉంచండి.. వైవాహిక జీవితంలో సంతోషంతో పాటు ఎన్నో లాభాలు-vastu tips to keep peacock feathers at home positive energy will come wealth increases vastu doshas will go away ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu: ఇంట్లో ఈ ప్రదేశాలలో నెమలీకలను ఉంచండి.. వైవాహిక జీవితంలో సంతోషంతో పాటు ఎన్నో లాభాలు

Vastu: ఇంట్లో ఈ ప్రదేశాలలో నెమలీకలను ఉంచండి.. వైవాహిక జీవితంలో సంతోషంతో పాటు ఎన్నో లాభాలు

Peddinti Sravya HT Telugu
Jan 17, 2025 02:00 PM IST

Vastu: ఇంట్లో వాస్తు ప్రకారం నెమలి పింఛాన్ని పెట్టడం వలన చాలా మార్పు వస్తుంది. సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కృష్ణుడికి నెమలి పింఛం అంటే చాలా ఇష్టం. కృష్ణుడు నెమలి పింఛాన్ని శిరస్సుపై ధరిస్తారు.

Vastu: ఇంట్లో ఈ ప్రదేశాలలో నెమలీకలను ఉంచండి
Vastu: ఇంట్లో ఈ ప్రదేశాలలో నెమలీకలను ఉంచండి (pinterest)

ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఇంట్లో ఎప్పుడూ ఆనందం కలగాలని కోరుకుంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా జీవించడానికి అవుతుంది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి కూడా.

సంబంధిత ఫోటోలు

ఇంట్లో వాస్తు ప్రకారం నెమలి పింఛాన్ని పెట్టడం వలన చాలా మార్పు వస్తుంది. సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కృష్ణుడికి నెమలి పింఛం అంటే చాలా ఇష్టం. కృష్ణుడు నెమలి పింఛాన్ని శిరస్సుపై ధరిస్తారు. కృష్ణుడికి నెమలి పింఛం అంటే ఎంతో ప్రీతి. నెమలీక ఆయన జీవితంలో అంతర్భాగమైంది. నెమలీకని జీవితంలో భాగం చేసుకోవడం వలన సంతోషంగా ఉండవచ్చు. నెమలీకని ఇంట్లో పెట్టుకుంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి.

నెమలీకని ఇంట్లో ఉంచితే ఏం అవుతుంది?

నెమలీకని ఇంట్లో ఉంచితే చాలా సమస్యలు తొలగిపోతాయి. వాస్తు దోషాలు తొలగిపోయి. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. అలాగే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

1. వైవాహిక జీవితంలో సంతోషం

నెమలీకని ఇంట్లో ఉంచడం వలన వైవాహిక జీవితంలో కూడా సంతోషాన్ని పొందవచ్చు. పూజ గదిలో రెండు నెమలీకలని ఉంచడం వలన వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. వైవాహిక బంధంలో మాధుర్యాన్ని తీసుకువస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలంటే, ఇంట్లో పూజ మందిరంలో ఐదు నెమలీకలని పెట్టండి. ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇల్లంతా సంతోషంగా మారుతుంది.

2. వాస్తు దోషాలు

వాస్తు దోషాలను తొలగించడానికి నెమలీకలు సహాయపడతాయి. ఇంటి ప్రధాన ద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు లేకపోయినట్లయితే ప్రధాన ద్వారం పై వినాయకుడి కూర్చుని ఉండే ఫోటో పెట్టండి. అలాగే తలుపు పై మూడు నెమలీకలని ఉంచండి. ఇలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి.

3. సంతోషం

శుక్లపక్షంలో 9 లేదా 7 నెమలీకలతో గుండ్రంగా ఫ్యాన్ ఆకారంలో చేసి, వాటిని పూజ గదిలో ఉంచి పూజించడం వలన కుటుంబంలో సంతోషం కలుగుతుంది. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల్ని కూడా తొలగించుకోవచ్చు.

4. అనారోగ్య సమస్యలు

నెమలీక వ్యాధులను ఎదుర్కోవడానికి కూడా ప్రభావితంగా పనిచేస్తుంది. మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ అనారోగ్యానికి సంబంధించిన పేపర్లు లేదా రిపోర్టుల మధ్యలో నెమలీకను పెట్టండి. మంచి ఫలితం ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం