డైనింగ్ టేబుల్ ఏ దిశలో ఉండాలి.. వాస్తు ప్రకారం పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి!-vastu tips to keep dining table at home follow these simple remedies for positivity and happiness ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డైనింగ్ టేబుల్ ఏ దిశలో ఉండాలి.. వాస్తు ప్రకారం పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి!

డైనింగ్ టేబుల్ ఏ దిశలో ఉండాలి.. వాస్తు ప్రకారం పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

డైనింగ్ టేబుల్‌ను సరైన దిశలో ఉంచితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలకు అనుగుణంగా నిద్రపోయే దిశ, ఇంట్లో వస్తువుల ఏర్పాటు వంటి విషయాలు పాటిస్తారు. అలాగే డైనింగ్ టేబుల్‌ను కూడా సరైన దిశలో పెట్టాలి.

డైనింగ్ టేబుల్ ఏ దిశలో ఉండాలి (pinterest)

చాలామంది వాస్తు ప్రకారం జీవితం నడిపిస్తారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇది ఇబ్బందుల నుంచి బయటపడటానికి కూడా సహాయపడుతుంది.

వాస్తు ప్రకారం డైనింగ్ టేబుల్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డైనింగ్ టేబుల్‌ను సరైన దిశలో ఉంచితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలకు అనుగుణంగా నిద్రపోయే దిశ, ఇంట్లో వస్తువుల ఏర్పాటు వంటి విషయాలు పాటిస్తారు. అలాగే డైనింగ్ టేబుల్‌ను కూడా సరైన దిశలో పెట్టాలి.

డైనింగ్ టేబుల్ ని ఏ దిశలో పెడితే మంచిది?

  1. డైనింగ్ టేబుల్ ని పశ్చిమం, ఈశాన్యం, వాయువ్యం దిశలో ఉంచితే మంచిది.
  2. తూర్పు దిశలో ఉంచితే కుటుంబ సభ్యులకు నష్టాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
  3. తూర్పు లేదా ఆగ్నేయం వైపు ఉంచితే ఆహారం తినడంలో ఆసక్తి తగ్గిపోతుంది.
  4. డైనింగ్ టేబుల్‌ను ప్రవేశ ద్వారం ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచితే కుటుంబ సభ్యుల జీవితాల్లో అంతరాయాలు ఏర్పడతాయి.
  5. డైనింగ్ టేబుల్ ప్రాంతంలో సరైన వెలుతురు ఉండాలి.
  6. భోజనం చేయడంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. దక్షిణం వైపు చూస్తూ భోజనం చేయడం మంచిది కాదు. ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
  7. డైనింగ్ టేబుల్ చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూడాలి. టేబుల్ శుభ్రంగా ఉంటేనే సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

ఈ నియమాలను కూడా పాటిస్తే మంచిది

చెక్క ఫర్నిచర్ వాడడం మంచిది. వాస్తు ప్రకారం ఇది సానుకూల శక్తిని తీసుకువస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభావాలు పెరుగుతాయి.

టాయిలెట్ పరిసరాల్లో:

డైనింగ్ టేబుల్ ఎప్పుడూ టాయిలెట్లకు దూరంగా ఉంచాలి. దగ్గరగా ఉంచితే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. డైనింగ్ టేబుల్ విషయంలో ఈ వాస్తు నియమాలను పాటిస్తే, ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి ఇది సహకరిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.