Vastu: వాస్తు ప్రకారం క్యాలెండర్ ఏ దిశలో ఉండాలి? ఈ మార్పులు చేస్తే మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉండొచ్చు-vastu tips to keep calendar at home these changes will helps to spread positive energy happiness and peace check here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu: వాస్తు ప్రకారం క్యాలెండర్ ఏ దిశలో ఉండాలి? ఈ మార్పులు చేస్తే మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉండొచ్చు

Vastu: వాస్తు ప్రకారం క్యాలెండర్ ఏ దిశలో ఉండాలి? ఈ మార్పులు చేస్తే మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉండొచ్చు

Peddinti Sravya HT Telugu
Feb 01, 2025 04:30 PM IST

Vastu: సానుకూల శక్తి ప్రవహించి, సంతోషంగా ఉండవచ్చు. కొత్త సంవత్సరం క్యాలెండర్లని మీరు ఈపాటికే గోడలకు తగిలించి ఉంటారు. అయితే, నిజానికి చాలా మందికి తెలియక ఈ పొరపాటు చేస్తున్నారు. వాస్తు ప్రకారం క్యాలెండర్ ని పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహించి, సంతోషంగా ఉండవచ్చు.

Vastu: వాస్తు ప్రకారం క్యాలెండర్ ఏ దిశలో ఉండాలి?
Vastu: వాస్తు ప్రకారం క్యాలెండర్ ఏ దిశలో ఉండాలి? (pinterest)

చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. వాస్తు ప్రకారం మనం ఫాలో అయితే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లను ఏ దిశలో ఉంచాలో ఆ దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ప్రతిదీ ఉండేలా చూసుకుంటే వాస్తు దోషాలు కలగవు.

సంబంధిత ఫోటోలు

సానుకూల శక్తి ప్రవహించి, సంతోషంగా ఉండవచ్చు. కొత్త సంవత్సరం క్యాలెండర్లని మీరు ఈపాటికే గోడలకు తగిలించి ఉంటారు. అయితే, నిజానికి చాలా మందికి తెలియక ఈ పొరపాటు చేస్తున్నారు. వాస్తు ప్రకారం క్యాలెండర్ ని పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహించి, సంతోషంగా ఉండవచ్చు.

మరి మీరు కూడా మీ క్యాలెండర్ ని వాస్తు ప్రకారం పెట్టారా లేదా అనేది ఇప్పుడు చూడండి. ఒకవేళ తప్పు దిశలో పెట్టినట్లయితే వెంటనే మార్చండి. ఈ చిన్న మార్పు మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించడానికి సహాయపడుతుంది.

క్యాలెండర్ ని ఏ దిశలో ఉంచితే మంచిది?

  1. చాలా మంది ఎక్కడ నచ్చితే అక్కడ క్యాలెండర్లను పెడుతూ ఉంటారు. దాని వలన ప్రతికూల శక్తి ప్రవాహానికి కారణం అవుతుంది. ప్రయోజనాలను పొందడానికి ఇంట్లో క్యాలెండర్ ని వాయువ్యం లేదా తూర్పు వైపు ఉంచితే మంచిది.
  2. తూర్పు దిశ విజయం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
  3. ఈ దిశలో క్యాలెండర్ ని పెట్టడం వలన ఏడాది పొడవునా శ్రేయస్సు, పురోగతి కలుగుతాయి.

పాత క్యాలెండర్లని ఎందుకు తొలగించాలి?

చాలా మంది పాత క్యాలెండర్లను కూడా ఇంట్లో ఉంచుతూ ఉంటారు. దాని వలన సానుకూల శక్తి వ్యాపించకుండా ప్రతికూల ప్రభావం పడుతుంది. పాత క్యాలెండర్లు తాజా శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయి. కొత్త అవకాశాలు కనిపించకుండా నిరోధించవచ్చు అని జ్యోతిష్యులు చెప్తున్నారు.

సానుకూల మార్పులని స్వాగతించడానికి పాత క్యాలెండర్లను తొలగిస్తే మంచిది. ఇలా ఈ విధంగా మీరు వాస్తు ప్రకారం అనుసరించినట్లయితే సానుకూల శక్తి ప్రవహించి సంతోషంగా ఉండొచ్చు. శ్రావ్యమైన, సంపన్నమైన నివాస స్థలాన్ని సృష్టించొచ్చు. విజయవంతమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మార్చుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం